News


ఐఐఎఫ్‌ఎల్‌ సూచించే 13 స్టాక్స్‌

Friday 21st June 2019
Markets_main1561055916.png-26455

పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకునేందుకు కొందరు ఇన్వె‍స్టర్లు కరెక్షన్‌ కోసం ఎదురు చూస్తుంటారు. నిజానికి మార్కెట్లు కూడా ఇటువంటి అవకాశాలు ఇస్తూనే ఉంటాయి. కానీ, వాటిని గుర్తించేవారు కొందరే. దీర్ఘకాలం కోసం మార్కెట్‌లో ఉండాలనుకునే వారు కరెక్షన్లను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. లార్జ్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌తో కూడిన పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవడం మంచి ఆప్షన్‌ అవుతుందంటున్నారు. 

 

‘‘నిఫ్టీ 2019లో 13,000 దిశగా ర్యాలీ చేయనుంది. బలమైన ప్రభుత్వం, సానుకూల బడ్జెట్‌ అంచనాలు, లిక్విడిటీ పరిస్థితి మెరుగుపడడం సానుకూలతలు’’ అని యస్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ అమర్‌ అంబానీ తెలిపారు. లార్జ్‌క్యాప్‌నకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, మిడ్‌క్యాప్‌లో ఎంపిక చేసిన కొన్నింటిని ఎంచుకోవచ్చని సూచించారు. సూచీలు అధిక వ్యాల్యూషన్‌ అన్నది ఆందోళన కలిగించే అంశమని, అయితే విడిగా స్టాక్స్‌లో మాత్రం దీర్ఘకాలానికి మంచి రాబడులకు అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. కంపెనీల ఫలితాలు, వడ్డీ రేట్లు, స్థూల ఆర్థిక అంశాల కోణంలో మార్కెట్లను చూడాలని, ప్రస్తుత స్థాయిల్లో మార్కెట్లకు డౌన్‌సైడ్‌ చాలా పరిమితమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

 

30-40 ఏ‍ళ్ల వయసులో ఉన్నవారు మార్కెట్‌ కరెక్షన్‌లను స్టాక్స్‌ కొనుగోలుకు అవకాశాలుగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ గత రెండేళ్ల కాలంలో తీవ్రంగా నష్టాల పాలయ్యాయి. దీంతో లార్జ్‌క్యాప్‌నకు ఎక్కువ పెట్టుబడులు కేటాయించుకుని, మిడ్‌, స్మాల్‌క్యాప్‌నకు మిగిలిన మొత్తాన్ని కేటాయించుకోవాలని సూచిస్తున్నారు. ‘‘30-40 ఏళ్ల వయసు ఉన్న వారికి సరిపడా దీర్ఘకాలం ఉంటుంది. లార్జ్‌క్యాప్‌నకు ఎక్కువ వెయిటేజీ ఇవ్వాలి. మిడ్‌, స్మాల్‌క్యాప్‌లో అస్థిరతల దృష్ట్యా లార్జ్‌క్యాప్‌నకు 60-65 శాతం కేటాయించుకోవాలి. మిడ్‌క్యాప్‌నకు 20-25 శాతం, మిగిలిన మొత్తాన్ని స్మాల్‌ క్యాప్‌నకు కేటాయించుకోవచ్చు. వృద్ధి అంశాల ఆధారంగానే పోర్ట్‌ఫోలియో ఉండాలి తప్పించి, వ్యాల్యూ ఆధారంగా కాదు’’ అని శాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ సునీల్‌శర్మ సూచించారు. 

 

ఈ నేపథ్యంలో ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ 13 స్టాక్స్‌తో ఓ పోర్ట్‌ఫోలియో రూపొందించింది. పరిశ్రమ సగటుకు మించి వృద్ధి చెందే కంపెనీలు, అధిక రిస్క్‌ అధిక రాబడుల ఆధారంగా ఈ స్టాక్స్‌ను ఎంపిక చేసింది. 100 శాతం పెట్టుబడుల్లో...  అరబిందో ఫార్మాకు 8 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌కు 7 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌కు 7 శాతం, భారతీ ఎయిర్‌టెల్‌కు 9 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు 7 శాతం, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌కు 8 శాతం, ఇప్కా లేబరేటరీస్‌కు 7 శాతం, ఎల్‌అండ్‌టీకి 9 శాతం, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీకి 8 శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంకు 7 శాతం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు 7 శాతం, టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌కు 9 శాతం, టెక్‌ మహీంద్రాకు 7 శాతం చొప్పున కేటాయించుకోవచ్చన్నది ఐఐఎఫ్‌ఎల్‌ సూచన. You may be interested

సెన్సెక్స్‌ 100పాయింట్ల నష్టంతో ప్రారంభం

Friday 21st June 2019

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలతో దేశీయ మార్కెట్‌ దేశీయ మార్కెట్‌ శుక్రవారం స్వల్ప ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 50 నష్టంతో 39551 వద్ద, నిఫ్టీ 10 పాయిం‍ట్లు క్షీణించి 11821 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. క్రితం ట్రేడింగ్‌లో సూచీలు భారీగా లాభపడిన నేపథ్యంలో నేడు ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకుంటున్నారు.  కొత్త ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్‌ అధ్యక్షతన నేడు 35వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరుగున్న నేపధ్యంలో దేశీయంగా

ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌కు కొత్త భాగస్వామి!

Friday 21st June 2019

మహింద్రా అండ్‌ మహింద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తన అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ/మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవల సంస్థ) కోసం విదేశీ వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకుందని సమాచారం. సంబంధిత భాగస్వామి ఇండోనేషియాకు చెందిన కంపెనీ అని, ఈ నిర్ణయాన్ని శుక్రవారం మీడియా ముఖంగా కంపెనీ ప్రకటించనున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.    మహింద్రా మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహణలో ఆస్తులు ఈ ఏడాది మార్చి నాటికి రూ.4,748 కోట్లుగా ఉన్నాయి.

Most from this category