News


బలహీన ఆర్థిక వ్యవస్థలో సెన్సెక్స్‌ ఎందుకు గరిష్ఠాలను తాకింది?

Thursday 7th November 2019
Markets_main1573121969.png-29420

దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికి కూడా మందగమనం నుంచి బయటపడలేదు. ఉత్పదాక రంగానికి సంబంధించి అక్టోబర్‌ నెల పీఎంఐ(పర్చేజ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌) డేటా రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. అదేవిధంగా సర్వీస్‌ సెక్టార్‌ సెప్టెంబర్‌ నెల పీఎంఐ డేటా 19 నెలల కనిష్ఠానికి చేరుకుంది. డిమాండ్‌ పుంజుకోవడంతో గత నెలలో ఆటో స్టాకులు పుంజుకున్నప్పటకి, ఇవి వాటి వేగాన్ని కోల్పోయాయి. స్థూల ఆర్థిక అంశాలు ప్రతికూలంగా ఉన్నప్పటికి దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీ అయిన సెన్సెక్స్‌ జీవిత కాల గరిష్ఠానికి చేరుకుంది. వరుసగా ఏడు సెషన్‌లలో లాభపడుతు వచ్చిన సెన్సెక్స్‌  నవంబర్‌ 05 సెషన్‌లో స్వల్పంగా నష్టపోయి ముగిసింది. అయినప్పటకి నవంబర్‌ 6 సెషన్లో 40,469 పాయింట్ల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని చేరుకుంది. అంతేకాకుండా గురువారం(నవంబర్‌  07) సెషన్‌లో ఇంకో 50 పాయింట్లు లాభపడి 40,500 మార్కును అధిగమించింది. దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పటికి సెన్సెక్స్‌ కొత్త గరిష్ఠాలకు ఎందుకు చేరుకుంటుంది? అనే ప్రశ్న ప్రతి ఇన్వెస్టర్‌కు వస్తుంది.

ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని, ఆర్థిక చర్యలను ప్రకటిస్తుందనే భావన ఇన్వెస్టర్లలో ఉందని, ఇదే మార్కెట్‌ను నడిపిస్తుందని విశ్లేషకులు, నిపుణులు అంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తాజాగా ఏర్పడిని మందగమనాలను పరిశీలిస్తే, ప్రభుత్వ జోక్యం లేకుండా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోదనే విషయం అర్థమవుతుంది.  కార్పోరేట్‌ పన్ను రేటును తగ్గించడం, ఇతర ఆర్థిక చర్యలను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అంతేకాకుండా ఇబ్బందుల్లో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని ఆదుకునేందుకు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ. 25,000 కోట్ల ఏఐఎఫ్‌(ఆల్టర్‌నేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌)ను బుధవారం ప్రకటించింది. ఈ ప్రకటనకు ముందు రోజు, పూర్తి మెజార్టీతో ఉన్న తమ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంస్కరణలను తీసుకోడానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఈ వ్యాఖ్యానంతో రానున్న రోజుల్లో  ప్రభుత్వం మరిన్ని చర్యలను ప్రకటిస్తుందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు.   ఇప్పటికే ట్యాక్స్‌ను తగ్గించడంతో సెప్టెంబర్‌ త్రైమాసికానికి గాను కార్పోరేట్‌ ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలను దాటాయి. మొత్తంగా 387 కంపెనీల పాట్‌(పన్ను తర్వాత లాభం) 17 శాతం పెరిగింది. 
   మోదీ ప్రభుత్వం మరికొన్ని సంస్కరణలను తీసుకురానుందనే అంచనాలు పెరిగాయి. ఆదాయ పన్ను రేట్లను సవరించనుందని, దీర్ఘకాల మూలధన లాభలపై విధించే పన్ను(ఎల్‌టీసీజీ), డివిడెండ్‌ పంపిణీ పన్ను రేట్లను తగ్గిస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. ‘వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు లేదా జీఎస్‌టీ రేట్లను ప్రభుత్వ తగ్గింస్తుందని మార్కెట్‌ వర్గాలు అధికంగా అంచనా వేస్తున్నాయి. వినియోగం పుంజుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలతో వినియోగధారిత(ఆటో మొబైల్స్‌) స్టాకులు మంచి ర్యాలీ చేశాయి. కానీ ద్రవ్యలోటు పరంగా చూస్తే ప్రభుత్వం పన్ను తగ్గింపు చర్యలను ఏవిధంగా చేపడుతుందనేది వేచి చూడాలి’ అని కోటక్‌ ఇనిస్టీట్యూషనల్‌ ఈక్విటీస్‌ పేర్కొం‍ది.You may be interested

సన్‌ఫార్మా లాభం రూ. 1065 కోట్లు

Thursday 7th November 2019

హెల్త్‌కేర్‌ దిగ్గజం సన్‌ఫార్మా సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ. 1065 కోట్ల లాభం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 270 కోట్ల నష్టం ప్రకటించింది. ఆసమయంలో కంపెనీ వన్‌టైమ్‌ నష్టం రూ. 1214 కోట్లను భరించాల్సివచ్చింది. తాజా సమీక్షా కాలంలో కంఎపనీ రెవెన్యూ 17.1 శాతం పెరిగి రూ. 8123 కోట్లను చేరింది. దేశీయ, అంతర్జాతీయ విక్రయాలు పెరగడం కంపెనీ రెవెన్యూ పెరుగుదలకు దోహదం చేసింది. క్యు2తో దేశీయ

బ్లూచిప్స్‌ పైనే ఫండ్‌ మేనేజర్ల ఆసక్తి

Thursday 7th November 2019

గత రెండేళ్లుగా దలాల్‌-స్ట్రీట్‌ ప్రైజ్‌ యాక‌్షన్‌లో లార్జ్ క్యాప్స్‌ ఆధిపత్యం చెలాయించాయి. రెండో క్వార్టర్లో ఫండ్‌ మేనేజర్ల కొనుగోళ్ల జాబితాలో బ్లూచిప్స్‌ అగ్రస్థానంలో ఉండటం చూస్తే ఈ విషయం అవగతమతోంది. ఈ హవా ఇప్పటికీ కొనసాగుతోందని ఏస్ ఈక్విటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూన్ త్రైమాసికంతో పోలిస్తే, సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో ఫండ్ మేనేజర్లు 388 కంపెనీలలో తమ వాటాను పెంచారు. వీటిలో ఎక్కువ భాగం బడా కంపెనీలే ఉన్నాయి.

Most from this category