News


గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో భారత్‌ 52వ స్థానం

Thursday 25th July 2019
Markets_main1564034040.png-27300

న్యూఢిల్లీ: గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ (జీఐఐ)-2019లో భారత్‌ ఐదు స్థానాలు మెరుగుపరచుకుంది. ప్రపంచంలోని అత్యంత వినూత్న ఆర్థిక వ్యవస్థల ఆధారంగా రూపొందించే ఈ జాబితాలో మొత్తం 129 దేశాలు ఉండగా.. భారత్‌ 52వ స్థానాన్ని సొంతంచేసుకుంది. మేధో సంపత్తి ఫైలింగ్‌ రేట్స్‌ నుంచి మొబైల్ అప్లికేషన్ సృష్టి, విద్య వ్యయం వంటి మొత్తం 80 ఇండికేటర్స్ ఆధారంగా ఈ ర్యాంక్‌ నిర్ణయం జరుగుతుంది. ఇక ప్రపంచంలోని టాప్ 100 సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ల జాబితాలో న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలు స్థానం సంపాదించాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ ఈ సమాచారాన్ని బుధవారం ఇక్కడ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారత్‌ తొలుత 25వ స్థానానికి ఆ తరువాత 10వ స్థానానికి చేరుకునేలా లక్ష్యాన్ని నిర్దేశించాం’ అని వ్యాఖ్యానించారు. మధ్య, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో భారత్‌ టాప్‌లో ఉన్నట్లు తెలిపారు. కార్మిక ఉత్పాదకత పెరుగుదల, సాంకేతిక ఉత్పాదన వృద్ధి, మేధో సంపత్తి సంబంధిత అంశాల మెరుగుదలతో పాటు సంస్థలు, మానవ మూలధనం, పరిశోధన పెరిగిన నేపథ్యంలో దేశ ర్యాంక్‌ మెరుగుపడింది. 



You may be interested

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ కౌంటర్లలో అమ్మకాలు..

Thursday 25th July 2019

కెనరా బ్యాంక్‌ 3 శాతం డౌన్‌ ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లు గురువారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 11.15 సమయానికి 20.85 పాయింట్లు కోల్పోయి 2,836.85 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కెనరా బ్యాంక్‌ క్యూ1 ఫలితాలు మార్కెట్‌ అంచానాలను అందుకోవడంలో విఫలమవ్వడంతో  కెనరా బ్యాంక్‌ షేరు 3.04 శాతం నష్టపోయింది. క్యూ1లో ఈ బ్యాంక్‌ రూ.329.07 కోట్ల నికర లాభాన్ని ప్రకటించడం గమనర్హం. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌లో

హమ్మయ్య! హైదరాబాద్‌కు బీమా ఉంది!!

Thursday 25th July 2019

83 శాతం హైదరాబాదీలకు జీవిత బీమా భద్రత దేశంలో మిగతా ప్రాంతాల వారికన్నా టాప్‌ మ్యాక్స్‌ లైఫ్‌ సర్వేలో వెల్లడి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జీవిత బీమా విషయంలో దేశంలోని మిగతా వారితో పోలిసే్త హైదరాబాదీలు చాలా మెరుగని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ దాదాపు 83 శాతం మందికి ఏదో ఒక జీవిత బీమా పాలసీ ఉంది. ఇలా ఏదో ఒక పాలసీ ఉన్నవారి జాతీయ సగటు 65 శాతం. దీంతో పోలిస్తే భాగ్యనగర

Most from this category