News


ఆర్‌బీఐకి ఆందోళన లేదు: అబీక్‌ బారువా

Wednesday 7th August 2019
Markets_main1565174469.png-27613

‘ఆర్థిక వ్యవస్థ మందగమనంలో చిక్కుకుందని, దీనిపై భయాందోళనలతో ఉన్నామనే విషయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పకనే చెప్పారు. కానీ ఈ మందగమనం లోతుగా లేదనే విషయం, ఆర్‌బీఐ 35 బేసిస్‌ పాయింట్ల రేట్‌ కట్‌ చేయడంతో అర్థమవుతుంది’ అని హెచ్‌డీఎఫ్‌సీ ముఖ్య ఆర్థికవేత్త అభీక్‌ బారువా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..
   
ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్ అంతర్జాతీయ ఫోరంలో ప్రసంగించిన తర్వాత నుంచి 25 బేసిస్‌ పాయింట్ల కోత గురించి ఎక్కువగా చర్చ జరిగింది. కానీ ఆయన ఆర్థిక మందగమనం లోతుగా లేదు, దీనికి మేము భయపడటం లేదనే సంకేతాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. ఒకవేళ నిజంగానే ఈ ఆర్థిక మందగమనం లోతుగా ఉండుంటే రేట్ల కోత 50 బేసిస్‌ పాయింట్లుగా ఉండేది. అయినప్పటికి ప్రథమార్థనికి సంబంధించి జీడీపీ అంచనాలను తగ్గించడంతో మందగమన భయాలున్నాయనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఆయన భయాందోళన సంకేతాలను పంపలేదు. కానీ 25 బేసిస్‌ పాయింట్ల కంటే ఎక్కువ రేట్‌ కట్‌ను చేశారు. ఇది కొం‍చెం అశ్చర్య పరిచే అంశమే. 
    రేట్ల కోత 35 బేసిస్‌ పాయింట్లుగా ఉండడం, మరింతగా మార్కెట్లను భయాందోళనలకు గురిచేస్తుందని అనుకోవడం లేదు. ఆర్‌బీఐ 50 బేసిస్‌ పాయింట్ల రేట్‌ కట్ చేసి ఉంటే, నిజంగానే ఆందోళన చెందేవాళ్లం. కానీ ఆర్‌బీఐ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థనికి సంబంధించిన జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది. ఇది చాలా తక్కువ. ఆర్థిక పరిస్థితిపై అభిప్రాయానికి, ఆర్‌బీఐ తీసుకున్న ద్రవ్య చర్యకు  సరిపోలడం లేదనే అంశాన్ని గమనించాలి. సెంట్రల్ బ్యాంకులు సాంప్రదాయికంగా ఉంటాయి. వారు తమ సూచనలను సవరించినప్పుడు తప్పుడు సంకేతాలను ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారు ఆర్థిక వ్యవస్థను ఎలా చూస్తారనే దానిపై వాస్తవిక డేటాను అందించినప్పటికీ,  అది నిరశావాదాన్ని ప్రేరేపించే విధంగా ఉండకుండా దాన్ని సమతుల్యం చేస్తారు. 

 



You may be interested

10900 దిగువున ముగిసిన నిఫ్టీ

Wednesday 7th August 2019

మార్కెట్‌ పతనాన్ని అడ్డుకోలేకపోయిన కోత తగ్గింపు  286 పాయింట్లు క్షీణించిన సెన్సె‍క్స్‌ రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లపై కోత విధించినప్పటికీ.., మార్కెట్‌ రెండోరోజూ నష్టంతోనే ముగిసింది. సెన్సెక్స్‌  286 పాయింట్ల నష్టంతో 36,690.50 వద్ద, నిఫ్టీ 92.75 పాయింట్లను కోల్పోయి 10,855.50 వద్ద స్థిరపడింది. జాతీయ, అంతర్జాతీంగా నెలకొన్న బలహీన సంకేతాలు, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి భారీ క్షీణిత, ఆర్‌బీఐ 2020 జీడీపీ వృద్ధి రేటును 7శాతం నుంచి 6.9శాతానికి

బేర్‌ గుప్పిట్లోనే ముడిచమురు!

Wednesday 7th August 2019

ఆయిల్‌ మార్కెట్‌ నిపుణురాలు వందనా హరి అంచనా ప్రపంచ వృద్ధి గతేడాది కన్నా మరింత మందగించవచ్చన్న అంచనాల నేపథ్యంలో క్రూడాయిల్‌లో షార్ట్‌ సైడ్‌ ఉండడమే మంచిదని ప్రముఖ అనలిస్టు వందనా హరి అభిప్రాయపడ్డారు. ట్రేడ్‌వార్‌ కారణంగా డిమాండ్‌ వృద్ధిపై ఏడాదికేడాది ఆందోళనలు పెరిగిపోతున్నాయన్నారు. ముఖ్యంగా గతవారం నుంచి అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు మరింత సంకటంగా తయారయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ముడిచమురు డిమాండ్‌లో పెరుగుదల ఆశించలేమని చెప్పారు. అందువల్ల క్రూడ్‌

Most from this category