వడ్డీ రేట్లు తగ్గితే మరింత ర్యాలీ!
By Sakshi

‘వడ్డీ రేట్లు మరింతగా తగ్గితే కార్పొరేట్లకు లబ్ది చేకూరుతుంది. దీంతోపాటు, అధిక వృద్ధి అంచనాలు వలన వచ్చే ఏడాది పీఈ విస్తరణ జరుగుతుంది. ఫలితంగా మార్కెట్లు పెరగడం కొనసాగుతుంది’ అని మార్కెట్ విశ్లేషకుడు అజయ్ బగ్గా ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు.
బాటమ్ ఔట్‌కు దగ్గర్లో ఆర్థిక వ్యవస్థ ..
మిడ్‌క్యాప్, స్మాల్క్యాప్లపై ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగింది. ప్రస్తుత ర్యాలీని బ్యాంక్ షేర్లు నడిపిస్తున్నాయి. బ్యాంక్‌ల ట్రెజరీ లాభాలు స్థిరంగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా బ్యాంక్ ఎన్పీఏలు కూడా తగ్గుముఖంపట్టాయి. ఎస్సార్ రిజల్యుషన్ బ్యాంక్‌లపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. మొత్తంగా స్థూల ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పటికి, నిర్థిష్ట కంపెనీల వారిగా సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. మనం స్థూల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి బాటమ్ ఔట్‌కు దగ్గర్లో ఉన్నాం. అది డిసెంబర్ లేదా మార్చి లేదా తరువాత అయిన జరగవచ్చు. ఎఫ్ఐఐల ఇన్‌ఫ్లోలు పెరిగాయి. ఆర్బీఐ దేశీయ మార్కెట్లోకి నిధులను పంప్చేయడంతో వ్యవస్థలో లిక్వడిటీ పరిస్థితి మారింది.
ఫలితాల సీజన్ బాగుంది..
ఈ ఫలితాల సీజన్ బాగుంది. కార్పోరేట్ ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. ఫలితంగా వచ్చే ఏడాది అంచనాలు కూడా మెరుగయ్యాయి. ఇది మార్కెట్లకు సహాయపడుతుంది. సాధారణంగా మార్కెట్లను లాభాలు, మల్టిపుల్స్ నడిపిస్తాయి. గత నాలుగు లేదా ఐదు ఏళ్లలో కార్పొరేట్ లాభాలు ప్లాట్‌గా ఉన్నాయి. ఇప్పుడివి పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా మల్టిపుల్స్ విస్తరణ కూడా జరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఇది మార్కెట్లు మరింత పెరగడానికి తోడ్పడుతుంది.
ఈ రంగాలకు దూరం..
విదేశీ బ్రోకరేజిలు గత మూడు నాలుగేళ్ల నుంచి అనేక అంచనాలు వేస్తున్నాయి. ఇదే బాటమ్ అని అంటున్నాయి. కానీ దీనిని విమానయాన రంగం, టెలికాం రంగాలలో చూశాం. అధిక మూలధన వ్యయం, అధిక నియంత్రణ కలిగి సంస్థలు వినియోగదారులకు లాభం చేకూరుస్తాయి కానీ ఇన్వెస్టర్లు నష్టపోతారు. టెలికాం సెక్టార్‌కు దూరంగా ఉండమని సలహాయిస్తున్నా. వొడాఫోన్-ఐడియా, భారతి ఎయిర్టెల్ షేర్లు గత సెషన్లో భారీగా పెరిగి వుండొచ్చు, కానీ ఆ ముందు రోజు ఐడియా 20 శాతం మేర పడిపోయింది. గతేడాది రూ. 24 వద్ద ఉన్న ఐడియాను కొనుగోలు చేసుంటే ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయేవారు. ఇప్పుడీ షేరు రూ. 3 వద్ద ఉంది. ఈ రకంగా విలువ భారీగా పడిపోవడం టెలికాం సెక్టార్లో జరుగుతుంది.
5జీ స్పెక్ట్రమ్ వేలం..లాబీయింగ్
5జీ స్పెక్ట్రమ్ వేలం పాట పూర్తిగా నియంత్రణ సంస్థపై ఆధారపడివుంది. చక్కెర్ పరిశ్రమలో రాజకీయాలు చోటుచేసుకున్నట్టే. ఇందులో చాలా లాబియింగ్ జరుగుతుంటుంది. ఇలాంటి సెక్టార్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయడం? టెలికాం రంగానికి సంబంధించి సానుకూల పరిణామం ఏంటంటే ఏఆర్పీయూ(యావరేజ్ రేట్ పెర్ యూజర్) 5 శాతం పెంచడం. దీంతో రెవెన్యూ రూ. 35,000 కోట్ల వరకు పెరుగుతుంది. ఒకవేళ ఏపీఆర్ఏయూను రూ. 5-6 పెంచితే టెలికాం రంగానికి సంబంధించి అన్నిరకాల సమస్యలు పరిష్కారమవుతాయి.
You may be interested
క్రెడిట్ కార్డుతో పన్ను చెల్లింపులు?!
Monday 18th November 2019త్వరలో క్రెడిట్ కార్డులు, యూపీఐలు, మొబైల్ వాలెట్లతో ఆదాయపన్ను కట్టే వెసులుబాటు రానుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కేవలం నెట్ బ్యాంకింగ్ మరియు ఆరు బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే ఐటీ చెల్లింపులు చేసే అవకాశం ఉంది. కెనెరాబ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, పీఎన్బీ, ఎస్బీఐకు చెందిన డెబిట్ కార్డుల ద్వారా ఐటీ చెల్లించవచ్చు. త్వరలో యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేజ్) ద్వారా
సెన్సెక్స్ నష్టం 73 పాయింట్లు
Monday 18th November 2019మార్కెట్‌ను ప్రభావితం చేయగలిగిన అంశాలేవి లేకపోవడంతో సోమవారం సూచీలు స్వల్ప నష్టంతో ముగిశాయి. సెన్సెక్స్ 73 పాయింట్ల స్వల్ప నష్టంతో 40284 వద్ద, నిఫ్టీ 11 పాయింట్లను కోల్పోయి 11884 వద్ద స్థిరపడ్డాయి. అటో, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ఫార్మా, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. వాటితో పాటు రియల్టీ, ఐటీ, మీడియా షేర్లు కూడా స్వల్పంగా ర్యాలీ చేశాయి.