News


ఇండియా సిమెంట్స్‌ జోరు- దమానీ దన్ను

Tuesday 17th March 2020
Markets_main1584423535.png-32526

ఇండియా సిమెంట్స్‌పై డీమార్ట్‌ ప్రమోటర్ల ఆసక్తి
తాజాగా 4 శాతం వాటా కొనుగోలు
ఇండియా సిమెంట్స్‌లో 16 శాతానికి  దమానీ వాటా

ఇటీవల కొద్ది రోజులుగా దక్షిణాది కంపెనీ ఇండియా సిమెంట్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ వస్తున్న రాధాకిషన్‌ దమానీ తాజాగా 4 శాతం వాటాను కొనుగోలు చేశారు. దీంతో ఇండియా సిమెంట్స్‌లో ప్రస్తుతం డీమార్ట్‌ స్టోర్ల ప్రమోటర్‌ దమానీ కుటుంబం వాటా 16 శాతానికి ఎగసింది. ఈ వార్తల నేపథ్యంలో ఇండియా సిమెంట్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఇండియా సిమెంట్స్‌ షేరు దాదాపు 9 శాతం దూసుకెళ్లింది. రూ. 104ను తాకింది. తదుపరి ఉదయం 10.45 ప్రాంతంలో 5 శాతం జంప్‌చేసి రూ. 101 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల ఈ షేరు అంటే మార్చి 12కల్లా రూ. 80కు చేరింది. తదుపరి మళ్లీ జోరందుకోవడం ప్రస్తావించదగ్గ విషయం. ఇతర వివరాలు చూద్దాం...

ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా
నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరి 26న డీమార్ట్‌ స్టోర్ల అధినేత రాధాకిషన్‌ దమానీ కుటుంబం 7.27 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఇండియా సిమెంట్స్‌ వెల్లడించింది. దీంతో దమానీ కుటుంబ వాటా ఇండియా సిమెంట్స్‌లో 11.98 శాతానికి చేరింది. తదుపరి అంటే ఫిబ్రవరి 26- మార్చి 16 మధ్యలో మరో 4.02 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు ఇండియా సిమెంట్స్‌ బీఎస్‌ఈకి తాజాగా వెల్లడించింది. వెరసి ప్రస్తుతం ఇండియా సిమెంట్స్‌లో దమానీ కుంటుంబీకుల వాటా 16 శాతాన్ని తాకింది. కాగా.. ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా గోపీకిషన్‌, రాధాకిషన్‌, శక్తికాంతదేవి దమానీలతోపాటు డిరైవ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ 1.24 కోట్లకుపైగా షేర్లను కొనుగోలు చేశారు. ఇది ఇండియా సిమెంట్స్‌ ఈక్విటీలో 4.02 శాతం వాటాకు సమానం. ఈ నేపథ్యంలో ప్రస్తుత కేలండర్‌ ఏడాది(2020)లో మార్కెట్లు అమ్మకాలతో డీలా పడినప్పటికీ ఇండియా సిమెంట్స్‌ షేరు 34 శాతం ర్యాలీ చేసింది. ఇదే సమయంలో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 24 శాతం పతనంకావడం గమనార్హం!



You may be interested

యస్‌బ్యాంక్‌ 73శాతం జంప్‌..!

Tuesday 17th March 2020

మూడీస్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌  కలిసొచ్చిన ట్రేడింగ్‌పై ఆంక్షలు..! ప్రైవేట్‌ రంగ బ్యాంకు యస్‌బ్యాంక్‌ షేరు ధర మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఏకంగా 73శాతం ర్యాలీచేసింది.రేటింగ్‌ ఏజెన్సీ యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు యస్‌బ్యాంక్‌ ట్రేడింగ్‌ ఆంక్షలు విధించడటం ఇందుకు కారణమాయ్యయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు మునుపటి ముగింపు ధర(రూ.37.10)తో పోలిస్తే 10లాభంతో రూ.40.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తాజాగా యస్‌బ్యాంక్‌లో ఆర్‌బీఐతో పాటు పలు ప్రైవేట్‌రంగ

నేటివార్తల్లోని షేర్లు

Tuesday 17th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం స్టాక్‌ మర్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌: స్పిన్నర్స్‌కు ప్రత్యేకమైన ఫైబర్‌ను సరఫరా చేసే గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ తన ఆదిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసిందన్న ఆరోపణతో కాంపిటీషన్‌ కమిషన్‌ రూ.302 కోట్ల జరిమానా విధించింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌: ఉదయ్‌ కోటక్‌కు ఇచ్చిన సడలింపును ప్రస్తావిస్తూ ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌లో 15 శాతంగా ఉన్న తమ వాటాను 26 శాతానికి పెంచుకునేందుకు అనుమతివ్వాలని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రమోటర్లు ఆర్బీఐని

Most from this category