STOCKS

News


వొడాఫోన్‌ ఐడియా ఉంటేనే మంచిదంటున్న ఎయిర్‌టెల్‌

Thursday 6th February 2020
Markets_main1580927955.png-31538

వొడాఫోన్‌ ఐడియా పరిస్థితి సంక్లిష్టంగానే ఉందంటూ వొడాఫోన్‌ గ్రూపు సీఈవో నిక్‌రీడ్‌ మరోసారి తాజాగా ప్రకటించగా.. వొడాఫోన్‌ ఐడియా కచ్చితంగా ఉండాల్సిన అవసరాన్ని పోటీ సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ బలంగా వ్యక్తీకరించింది. ఎందుకన్నది కూడా ఎయిర్‌టెల్‌ సీఈవో గోపాల్‌ విట్టల్‌ తెలిపారు. భారత టెలికం మార్కెట్లో మూడు సంస్థలు (ప్రయివేటు) ఉంటేనే మంచిదన్నది ఆయన విశ్లేషణ. దీనివల్ల పెట్టుబడులకు సానుకూలమని, ఉద్యోగాల నష్టం జరగదని వివరించారు. అలాగే, పరిశ్రమ ప్రతిష్టను కాపాడుకునేందుకు వొడాఫోన్‌ఐడియా ఉండడం తప్పనిసరిగా పేర్కొన్నారు. ప్రతిష్ట, ఉద్యోగాలు, పెట్టుబడులు ఈ మూడు కోణాల్లో చూస్తే భారత టెలికం మార్కెట్‌కు ముగ్గురు ప్లేయర్లు అవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

టెలికం పరిశ్రమలో సగటు వినియోగదారు నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) ప్రస్తుత స్థాయిల నుంచి వెంటనే కనీసం రూ.300కు చేరాల్సిన అవసరం ఉందన్నారు గోపాలవిట్టల్‌. పెట్టుబడులపై సహేతుక రాబడులకు అప్పుడే అవకాశం ఉంటుందని చెప్పారు. తద్వారా చార్జీలను మరింత పెంచాల్సిన అవసరాన్ని ఆయన చెప్పినట్టయింది. గత డిసెంబర్‌లో చార్జీలు పెంచడం వల్ల నాలుగో త్రైమాసికంలో ఏఆర్‌పీయూ రూ.200కు చేరినా కానీ తల ఒక్కటే నీటి పైకి చేరినట్టుగా ఉంటుందని, టారిఫ్‌లు ఎంతో తక్కువ స్థాయిలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లే కాల్స్‌పై జియో చార్జీలు వసూలు చేయడం వల్ల తమకు కొంత కస్టమర్లు మళ్లినట్టు విట్టల్‌ వెల్లడించారు. జియో చర్యతో రెండో సిమ్‌ విషయంలో స్థిరీకరణకు అవకాశం ఏర్పడిందని, ఎయిర్‌టెల్‌కు మారిపోతున్నారని చెప్పారు. డిసెంబర్‌ క్వార్టర్లో ఎయిర్‌టెల్‌కు 2.1 కోట్ల 4జీ కస్టమర్లు తోడయ్యారు. తదుపరి చార్జీల పెంపుపై సమయాన్ని విట్టల్‌ పేర్కొనలేదు. 2020-21లో మరో విడత పెంపుతో మార్కెట్‌ సర్దుబాటు చేసుకుంటుందా అన్నదాన్ని పరిశీలిస్తామని చెప్పారు. 5జీ టెక్నాలజీకి బిడ్‌ వేయాలంటే టెలికం కంపెనీల బ్యాలన్స్‌ షీట్లు ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరాన్ని బలంగా చెప్పారు. తద్వారా టెలికం ఏజీఆర్‌ బకాయిల విషయంలో ప్రభుత్వం నుంచి సాయం తప్పనిసరి అని విట్టల్‌ పరోక్షంగా గుర్తు చేశారు. ఏజీఆర్‌ తీర్పు కారణంగా ఒక్క వొడాఫోన్‌ ఐడియానే రూ.53,000 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. You may be interested

ఇన్‌ఫ్రాపై ఫోకస్‌.. ఈ కంపెనీలకు బోలెడు అవకాశాలు

Thursday 6th February 2020

మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. నూతనంగా ఐదు స్మార్ట్‌ సిటీల అభివృద్ధి ప్రతిపాదనలకూ చోటిచ్చింది ప్రభుత్వం. ఈ ప్రతిపాదనలు ఆయా రంగాల్లోని కంపెనీలకు వ్యాపార అవకాశాలను తెచ్చిపెట్టేవే. ఈ నేపథ్యంలో మౌలికరంగం, స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులతో లాభపడే కంపెనీల వివరాలను పలు బ్రోకరేజీ సంస్థలు ప్రకటించాయి.   ఎల్‌అండ్‌టీ, అశోక బిల్డ్‌కాన్‌ సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఈ రెండు కంపెనీలకు అధిక వ్యాపార అవకాశాలు వచ్చిపడతాయని అంచనా వేస్తోంది. రైట్స్‌, సీమెన్స్‌,

7.50శాతం లాభంతో ముగిసిన యస్‌ బ్యాంక్‌ షేరు

Wednesday 5th February 2020

మూలధనాన్ని పెంచుకునేందుకు రుణాలిచ్చేందుకు రుణదాతలు ముందుకొచ్చారనే వార్తల నేపథ్యంలో బుధవారం యస్‌ బ్యాంక్‌ షేరు 7.50శాతం లాభంతో రూ.37.60 వద్ద ముగిసింది. నేడు ఈ బ్యాంక్‌ షేర్లు బీఎస్‌ఈలో రూ.35.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. యస్‌ బ్యాంక్‌లో  2బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను పెట్టేందుకు కాంటర్ ఫిట్జ్‌గెరాల్డ్ ఎల్‌పి, ఐడిఎఫ్‌సి సెక్యూరిటీస్ లిమిటెడ్, అంబిత్‌ ప్రైవేట్ లిమిటెడ్‌లు ముందుకొచ్చినట్లు ఈ వ్యహారంతో సంబందం ఉన్న ముగ్గురు వ్యక్తులు పేర్కోనారు. అయితే ఈ

Most from this category