News


లార్జ్‌క్యాప్స్‌ మార్కెట్‌ ఇది: అజయ్‌ శ్రీవాస్తవ

Friday 8th November 2019
Markets_main1573152673.png-29424

దీర్ఘకాలం పాటు మిడ్‌క్యాప్‌నకు ‘డెడ్‌ ఎండ్‌ స్ట్రీట్‌’ (ముగింపు వీధి)గా పేర్కొన్నారు డైమెన్షన్స్‌ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ సీఈవో అజయ్‌ శ్రీవాస్తవ. ఇండియన్‌ మార్కెట్‌ లార్జ్‌క్యాప్స్‌ మార్కెట్‌గా అభివర్ణించారు. ఈ మేరకు తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు. 

 

ప్రస్తుత మార్కెట్లలో ఎలా వ్యవహరించాలి?
రికవరీ దశలోకి వెళ్లాం. ఈ మార్కెట్‌ ఏ ఒక్కరికీ అద్భుతమైన రాబడులను ఇచ్చింది లేదు. ఎందుకంటే భారీ పతనం నుంచి ఇది బయటపడింది. ఆ తర్వాత వెనక్కి వచ్చింది. అంటే పోర్ట్‌ఫోలియో మెరుగ్గా మారడం లేదా ఉన్నచోటే ఉండడం జరిగింది. మంచి రాబడులు వచ్చినప్పుడే సంబరం చేసుకుంటారు. కానీ, రాబడులు అన్నవి లేవు. ప్రస్తుత మన మార్కెట్లు ఫండమెంటల్స్‌ ఆధారంగా ఉన్నాయని ఎవరూ అంగీకరించరు. చారిత్రకంగా కనిష్ట స్థాయిలో వృద్ధి, చారిత్రకంగా గరిష్ట స్థాయిలో మార్కెట్‌ పరస్పరం మంచిగా లేవు. ఇందుకు కారణాలు.. అంతర్జాతీయంగా ఉన్న లిక్విడిటీ. అంతర్జాతీయ మార్కెట్లలో వడ్డీ రేట్లు ప్రతికూలంగా (మైనస్లో) ఉన్నాయి. దాంతో వారు పెట్టుబడులను ఇక్కడికి తరలిస్తున్నారు. ఈ సైకిల్‌ ముగింపుకొస్తే ఎంటన్న ఆందోళన అయితే ఉంది. ప్రభుత్వం కూడా రక్షణాత్మక ధోరణితోనే ఉంది. పెద్ద రంగాలకే ముందు ప్రోత్సాహకాలు ఇస్తోంది. కంపెనీల ఫలితాలను పరిశీలిస్తే అధిక ప్రయోజనం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు రూపంలోనే ఉంది. ఫలితాల్లో అధిక భాగం బలహీనంగా, మోస్తరుగానే ఉన్నాయి. 

 

పెట్టుబడుల్లో వేటికి ప్రాధాన్యం?
ప్రభుత్వరంగ సంస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుడులు ఉన్నాయి. ఇన్వెస్ట్‌ చేసి ఏడాది అయింది. కారణం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కాదు. డివిడెండ్‌ రాబడే. ఇది గణనీయంగా ఉంటోంది. ప్రభుత్వరంగంలో చమురు మార్కెటింగ్‌ కంపెనీల్లో (ఓఎంసీలు) దీర్ఘకాలంగా పెట్టుబడులు పెట్టి ఉన్నాం. అలాగే, నాల్కోలోనూ ఇన్వె‍స్ట్‌ చేశాం. మంచి డివిడెండ్‌ ఇస్తోంది. అలాగే, ఎన్‌ఎండీసీలోనూ పెట్టుబడులు ఉన్నాయి. కంటెయినర్‌ కార్పొరేషన్‌లో పెట్టుబడులు లేవు. ప్రభుత్వరంగంలో మెటల్‌, ఓఎంసీలు, పవర్‌ కంపెనీల పట్ల సానుకూలంగా ఉన్నాం. బీఈఎల్‌ సరైన తీరులో పనిచేస్తుందన్న నమ్మకం లేదు. మెటల్స్‌, ఫార్మా రంగాల పట్ల బుల్లిష్‌గా ఉన్నాం. 



You may be interested

రియల్‌ ఎస్టేట్‌ ఫండ్‌తో వీటికి లాభం!

Friday 8th November 2019

నిలిచిపోయిన హౌసింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి రూ.25,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఏఐఎఫ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం రియల్‌ ఎస్టేట్‌ రంగంతోపాటు, ఇళ్ల నిర్మాణంతో అనుసంధానమైన ఉన్న పలు ఇతర రంగాల కంపెనీలకూ ప్రోత్సాహం ఇవ్వనుంది. విశ్లేషకుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.   ‘‘నిలిచిపోయిన నివాసిత రియల్‌ ఎస్టేట్‌ రంగ ప్రాజెక్టులను వేగంగా ముందుకు కదిలించేందుకు రూ.25,000 కోట్లతో ఏఐఎఫ్‌ ఏర్పాటు చేయడమే కాకుండా, అవసరమైతే మరింత నిధిని సమకూర్చనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడాన్ని మార్కెట్లు

రెండోరోజూ కొనసాగిన రికార్డు ర్యాలీ

Thursday 7th November 2019

5నెలల తరువాత 12వేల పైన ముగిసిన నిఫ్టీ మరో కొత్త రికార్డును నమోదు చేసిన సెన్సెక్స్‌ మార్కెట్లో రెండోరోజూ రికార్డుల ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్‌ ఇంట్రాడే 218 పాయింట్లు లాభపడి 40,688.27 కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరికి 184 పాయింట్ల లాభంతో 40,654 వద్ద స్థిరపడింది. మరోసూచీ నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 12,021 వద్ద స్థిరపడింది. సుమారు ఐదు నెలల అనంతరం నిఫ్టీ 12000 పైన ముగియడం ఇదే మొదటిసారి

Most from this category