News


రూ. 1,000 కోట్ల సమీకరణలో ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌

Tuesday 6th August 2019
Markets_main1565073144.png-27572

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ తాజాగా రూ. 1,000 కోట్ల దాకా నిధులు సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల (ఎన్‌సీడీ) ఇష్యూ ఆగస్టు 6న ప్రారంభమవుతుంది. ఐఐఎఫ్‌ఎల్‌ బాండ్లు గరిష్టంగా 10.5 శాతం దాకా వడ్డీ రేటు లభిస్తుంది. 15 నెలల నుంచి 69 నెలల దాకా కాలావధితో ఈ ఎన్‌సీడీలు ఉంటాయని సోమవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ డిప్యుటీ వైస్‌ ప్రెసిడెంట్‌ అభిషేక్‌ శుక్లా తెలిపారు. నెలవారీ, మూణ్నెల్లు, వార్షిక ప్రాతిపదికన వడ్డీ చెల్లింపుల ఆప్షన్‌ ఎంచుకోవచ్చని ఆయన వివరించారు. ఈ ఎన్‌సీడీలను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కూడా లిస్ట్‌ చేయనున్నట్లు శుక్లా చెప్పారు. ఈ ఏడాది జనవరిలోనే తొలి విడతగా రూ. 1,000 కోట్లు సమీకరించామని, ఇది రెండో విడతని ఆయన వివరించారు. 

అన్నింటినీ ఒకే రకంగా చూడొద్దు...
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఉదంతం తర్వాత ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులపరమైన సమస్యలు ఎదురవుతుండటాన్ని ప్రస్తావిస్తూ.. అన్ని సంస్థలను ఒకే గాటన కట్టడం సరికాదని చెప్పారు. తమ రుణాల పోర్ట్‌ఫోలియో పటిష్టంగా ఉందని, తాజా ఎన్‌సీడీ ఇష్యూకు వివిధ రేటింగ్‌ సంస్థల నుంచి అత్యుత్తమ రేటింగ్స్‌ కూడా ఉన్నాయని చెప్పారు. దాదాపు రూ. 35,000 కోట్ల రుణాల పోర్ట్‌ఫోలియోలో రిటైల్‌ వాటా 85 శాతం దాకా ఉందని.. స్థూల మొండిబాకీలు అత్యల్పంగా 1.9 శాతం మాత్రమేనని శుక్లా చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా మరో 100 శాఖల దాకా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు.  You may be interested

హెచ్‌ఎస్‌బీసీ సీఈవోకు ఉద్వాసన

Tuesday 6th August 2019

లండన్‌: హెచ్‌ఎస్‌బీసీ సీఈవో జాన్‌ ఫ్లింట్‌ అనూహ్యంగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. లండన్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ప్రపంచంలో ఏడో అతిపెద్ద బ్యాంకు, ఆర్థిక సేవల కంపెనీగా ఉంది. సొంత దేశంతోపాటు ఆసియాలో ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితుల్లో నూతన నాయకత్వం అవసరమని హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్స్‌ పేర్కొంది. పరస్పర అంగీకారం మేరకు ఫ్లింట్‌ వైదొలిగారని, గ్లోబల్‌ కమర్షియల్‌ బ్యాంకింగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న నోయెల్‌ క్విన్‌ తాత్కాలిక సీఈవోగా

రేటు కోత అంచనాలే అధికం

Tuesday 6th August 2019

- ఇదే జరిగితే 5.5 శాతానికి రెపో - ఆర్‌బీఐ ద్రవ్య పరపతి  విధాన కమిటీ సమావేశం ప్రారంభం న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక సమావేశం సోమవారం నాడు ప్రారంభమైంది. మూడు రోజులు ఈ సమావేశం జరుగుతుంది.  ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన ప్రారంభమైన ఆరుగురు సభ్యుల కమిటీ మరోదఫా రెపో రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని మెజారిటీ ఆర్థికవేత్తలు,

Most from this category