News


ఐదేళ్ల కనిష్ఠానికి ఇండియాబుల్స్‌ హౌసింగ్‌..30 శాతం క్రాష్‌

Monday 30th September 2019
Markets_main1569834651.png-28628

ప్రమోటర్లు నిధుల్ని తరలించారని, ఇతర ఆర్థిక అవకతవకాలకు పాల్పడ్డారంటూ ఒక ఎన్‌జీఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపణల్ని పరిశీలించాలంటూ ఢీల్లీ హైకోర్టు నిర్ణయించడంతో సోమవారం ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నిలువునా పతనమయ్యింది.  మధ్యాహ్నం 2.32 సమయానికి 30.86 శాతం లేదా రూ. 120.40 కోల్పోయి ఐదేళ్ల కనిష్టస్థాయి రూ. 269.70  వద్ద ట్రేడవుతోంది. భారీ అమ్మకాల ఒత్తిడి ఎదురవ్వడంతో రూ. 240.05 వద్ద ఏడాది కనిష్ఠానికి పడిపోయిన ఈ షేరు, మధ్యాహ్నం సెషన్‌లో కొంత రికవరి అయ్యింది. గత సెషన్‌లో రూ. 390.10 వద్ద ముగిసింది.

లక్ష్మివిలాస్‌ బ్యాంక్‌ దెబ్బ కూడా...

అధిక మొత్తంలో మొండిబకాయిలను కలిగివుండడంతోపాటు, మూలధనం తగినంత లేకపోవడం, వరుసగా రెండేళ్ల నుంచి ఆస్తులపై ప్రతికూల రాబడులను ఇవ్వడం వలన లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌(ఎల్‌వీబీ)పై దిద్దుబాటు చర్యలను(ప్రాంప్టడ్‌ కరెక్టివ్‌ యాక్సన్‌(పీసీఏ)) ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌) ప్రారంభించడంతో ఈ బ్యాంక్‌ షేరు విలువ సోమవారం ట్రేడింగ్‌లో లోవర్‌ సర్క్యూట్‌ను తాకింది. కాగా ఈ బ్యాంక్‌ను విలీనం చేసుకుందామని ప్రయత్నాలుచేస్తున్న ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరుపై ఈ ప్రభావం కూడా పడింది. 



You may be interested

రెండు దశాబ్దాల కనిష్టానికి రిలయన్స్‌ క్యాపిటల్‌ షేర్లు

Monday 30th September 2019

అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన ఆర్థిక సేవల సంస్థ రిలయన్స్‌ క్యాపిటల్‌ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 20ఏళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ లెండింగ్‌ వ్యాపారం నుంచి నిష్క్రమిస్తుందని గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ సోమవారం ప్రకటించడం షేర్ల పతనానికి కారణమైంది. నేడు ఈ కంపెనీ షేర్లు బీఎస్‌ఈలో రూ.28.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అనిల్‌ అంబానీ నేతృత్వంలోని నేడు ముంబాయిలో షేర్‌హోల్డర్ల వార్షిక సాధారణ

హెచ్‌డీఐఎల్‌ .. లోయర్‌ సర్క్యూట్‌ !

Monday 30th September 2019

పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంకు సంక్షోభానికి కారణమైనట్లు భావిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థ హెచ్‌డీఐఎల్‌ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 5శాతం నష్టపోయి లోయర్‌ సర్క్యూట్‌ వద్ద లాక్‌ అయ్యాయి. పీఎంసీ బ్యాంకు మొత్తం రుణ ఆస్తులు రూ.8,800 కోట్లు కాగా, ఇందులో రూ.6,500 కోట్లకు పైగా ఒక్క హెచ్‌డీఐఎల్‌కే ఇవ్వడం జరిగినట్టు సస్పెండైన బ్యాంకు ఎండీ జాయ్‌థామస్‌ అంగీకరించినట్టు సమాచారం. బ్యాంకు మొత్తం రుణ ఆస్తుల్లో ఈ

Most from this category