STOCKS

News


ఆసియాలో ఇండియా, మలేషియా మార్కెట్లే ఖరిదైనవి!

Thursday 3rd October 2019
Markets_main1570097235.png-28699

ఆసియా ఈక్విటీ మార్కెట్‌లలో ఇండియా, మలేషియా ఈక్విటీ మార్కెట్లు చాలా ఖరీదుగా ట్రేడవుతున్నాయని రెఫినిటివ్‌ ఓ నివేదికలో పేర్కొంది. యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ కొంత సరళతరం అవ్వడంతో పాటు, ప్రధాన కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడంతో గత నెల కాలంలో చాలా వరకు ఇతర ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయని ఈ కంపెనీ తెలిపింది. దేశీయ మౌలిక రంగాన్ని మెరుగుపరచడానికి, ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు సెప్టెంబర్‌ నెలలో కార్పోరేట్‌ ట్యాక్స్‌ను ప్రభుత్వం తగ్గిం‍చిన విషయం తెలిసిందే. దీంతో దేశీయ ఈక్విటీ షేర్లు భారీగా పెరిగాయి. ఫలితంగా అక్టోబర్‌ 2 నాటికి దేశీయ ఈక్విటీ మార్కెట్‌ పీఈ(ప్రైస్‌ టూ ఎర్న్‌ రేషియో) 16.42 శాతానికి చేరుకుంది. ఇది జులై నెలలో 15.98 శాతంగానే ఉండడం గమనార్హం. మొత్తంగా సెప్టెంబర్‌ నెలలో ఇండియా ఈక్విటీ మార్కెట్‌ 4.1 శాతం పెరిగింది. 
    అదే విధంగా మలేషియా మార్కెట్‌ పీఈ 15.66 శాతంగా ఉంది. గత నెలలో మలేషియా ఈక్విటీ మార్కెట్‌ షేర్లు 1.75 శాతం పడిపోయినప్పటికి ఆసియా మార్కెట్లలో రెండవ ఖరిదైనా మార్కెట్‌గా నిలవడం గమనార్హం. ‘గత కొన్ని నెల నుంచి మలేషియా(ఎఫ్‌టీఎస్‌ఈ బుర్షా మలేషియా ఇండెక్స్‌) మార్కెట్‌ వాల్యుషన్‌ తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం లాభాల వృద్ధి అంచనాలు 4 శాతం తగ్గే అవకాశం ఉండడంతో ఈ మార్కెట్‌ వాల్యుషన్‌ పెరిగే అవకాశం లేదు’ అని జెఫ్ఫరిస్‌ బ్రోకరేజి తెలిపింది. ఎంఎస్‌సీఐ(మోర్గాన్‌ స్టాన్లీ క్యాపిటల్‌ ఇండెక్స్‌) ఆసియా పసిఫిక్‌ షేర్లు, సెప్టెంబర్‌ నెలలో 2.13 శాతం పెరిగాయి. వీటి 12 నెలల పీఈ ఐదు నెలల గరిష్టమయిన 13.14 రెట్లుకు చేరుకుంది. కాగా అగష్టులో ఇది 12.78 శాతంగా ఉన్న విషయం గమనార్హం. 
 చైనా, హాంగ్‌కాంగ్‌, దక్షిణ కొరియా మార్కెట్‌ల పీఈ 11 మల్టిపుల్స్‌ లేదా అంతకంటే తక్కువ స్థాయిల వద్ద ఉన్నాయని, ఈ మార్కెట్లు ఆసియాలో చౌకగా ట్రేడవుతున్నాయని రెఫినిటివ్‌ తెలిపింది. ప్రాంతియ కంపెనీలు, అంతర్జాతీయ కంపెనీల కంటే కొంత రాయితీతో ట్రేడవుతున్నాయని వివరించింది. You may be interested

నాలుగో రోజూ నష్టాలే..!

Thursday 3rd October 2019

మెటల్‌, ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌, ఐటీ రంగ షేర్ల పతనంతో మార్కెట్‌కు నాలుగో రోజూ నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్‌ 198 పాయింట్ల పతనమై 38,107 వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు నష్టపోయి 11,313 వద్ద స్థిరపడింది. ఆర్థిక మందగమన భయాలతో ప్రపంచ మార్కెట్లల్లో నెలకొన్న అస్థిరత, నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్షా సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత, ఇటీవల అమెరికా, యూరప్‌లలో విడుదలైన బలహీన ఆర్థిక

పెరిగిన చెల్లింపుల కాలవ్యవధి..జీ షేరు 6% అప్‌

Thursday 3rd October 2019

రుణ చెల్లింపుల కాల వ్యవధిని రుణదాతలు ఇంకో ఆరు నెలలు పొడిగించారని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రకటించడంతో ఈ కంపెనీ షేరు విలువ గురువారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో 9 శాతం లాభపడింది. ‘జీ లోని కొంత వాటాను విక్రయించేందుకు, జీ, రుణ దాతలు ఒక పరిష్కార మార్గం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతోపాటు అదనంగా 10 శాతం వాటాను విక్రయించేందుకు ప్రతిపాదనలు జరిగాయి’ అని జీ ఎంటర్‌టైన్‌ సీఈఓ పునిత్‌ గొయెంక్‌

Most from this category