News


వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్ల తగ్గింపు-కార్పొరేట్ల అంచనా

Friday 24th January 2020
Markets_main1579839649.png-31156

రూ. 2.5 లక్షల పరిమితి పెంపు?
కేపీఎంజీ సర్వే నివేదిక వెల్లడి

వచ్చే నెల 1న లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్‌లో వ్యక్తిగత పన్ను రేట్లలో కోత ఉండవచ్చని పారిశ్రామికవేత్తలు అంచనా వేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూపొందిస్తున్న బడ్జెట్‌పై ట్యాక్స్‌ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ నిర్వహించిన సర్వేలో ఇంకా మరిన్ని ఆశలు, అంచనాలు వెలువడ్డాయి. వివరాలు చూద్దాం..

మినహాయింపుల పెంపు?
ప్రస్తుతం అమలు చేస్తున్న రూ. 2.5 లక్షల పన్ను వర్తించని ఆదాయ పరిమితిని పెంచే వీలున్నట్లు అత్యధికులు అంచనా వేశారు. ఇదే విధంగా స్టాండర్డ్‌ డిడక‌్షన్‌ పెంపుతోపాటు.. గృహ రుణాలపై ప్రోత్సాహకాలు ప్రకటించే వీలున్నట్లు మరికొంతమంది భావిస్తున్నారు. ఇప్పటికే కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించిన నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయ పన్నులోనూ కోతలు పెట్టే వీలున్నట్లు అత్యధికులు పేర్కొన్నారు. గతేడాది కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 25 శాతానికి కుదించిన విషయం విదితమే. వ్యవస్థలో వినియోగం, డిమాండ్‌ నీరసించిన కారణంగా ప్రభుత్వం ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి పెంచే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. 2020 మార్చి తదుపరి ఏర్పాటు చేసే ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌) ఎగుమతి యూనిట్లకు సైతం​ట్యాక్స్‌ హాలిడే ప్రకటించే వీలున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేట్‌ ట్యాక్స్‌ బాటలోనే వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లను తగ్గించడం ద్వారా పెట్టుబడులు, వినియోగాన్ని పెంచేందుకు వీలుంటుందని అత్యధిక శాతంమంది అభిప్రాయపడినట్లు కేపీఎంజీ ట్యాక్సేషన్‌ కోహెడ్‌ హితేజ్‌ గజారియా తెలియజేశారు. 



You may be interested

వొడాఫోన్‌ ఐడియా మూసివేత ఖాయమా?

Friday 24th January 2020

కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల ఉపశమనాలు ప్రకటించినా వొడాఫోన్‌ఐడియా(వీఐఎల్‌)ను గట్టెక్కించలేవని, ఏ విధమైన ఫైనాన్షియల్‌ బెయిల్‌అవుట్స్‌ కూడా వీఐఎల్‌ను తిరిగి జియో, ఎయిర్‌టెల్‌తో పోటీలో నిలపలేవని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా వీఐఎల్‌ను బయటపడేయడం చాలా ఖరీదైన వ్యవహారంగా గుర్తిస్తుందని డాయిష్‌బ్యాంక్‌ ఒక నివేదికలో అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో వీఐఎల్‌ను దివాలా తీయించి అనంతరం ఆస్తుల వేలం సమయంలో తిరిగి కొనుగోలు చేయవచ్చని ఆదిత్య బిర్లాగ్రూప్‌ భావించవచ్చని తెలిపింది. అయితే

ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌

Friday 24th January 2020

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం ఫ్లాట్‌గా మొదలైంది. సెన్సెక్స్‌ 10 పాయింట్ల నష్టంతో 41,377 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు క్షీణించి 12,174 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. చైనాలో కరోనా వైరస్‌ ప్రబలుతోందన్న ఆందోళనలతో నేడు ఆసియాలో ప్రధాన మార్కెట్లు నష్టాలో ట్రేడ్‌ అవుతున్నాయి.  గురువారం రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు ఇంట్రాడేలో గరిష్టస్థాయిని అందుకున్నప్పటికీ చివరికి

Most from this category