News


ఇండియా సిమెంట్స్‌, నవీన్‌ ఫ్లోరిన్‌- యమస్పీడ్‌

Wednesday 26th February 2020
Markets_main1582692760.png-32101

14 శాతం జంప్‌చేసిన ఇండియా సిమెంట్స్‌
10 శాతం దూసుకెళ్లిన నవీన్‌ ఫ్లోరిన్‌ షేరు

కరోనా వైరస్‌ విస్తరించవచ్చన్న ఆందోళనలతో అమెరికా వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) అప్రమత్తతను ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పతన బాట పట్టాయి. వరుసగా రెండు రోజుల్లో అమెరికా మార్కెట్లు 6 శాతం కుప్పకూలగా.. దేశీయంగానూ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఉదయం 10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 289 పాయింట్లు పతనమై 39,992కు చేరగా.. నిఫ్టీ 84 పాయింట్ల క్షీణతతో 11,714 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ రాధాకిషన్‌ దమానీ కుటుంబం వాటా కొనుగోలు చేసిన వార్తలతో ఇండియా సిమెంట్స్‌ కౌంటర్‌ జోరందుకోగా.. గ్లోబల్‌ కంపెనీతో కాంట్రాక్టు వార్తలతో వరుసగా రెండో రోజు నవీన్‌ ఫ్లోరిన్‌ ఇంటర్నేషనల్‌ కౌంటర్‌ దూకుడు చూపుతోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

ఇండియా సిమెంట్స్‌
డీమార్ట్‌ అధినేత రాధాకిషన్‌ దమానీ సోదరుడు గోపీకిషన్‌ దమానీ తాజాగా ఇండియా సిమెంట్స్‌లో 2.75 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల డేటా పేర్కొంది. ఎన్‌ఎస్‌ఈలో బల్క్‌డీల్స్‌ ద్వారా 85.22 లక్షల షేర్లకుపైగా గోపీకిషన్‌ సొంతం చేసుకున్నారు. ఇది 2.75 శాతం వాటాకు సమానంకాగా.. షేరుకి రూ. 82.7 ధరలో ఈ నెల 25న వీటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా.. మరోపక్క ఇండియా సిమెంట్స్‌లో ఇప్పటికే రాధాకిషన్‌ దమానీ 4.73 శాతం వాటా కలిగి ఉన్నారు. గత డిసెంబర్‌ త్రైమాసికంలో వాటాను పెంచుకున్నారు. 2019 సెప్టెంబర్‌ నాటికి ఇండియా సిమెంట్స్‌లో రాధాకిషన్‌ దమానీ  వాటా 1.3 శాతమే.   అంటే సోదరులిద్దరికీ కలిపి ఇండియా సిమెంట్స్‌లో 7.48 శాతం వాటా ఉన్నట్టయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇండియా సిమెంట్స్‌ షేరు 14.4 శాతం దూసుకెళ్లి రూ. 100 సమీపంలో ట్రేడవుతోంది. తొలుత రూ. 102 వరకూ ఎగసింది.

నవీన్‌ ఫ్లోరిన్‌ ఇంటర్నేషనల్‌
ఒక గ్లోబల్‌ కంపెనీతో కొన్నేళ్లపాటు అమల్లో ఉండే(మల్టి ఇయర్‌) కాంట్రాక్టును కుదుర్చుకున్నట్లు నవీన్‌ ఫ్లోరిన్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. 41 కోట్ల డాలర్ల(సుమారు రూ. 2,900 కోట్లు) విలువైన ఈ కాంట్రాక్టులో భాగంగా ఫ్లోరోకెమికల్స్‌ విభాగంలో హైపెర్ఫార్మెన్స్‌ ప్రొడక్టును సరఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 440 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. అనుబంధ సంస్థ ద్వారా గుజరాత్‌లోని  దహేజ్‌లో ఈ ప్లాంటును నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో నవీన్‌ ఫ్లోరిన్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 10 శాతం జంప్‌చేసి రూ. 1597 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1620 వరకూ పురోగమించింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం! కొనేవాళ్లే తప్ప అమ్మకందారులు కరవుకావడంతో మంగళవారం సైతం ఈ షేరు 20 శాతం దూసుకెళ్లి 1454 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. You may be interested

మెటల్‌ షేర్లలో అమ్మకాలు: జిందాల్‌ స్టీల్‌ 5శాతం డౌన్‌

Wednesday 26th February 2020

అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లకు డిమాండ్‌ తగ్గడంతో దేశీయంగానూ మెటల్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయింది. కరోనా వైరస్‌ వ్యాధితో చైనాలో మెటల్‌ ఉత్పత్తి తగ్గిపోవడంతో అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లకు డిమాండ్‌ తగ్గింది. దీంతో నేటి మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు మెటల్‌ షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపారు. ఒక దశలో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌

రూ.300 తగ్గిన పుత్తడి!

Wednesday 26th February 2020

కోవిడ్‌-19 ప్రభావంతో వరుసగా పెరుగుతూ పోయిన బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గు ముఖం పట్టాయి. బుధవారం దేశీ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే రూ.300 తగ్గి రూ.42,570.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ నిన్నటితో పోలిస్తే 16 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,642 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. (మంగళవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)  

Most from this category