News


ఆటుపోట్లను మర్చిపోండి... 2019లో భారీ లాభాలే?

Friday 4th January 2019
Markets_main1546540231.png-23391

ఈ ఏడాది మంచి లాభాలకు అవకాశం ఉందని వారెన్‌ బఫెట్‌ సూచిక తెలియజేస్తోంది. చమురు ధరలు దిగిరావడం, రూపాయి పతనం ఆగడం, కమోడిటీ ధరలు పతనం కావడం వంటి సానుకూల అంశాలు ఎన్నో ఉన్నాయి. అయితే, అంతర్జాతీయంగా చైనా వృద్ధి మందగమనం, దేశీయంగా ఎన్నికలు సహా పలు అంశాల కారణంగా ఈ ఏడాది మన మార్కెట్లలో అస్థిరతలు ఎక్కువగా ఉంటాయన్న అంచనాలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో మంచి వృద్ధి అవకాశాలున్న స్టాక్స్‌లో దీర్ఘకాల దృష్టితో ఇన్వెస్ట్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. తగినంత నగదు నిల్వలు ఉంచుకోవాలని, అవకాశాలు ఈ ఏడాది పాటు వస్తుంటాయని స్టాండర్డ్‌ చార్టర్డ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఎండీ నితిన్‌ సింగ్‌ సూచించారు. 

 

బఫెట్‌ ఇండికేటర్‌ ఇదే...
బఫెట్‌ ఇండికేటర్‌ అంటే... జీడీపీలో మార్కెట్‌ క్యాప్‌ రేషియో. మన మార్కె్‌ట్‌కు సంబంధించి ప్రస్తుత రేషియో 80 శాతం. దీర్ఘకాలిక సగటు 78 శాతం. అమెరికాలో ఈ రేషియో 113 శాతం, మిగతా ప్రపంచ మార్కెట్లలో 82 శాతంగా ఉంది. వీటితో పోలిస్తే మన దగ్గర కొంచెం తక్కువే ఉంది. రానున్న త్రైమాసికాల్లో కంపెనీల ఎర్నింగ్స్‌ మెరుగుపడితే ఈ ఇండికేటర్‌ 75 స్థాయికి కూడా దిగిపోతుంది. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ ఆకర్షణీయంగా మారినట్టేనంటున్నారు విశ్లేషకులు. ‘‘దేశీయంగా ఉన్న వృద్ధి అవకాశాల పరంగా చూస్తే భారత స్టాక్‌ మార్కెట్‌ క్యాప్‌ జీడీపీలో 80 శాతంగా ఉంది. వచ్చే ఏడాది జీడీపీ అంచనాల ప్రకారం 75 శాతంగా ఉంది. కనుక భారత్‌ అధిక వ్యాల్యూషన్లలో లేనే లేదు. సరసమైన వ్యాల్యూ మార్క్‌ కంటే దిగువనే ఉంది’’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తన నివేదికలో పేర్కొంది. 

 

ఏంటి మార్గం?
‘‘సాధారణ ఎన్నికల ముందు ఫిబ్రవరి మధ్య భాగంలో మార్కెట్లు పై వైపునకు కదలొచ్చు. ఇండియా వీఐఎక్స్‌ 24 స్థాయిని బ్రేక్‌ చేస్తే తదుపరి లక్ష్యం 40’’అని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. ట్రేడర్లు హెడ్జింగ్‌ విధానాన్ని అనుసరించాలని సూచించింది. కరెక్షన్లలో దీర్ఘకాలానికి నాణ్యమైన స్టాక్స్‌ను ఎంచుకోవాలని పేర్కొంది. ఐటీ, వినియోగదారుల విచక్షణారహిత వినియోగం, ఇండస్ట్రియల్స్‌, బీమా కంపెనీల పట్ల తాము సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇంధనం, ఫార్మా, మెటల్స్‌ షేర్ల విషయంలో తటస్థం లేదా అప్రమత్త ధోరణితో ఉన్నట్టు పేర్కొంది. క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ అయితే ప్రభుత్వరంగ బ్యాంకుల పట్ల సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. లార్జ్‌క్యాప్‌ ఐటీ, బ్యాంకులు, ఇండస్ట్రియల్స్‌ పట్ల జేఎం ఫైనాన్షియల్‌ సానుకూలత వ్యక్తం చేసింది. 



You may be interested

స్వల్పంగా పెరిగిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Friday 4th January 2019

గత రాత్రి అమెరికా సూచీలు భారీ పతనాన్ని చవిచూసినప్పటికీ, శుక్రవారం జపాన్‌ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ స్వల్పంగా పెరిగింది. ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్స్‌కు అనుసంధానమై సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40 గంటలకు 11 పాయింట్ల పెరుగుదలతో 10,730 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,719 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రపంచ ఆర్థికాభివృద్ధి మందగిస్తుందన్న

‘బీవోబీ’లో బ్యాంకుల విలీనంపై ఐసీఐసీఐ డైరెక్ట్‌ విశ్లేషణ

Thursday 3rd January 2019

బ్యాంకు ఆఫ్‌ బరోడా (బీవోబీ)లో విజయా, దేనా బ్యాంకుల విలీనం వల్ల ఇప్పటికిప్పుడు ఎటువంటి ప్రయోజనం ఉండదని ఐసీఐసీఐ డైరెక్ట్‌కు చెందిన పంకజ్‌ పాండే పేర్కొన్నారు.  విలీనంతో మొత్తం మీద పుస్తక విలువ పెరుగుతుందని, బీవోబీకి గతంలో తాము రూ.135 టార్గెట్‌ ఇచ్చినట్టు తెలిపారు. సాధారణంగా పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు పుస్తక విలువకు ఒక రెట్టు అధికంగా ట్రేడవుతుంటాయన్నారు. ఈ రకంగా చూస్తే బీవోబీ ఈ స్థాయి నుంచి రూ.7-8

Most from this category