News


ఈఎంఐలలో పన్ను డిమాండ్‌ చెల్లింపు?

Tuesday 21st January 2020
Markets_main1579589586.png-31069

బిజినెస్‌లు, కంపెనీలకు వెసులుబాటు యోచన

దేశంలోనే అత్యధికంగా పన్ను చెల్లింపులకు వేదికగా నిలుస్తున్న ముంబైలో ఇకపై పన్ను చెల్లింపునకు వాయిదా పద్ధతిలో అనుమతించనున్నట్లు తెలుస్తోంది. కఠిన లిక్విడిటీ పరిస్థితులు, బిజినెస్‌లకు ఎదురయ్యే సవాళ్లు వంటి ప్రతికూలతల నేపథ్యంలో అవసరాలకు అనుగుణంగా ముంబైలోని ట్యాక్స్‌ కమిషనర్లు చర్యలు చేపట్టన్నుట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే బిజినెస్‌లు, కంపెనీలకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. 

తొలుత 20 శాతం చెల్లింపు
ఆదాయపన్ను శాఖ అధికారి నుంచి డిమాండ్‌ ఆర్డర్‌ అందుకున్న తదుపరి పన్ను చెల్లింపుదారులు ఇప్పటివరకూ తొలుత 20 శాతం మొత్తాన్ని నెల రోజుల్లోగా చెల్లించవలసి ఉంటుంది. ఈ ఆర్డర్లపై ఆదాయపన్ను శాఖ కమిషనర్‌ వద్ద అపీల్‌కు వెళ్లిన సందర్భాలలో 20 శాతం చెల్లింపు అమలవుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇకపై ఈ మొత్తాన్ని విడతలవారీగా చెల్లించేందుకు అనుమతించనున్నట్లు తెలియజేశాయి. వీటిని సంబంధిత కేసులవారీగా అనుమతించనున్నట్లు వివరించాయి. ఇదేమీ నిబంధనకాదని.. కేసునుబట్టి ఇందుకు అనుమతించనున్నట్లు వివరించాయి.



You may be interested

క్యూ3లో బడా ఇన్వెస్టర్ల అమ్మక, కొనుగోళ్ల వివరాలివే..!

Tuesday 21st January 2020

దలాల్ స్ట్రీట్‌లోని బడాల ఇన్వెస్టర్ల అమ్మకాలు, కొనుగోళ్లపై చిన్నస్థాయి ఇన్వెస్టర్లు ఆస్తకి చూపుతుంటారు. వారు కూడా ఏస్‌ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోను అనుసరించి లాభాలను గడించాలని ఆశిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఏస్‌ ఇన్వెస్టర్లైన రాధాకృష్ణన్‌ ధమానీ, రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా, అశిష్‌ ఖచోలియా, అనిల్‌ కుమార్‌ గోయెల్‌, డాలీఖన్నాలు డిసెంబర్‌ క్వార్టర్‌లో ఏయే షేర్లను కొన్నారో., ఏయే షేర్లను తమ పోర్ట్‌ఫోలియో నుంచి తొలిగించారనే అనే విషయాలు ఇప్పడు చూద్దాం...  ఈ మూడో క్వార్టర్‌లో

మంగళవారం వార్తలకు ప్రభావితమయ్యే షేర్లు

Tuesday 21st January 2020

వివిధ వార్తలు, విశ్లేషణలతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు ఇండియన్‌ ఓవర్‌సిస్‌ బ్యాంక్‌: షేర్ల ప్రిఫరెన్షియల్‌ ఇష్యూను ఆమోదించడానికి ఇండియన్‌ ఓవర్‌సిస్‌ బ్యాంక్‌ బోర్డు ఈ రోజు(జనవరి 21)న సమావేశం కానుంది. ఎన్‌బీసీసీ: కేంద్ర బొగ్గు పరిశ్రమల్లో  రూ.720 కోట్ల ప్రాజెక్టుకు ఎన్‌బీసీసీ కన్సల్టెన్సీ ఇవ్వనుంది. కెఈఐ ఇండస్ట్రీస్‌: వార్షిక ప్రాతిపదికన క్యూ3 నికర లాభం 50.4 శాతం పెరిగి రూ.72.5 కోట్లుగా నమోదయ్యింది. మొత్తం ఆదాయం 21 శాతం పెరిగి రూ.1314కోట్లకు

Most from this category