News


11780 పైన క్లోజయితేనే అప్‌మూవ్‌కు అవకాశం

Monday 17th June 2019
Markets_main1560768267.png-26358

నిఫ్టీపై నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ అంచనా
గతవారమంతా 11800- 12000 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన నిఫ్టీ ఈ వారం ఆరంభంలో ఈ రేంజ్‌ నుంచి బ్రేక్‌డౌన్‌ చూపింది. సోమవారం కీలక 11800 పాయింట్లను కోల్పోయి 11672 పాయింట్ల వద్ద క్లోజయింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 11770 పాయింట్లను కోల్పోయినందున స్వల్పకాలిక డౌన్‌ట్రెండ్‌ ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. నిఫ్టీ 11780 పాయింట్ల పైన బలంగా క్లోజయితేనే తిరిగి 12050 పాయింట్లను చేరవచ్చని నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ అంచనా వేసింది. నిఫ్టీ చార్టుల్లో ఫ్లాగ్‌ ప్యాటర్న్‌ దిగువ అవధిని ఛేదించిందని తెలిపింది. తిరిగి భారీ ర్యాలీ జరపాలంటే 12100 పాయింట్లను బలంగా దాటాలని పేర్కొంది. ప్రస్తుతం నిఫ్టీ కీలక డీఎంఏలు 11680 పాయింట్ల వద్ద ఉన్నాయని, ఈ స్థాయిని కూడా కోల్పోతే మరింత పతనం ఉంటుందని తెలిపింది. 
ఇవే కారణం
సోమవారం నిఫ్టీ పతనానికి 4 కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాలు అనుకున్నంత చురుగ్గా కదలకపోవడం, వాల్యూషన్లపై ఆందోళన, ఫెడ్‌ రేట్లను తగ్గించకపోవచ్చన్న అంచనాలు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు.. మార్కెట్‌పై ఒత్తిడి పెంచాయని విశ్లేషించారు. దీంతో నిఫ్టీ కీలక 11780 పాయింట్లను కోల్పోయింది. అందువల్ల డబుల్‌ బాటమ్‌ ఫార్మేషన్‌కు అవకాశం లేకుండా పోయింది. యూఎస్‌ చర్యలు దీటుగా భారత్‌ ప్రతీకార సుంకాలు విధించడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. నిఫ్టీ ప్రస్తుత స్థాయిని కోల్పోతే పతనం 11300 పాయింట్ల వరకు ఉండే ఛాన్సులు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 



You may be interested

ఈ స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐలకూ నష్టాలు..!

Monday 17th June 2019

చిన్న ఇన్వెస్టర్లు... ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, అమ్మకాల డేటాను పరిశీలించి, పెట్టుబడుల నిర్ణయాలు తీసుకుంటుంటారు. అయితే, స్టాక్‌ మార్కెట్లో గుడ్డిగా ఎవరినీ అనుసరించారదన్నది నిపుణులు చెప్పేమాట. ఓ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేస్తున్నామంటే అందుకు తగిన కారణాలు ఉండాలి. అవి భావోద్వేగాలు, ఆకర్షణలకు అతీతంగా పూర్తిగా ఫండమెంటల్స్‌ ఆధారంగానే ఉండాలి. ఇన్వెస్టింగ్‌లో సంస్థాగత, విదేశీ ఇన్వెస్టర్లను అనుసరించే వారికి కొన్ని స్టాక్స్‌ విషయంలో చేదు ఫలితాలే ఎదురయ్యాయి. ఎందుకంటే

డిస్కౌంట్‌లో ట్రేడవుతున్న ఆరు రంగాలు

Monday 17th June 2019

ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరిపేందుకు ప్రధానంగా పరిశీలించే వాటిలో వాల్యూషన్లు కీలకమైనవి. విజయవంతమైన ట్రేడర్లంతా వాల్యూషన్ల ప్రాముఖ్యాన్ని గుర్తించినవారే. ప్రీమియం వాల్యూషన్లకు చేరినప్పుడు విక్రయించడం, డిస్కౌంట్‌ వాల్యూషన్ల సమయంలో కొనుగోళ్లు జరపడం ట్రేడర్లు చేస్తుంటారు. ప్రస్తుత మార్కెట్లో ఆరు రంగాలు తమ దీర్ఘకాలిక సరాసరి కన్నా తక్కువ వాల్యూషన్‌కు ట్రేడవుతున్నాయని నిపుణులు గుర్తించారు. వీటిలో క్యాపిటల్‌ గూడ్స్‌, హెల్త్‌కేర్‌ఱ, ఇన్‌ఫ్రా, మీడియా, మెటల్స్‌ ఉన్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది. ఈ రంగాల

Most from this category