12100 దాటితే 12400 పాయింట్లకు నిఫ్టీ!
By D Sayee Pramodh

కోటక్ సెక్యూరిటీస్ అంచనా
నిఫ్టీ హయ్యర్ బాటమ్ ఏర్పరిచిందని, రాబోయే రెండేళ్లలో తప్పక 13700 పాయింట్లను తాకుతుందని కోటక్ సెక్యూరిటీస్ గతంలో ప్రకటించింది. ఎన్నికల ఫలితాల అనంతరం నిఫ్టీ ఫండమెంటల్స్, టెక్నికల్ విశ్లేషణలో పలు బ్రోకరేజ్‌లు అప్‌గ్రేడ్ చేశాయని వివరించింది. ఈ అప్‌గ్రేడ్స్ అన్నీ తాము గతంలో ప్రకటించిన టార్గెట్‌కు అటుఇటుగానే ఉన్నాయని పేర్కొంది. ఎన్నికల ఫలితాల ముందర సైతం తాము లాంగ్సైడ్ మాత్రమే ఉండాలని సూచించిన విధాన్ని గుర్తు చేసింది. ఈ వారానికి నిఫ్టీ క్రమానుగత అప్‌ట్రెండ్‌నే కొనసాగించవచ్చని పేర్కొంది. ఇండెక్స్ హెవీవెయిట్స్ కొంత అలుపు తీర్చుకోవచ్చని, మార్కెట్ సంక్షోభంలో పడితే అప్పుడు ఇవి మరలా తెరపైకి వస్తాయని అంచనా వేసింది. నిఫ్టీ కొంత కాలం పాటు 11650- 12050 పాయింట్ల మధ్యనే కదలాడవచ్చని తెలిపింది. ఒకవేళ నిఫ్టీ 12100 పాయింట్లను దిగ్విజయంగా దాటితే క్రమంగా 12350- 12400 పాయింట్ల వరకు దూసుకుపోతుందని అంచనా వేసింది. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లు ఒత్తిడిలో ఉండి, తదనుగుణంగా మన మార్కెట్ కూడా ఒత్తిడి ఫీలయి నిఫ్టీ 12050 పాయింట్లను దాటలేకుంటే క్రమంగా 11650 పాయింట్లను మరోమారు టచ్ చేయవచ్చని విశ్లేషించింది. ఇప్పటికైతే నిఫ్టీలో పడినప్పుడు కొను పాలసీనే అవలంబించాలని సూచించింది. రంగాలవారీగా చూస్తే ఐటీ, ఫార్మా తప్పఇతర రంగాలన్నీ మంచి ప్రదర్శన చూపుతాయని పేర్కొంది. ముఖ్యంగా నిఫ్టీ ఇన్ఫ్రా, నిఫ్టీ పీఎస్బీ సూచీలు ఇప్పటికే మంచి ప్రదర్శన చూపుతున్నాయని వివరించింది. నిఫ్టీలో భారీ అప్‌మూవ్ వచ్చినా ఐటీ, ఫార్మా సూచీలు మాత్రం ఇంతవరకు కొత్త గరిష్ఠాలను తాకలేదని తెలిపింది. కానీ తాజాగా ఈసూచీల్లో ఏర్పడుతున్న ఫార్మేషన్లు అప్‌మూవ్‌కు సంకేతాలను అందిస్తున్నాయని తెలిపింది. ఈ సమయంలో ఈ రెండు రంగాల్లో లార్జ్‌క్యాప్స్‌ను ఎంచుకోవాలని సూచించింది.
You may be interested
భెల్ లాభంలో 49 శాతం వృద్ధి
Monday 27th May 2019మార్చి త్రైమాసికంలో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) నికర లాభం 49.33 శాతం పెరిగి రూ. 682.70 కోట్లకు చేరింది. గత క్యు4లో కంపెనీ 457.17 కోట్ల రూపాయల లాభం ప్రకటించింది. సమీక్షా కాలంలో కంపెనీ విక్రయాలు ఫ్లాట్‌గా ఉన్నాయి. గతంలో రూ. 9832.82 కోట్ల రూపాయలున్న ఈ విక్రయాలు తాజాగా రూ. 9836.50 కోట్ల రూపాయలకు చేరాయి. మరోవైపు ఇతర వ్యయాలు రూ. 1896 కోట్ల నుంచి రూ.
సంస్కరణలపై ఆశలతో మరింత పైపైకి!
Monday 27th May 2019మార్కెట్‌పై నిపుణుల అభిప్రాయం రాబోయే కొన్ని నెలల్లో దేశీయ మార్కెట్లు సరికొత్త స్థాయిలను అందుకుంటాయని, కొత్త ప్రభుత్వం చేపట్టే సంస్కరణలపై ఆశలు సూచీలను పరుగులు తీయిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలైలో ప్రవేశపెట్టే బడ్జెట్‌కు ముందు మార్కెట్లు 5- 10 శాతం వరకు ర్యాలీ జరుపుతాయని ఒక సర్వేలో పాల్గొన్న 31 మంది నిపుణుల్లో అధిక శాతం అభిప్రాయపడ్డారు. జూలై నాటికి నిఫ్టీ 12500 పాయింట్లను చేరుతుందని సర్వేలో 50 శాతం