News


నాలుగు రంగాలపై ఐఐఎఫ్‌ఎల్‌ సానుకూలం

Wednesday 22nd May 2019
Markets_main1558548628.png-25890

ఇన్‌ఫ్రా, కన్‌స్ట్రక్షన్‌, కార్పొరేట్‌ బ్యాంకుల పట్ల బుల్లిష్‌గా ఉన్నట్టు ఐఐఎఫ్‌ఎల్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వీపీ సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. సిమెంట్‌, కన్‌స్ట్రక్షన్‌, కార్పొరేట్‌ బ్యాంకులు, క్యాపెక్స్‌ విభాగాల్లో తాము కొనుగోళ్లు చేస్తున్నట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా సంజీవ్‌ భాసిన్‌ వెల్లడించారు. మౌలిక సదుపాయాల కారణంగా ఇవి పెద్ద ఎత్తున లబ్ధి పొందనున్నాయని చెప్పారు. ఎన్నికల పలితాలు సహా వివిధ అంశాలపై ఆయన తన విశ్లేషణ తెలియజేశారు. 

 

ఎన్నికల ఫలితాల రోజున మార్కెట్లు 12,000 మార్క్‌ను అధిగమిస్తాయన్న అంచనాను భాసిన్‌ వ్యక్తం చేశారు. దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయంగానూ పెద్ద ఎత్తున నిధులు వేచి చూస్తున్నట్టు చెప్పారు. ఇవి భారత్‌ను సరైన గమ్యస్థానంగా గుర్తిస్తాయన్నారు. దేశీయంగా ప్రభుత్వం చేపట్టిన ఎన్నో సంస్కరణలు మూలధన వ్యయాలకు ఉత్ప్రేరకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆర్థిక రంగం పనితీరు, బ్రోడర్‌ మార్కెట్‌ పట్ల తాను ఎంతో ఆశావహంగా ఉన్నానని, ఇది గురువారం రుజువు అవుతుందన్నారు. ఈక్విటీ మార్కెట్లు అంటేనే రిస్క్‌ అన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే, ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలకు అనుగుణంగానే వాస్తవ గణాంకాలు కూడా ఉంటాయని లేదా ఎన్డీయేకు 290 సీట్లు వచ్చినా కానీ మార్కెట్లలో ర్యాలీ ఉంటుందన్న అంచనా వ్యక్తీకరించారు. 

 

ప్రభుత్వరంగ సంస్థల విషయంలోనూ సంజీవ్‌ భాసిన్‌ ఎంతో సానుకూలత వ్యక్తం చేశారు. సీపీఎస్‌​ఈటీఎఫ్‌ కొనుగోలుకు ఆయన సూచించారు. ఇందులో ఉన్న 15 స్టాక్స్‌ ప్రభుత్వరంగ బ్లూచిప్‌ కంపెనీలనే విషయాన్ని గుర్తు చేశారు. ఏకమొత్తంలో లేదా సిప్‌ రూపంలో అయినా సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ను కొనుగోలు చేసుకోవాలని, మరే ఇతర ఖాత కంటే కూడా ఇందులో అధిక రాబడులు వస్తాయన్నారు. బీమా రంగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌లను ఆయన సిఫారసు చేశారు. వచ్చే మూడు, ఐదేళ్ల కాలంలో ఇవి మంచి రాబడులను ఇవ్వగలవన్నారు. ఆటోమొబైల్‌ రంగంలో అశోక్‌లేలాండ్‌, ఐచర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఆటోల పట్ల బుల్లిష్‌గా ఉన్నట్టు భాసిన్‌ తెలిపారు. రానున్న సంవత్సరంలో ఇవి భారీ సంపదను సృష్టిస్తాయన్న అంచనాను వెల్లడించారు. 

 

ఎల్‌అండ్‌టీ, సీమెన్స్‌, ఏబీబీ, సద్బావ్‌ ఇంజనీరింగ్‌, నాగార్జున కన్‌స్ట్రక్షన్‌, ఎన్‌బీసీసీలను ఇన్‌ఫ్రాలో సూచించారు. బ్యాంకింగ్‌ రంగంలో ఎస్‌బీఐ కీలక నిరోధాన్ని అధిగమించిందని, ఈ ఏడాది చివరి నాటికి రూ.425కు చేరుకుంటుందన్నారు. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్‌, మిడ్‌క్యాప్‌లో డీసీబీ, ఫెడరల్‌ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌లను సిఫారసు చేశారు. You may be interested

మోదీ హయాంలో టాటా, అంబానీ, అదానీ స్టాక్స్‌?

Wednesday 22nd May 2019

మోదీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ప్రముఖ పారిశ్రామిక గ్రూపులకు చెందిన కంపెనీల పనితీరు యూపీఏ-2తో పోలిస్తే మిశ్రమంగానే ఉంది. యూపీఏ-2, మోదీ ఐదేళ్ల పాలన అంతర్జాతీయంగా సెంట్రల్‌ బ్యాంకుల విధానాల పరంగా భిన్నమైనవి. యూపీఏ-2లో వర్ధమాన మార్కెట్లకు నిధులు వెల్లువెత్తగా, మోదీ సర్కారు సమయంలో పరిస్థితి మరో విధంగా ఉంది.    ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూపు సంపద మాత్రం మోదీ హయాంలో గణనీయంగా వృద్ధి చెందింది. యూపీఏ-2 పాలనలో రూ.11,684

స్వల్పలాభంతో ముగింపు

Wednesday 22nd May 2019

సార్వత్రిక ఎన్నికల ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో బుధవారం మార్కెట్‌  స్వల్పంగా లాభపడింది. ట్రేడింగ్‌ ఆద్యంతం‍ లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు.. చివరి గంటలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపడంతో సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 140.41 పాయింట్ల లాభంతో 39000ల పైన 39,110.21 వద్ద, నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 11,738 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 218 పాయింట్లు లాభపడి 30,526.80 వద్ద

Most from this category