STOCKS

News


5 శాతం జీడీపీ వృద్ధితో 15 శాతం ఈపీఎస్‌ వృద్ధి!

Saturday 15th February 2020
Markets_main1581745075.png-31820

మెరిలించ్‌ సలహాదారు రాజ్‌శర్మ
ఎకానమీలో జీడీపీ వృద్ధి బాగుంటే అది క్రమంగా కంపెనీల ఎర్నింగ్స్‌ పర్‌ షేర్‌లో ప్రతిబింబిస్తుందని మెరిలించ్‌ ఎండీ రాజ్‌శర్మ చెప్పారు. జీడీపీ 5 శాతం వృద్ది ఉంటే 15 శాతం ఈపీఎస్‌ వృద్ధి నమోదవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఇండియా వాల్యూషన్లు చౌకగా లేవని కానీ దేశీయ వృద్ధి అవకాశాలు చూస్తే వచ్చే 3-5 ఏళ్లలో మార్కెట్లు మంచి వృద్ధినే నమోదు చేస్తాయని అంచనా వేశారు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్‌కు భారత్‌ లాంటి ఈఎంల్లో పెట్టుబడులు పెట్టమని సలహాఇస్తామని చెప్పారు. జీడీపీ వృద్ధి జనాభా, ఉత్పత్తి వృద్ధిల సమ్మిళతంతో ఏర్పడుతుందన్నారు. భారత్‌లో ప్రపంచంలోనే అత్యంత యంగ్‌ జనభా ఉందని, జనాభాలో 65 శాతం 35ఏళ్లలోపు వారని గుర్తు చేశారు. దేశీయంగా మొబైల్‌ వాడకందారుల సంఖ్య పాశ్యాత్యదేశాల కన్నా అధికమని, సోషల్‌ నెట్‌వర్కింగ్‌పై ఇండియా కన్జూమర్లకు అవగాహన అధికమని చెప్పారు. భారత మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్లో భాగం కనుక గతేడాది అంతర్జాతీయ నెగిటివ్‌ వార్తలకు ‍నెగిటివ్‌గా స్పందించిందన్నారు. 
ట్రేడ్‌వార్‌ ప్రభావం అన్నిమార్కెట్లపై పడ్డట్లే ఇండియా మార్కెట్‌పై కూడా పడిందన్నారు. తాజాగా కరోనా వైరస్‌ భయాలు అన్ని మార్కెట్లని వణికిస్తున్నాయన్నారు. కానీ ఇవన్నీ స్వల్పకాలిక నెగిటివ్‌ ప్రభావాలేనన్నారు. ప్రస్తుతం ట్రేడ్‌వార్‌ సమస్య తీరినట్లు కనిపిస్తుందన్నారు. వడ్డీరేట్లు తగ్గుతున్నాయని, ఎకానమీలో రికవరీ కనిపిస్తోందని చెప్పారు. వడ్డీరేట్ల తగ్గింపు కారణంగా ప్రపంచవ్యాప్తంగా బాండ్స్‌ అనాకర్షణీయంగా మారాయన్నారు. ఇలాంటప్పుడు ఈక్విటీలు దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలిస్తాయని వివరించారు. కనీసం 3-5ఏళ్లు కాలపరిమితి ఉండేలా పెట్టుబడులు పెట్టాలని సూచించారు. కరోనా వైరస్‌ భయాలు క్రమంగా తగ్గుతున్నాయని, మార్కెట్లలో ఇదే విషయం కనిపిస్తోందని చెప్పారు. ట్రేడ్‌వార్‌, కరోనా భయాలతో చైనా తన ఎకానమీలోకి భారీగా నగదును ప్రవహింపజేస్తోందని, ఇంత లిక్విడిటీ పెరగడం మార్కెట్లకు పాజిటివ్‌అని తెలిపారు. చైనా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గత ఆరునెలల్లో అనేకదేశాలు రేట్లను తగ్గించాయని చెప్పారు. ఏ దేశం కూడా మాంద్యాని కోరుకోదని శర్మ అభిప్రాయపడ్డారు. You may be interested

లబ్ది ఎయిర్‌టెల్‌కా? జియోకా?

Saturday 15th February 2020

రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ మధ్య పోటీ తీవ్రం! ఎయిర్‌టెల్‌ వ్యయాలు పెరగవచ్చంటున్న నిపుణులు 40 శాతం వొడాఫోన్‌ కస్లమర్లు ఎయిర్‌టెల్‌ చెంతకు? ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం కోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా ఎలా స్పందించనుం‍దన్న అంశంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. లైసెన్స్‌ ఫీజులు, స్పెక్ట్రమ్‌ వినియోగ చార్జీలు, వడ్డీలు, పెనాల్టీలు తదితరాలతో కలసి వొడాఫోన్‌ ఐడియా బకాయిలు రూ. 53,000 కోట్లను అధిగమించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. గతేడాది

ఏజీఆర్‌తో మొండిబకాయిల ముప్పు!

Saturday 15th February 2020

వీఐఎల్‌ దివాలా తీస్తుందని భయపడుతున్న బ్యాంకులు ఏజీఆర్‌ బకాయిలు ఎలాగైనా చెల్లించాల్సిందేనన్న సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వొడాఫోన్‌ఐడియా(వీఐఎల్‌) దివాలా ప్రకటించే అవకాశం ఉందని బ్యాంకులు భయపడుతున్నాయి. ఇదే జరిగితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బ్యాంకింగ్‌ రంగంలో తిరిగి కొన్నేళ క్రితం పరిస్థితులు తలెత్తవచ్చని, మొండిపద్దుల గుదిబండ మెడలో పడొచ్చని ఆందోళన పడుతున్నాయి. ఏజీఆర్‌ కింద వీఐఎల్‌ సంస్థ డీఓటికి దాదాపు రూ.53వేల కోట్లు చెల్లించాల్సి వస్తుంది. అయితే కంపెనీ ఇంత మొత్తం చెల్లించే

Most from this category