News


నిఫ్టీ నష్టాలు ఆగితే... ఈ 17షేర్లలో ర్యాలీ..!

Tuesday 3rd March 2020
Markets_main1583231246.png-32250

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 17 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా మారిన కంపెనీల్లో ఫైజర్‌, కాల్గేట్‌, ఇప్కా ల్యాబ్స్‌, అరవింద్‌ ల్యాబ్స్‌, సెలబ్రటీ ఫ్యాషన్‌ లిమిటెడ్‌, కన్సాయ్‌ నెరోలాక్‌ పెయింట్స్‌,  నవభారత్‌ వెంచర్‌, ముకుంద్‌ లిమిటెడ్‌, ఏషియన్‌ హోటల్స్‌(ఈస్ట్‌), జేఆర్‌డీఎంకేజేఎల్‌, మరెల్‌ ఓవర్సీస్‌, డెక్కన్‌, సిమెంట్స్‌, డీసీఎం, నగరిక్‌ క్యాపిటల్‌ షేర్ల మూమెంటమ్‌ ఇండికేటర్లలో బుల్లిష్‌ క్రాస్‌ఓవర్‌ను గమనించవచ్చు. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు.  ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.
 
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.   

ఎంఎసీడీ అంటే...
మార్కెట్‌ నిపుణులు ఒక నిర్దేశిత కౌంటర్లో ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. 9రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజిని సిగ్నల్‌ లైన్‌గా పిలుస్తారు. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.



You may be interested

దీర్ఘకాల పెట్టుబడులకు సరైన సమయం: సెడానీ

Wednesday 4th March 2020

దేశీయంగా, అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లలో ఎంతో ఆందోళన కనిపిస్తోందని ఆనంద్‌రాతికి చెందిన ఈక్విటీ అడ్వైజరీ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్థ సెడానీ తెలిపారు. అయితే, వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌లో భాగంగా బాగా పడిపోయిన నాణ్యమైన కంపెనీలను పెట్టుబడుల కోసం ఎంచుకోవాలని తామ ఇన్వె‍స్టర్లకు సూచిస్తున్నట్టు చెప్పారు. మంచి కంపెనీల్లో పెట్టుబడులు ఈ సమయంలో ప్రారంభించుకోవాలన్నారు. కరోనా వైరస్‌ ప్రభావం తాత్కాలికమేనని చెప్పారు. దీర్ఘకాల పెట్టుబడులకు ఇది సరైన సమయంగా పేర్కొన్నారు. ఒక్కో

నేలక్కొట్టిన బంతి.. నేటి మార్కెట్‌

Tuesday 3rd March 2020

సెన్సెక్స్‌ 480 పాయింట్ల హైజంప్‌ 170 పాయింట్లు ఎగసిన నిఫ్టీ అన్ని రంగాలూ లాభాల్లోనే  మెటల్‌, ఫార్మా రంగాల దూకుడు రెండు రోజుల వరుస పతనానికి చెక్‌ పెడుతూ దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 480 పాయింట్లు జంప్‌చేసి 38,624 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 170 పాయింట్లు జమ చేసుకుని 11,303 వద్ద నిలిచింది. సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఏకంగా 5 శాతం జంప్‌చేయడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో

Most from this category