News


స్మాల్‌, మిడ్‌క్యాప్‌లకే ప్రయోజనం ఎక్కువ..: కోటక్‌

Sunday 25th August 2019
Markets_main1566755337.png-27998

ఆర్థిక రంగం తిరిగి కోలుకొని వృద్ధి బాట పడితే స్మాల్‌, మిడ్‌క్యాప్‌ కంపెనీలే ఎక్కువ ప్రయోజనం పొందుతాయని కోటక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎండీ నీలేష్‌షా అన్నారు. సమస్యల నుంచి ఆర్థిక రంగం కోలుకుని, పరుగులు తీయాలంటే ప్రభుత్వం తాజాగా ప్రకటించిన చర్యల మాదిరి టెంపో ఇక ముందూ కొనసాగాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత శుక్రవారం పలు రంగాలకు సంబంధించి ప్రకటించిన ప్రోత్సాహక చర్యలపై నీలేష్‌షా స్పందించారు. 

 

ప్రభుత్వ చర్యలు ప్యాకేజీ కంటే ఎక్కువన్నారు నీలేష్‌ షా. ఇది మార్కెట్లకు ఉత్సాహాన్నిస్తుందని అంచనా వేశారు. ‘‘ఎంతో మంది భాగస్వాములతో సంప్రదింపుల తర్వాత ఈ చర్యలు తీసుకున్నారు. పైగా గాయంపై బ్యాండ్‌ ఎయిడ్‌ పరిష్కారం మాదిరిగా లేదు. ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లకు సంబంధించి సమగ్రమైన పరిష్కారంలా ఉంది. చాలా చర్యలు దీర్ఘకాల దృష్టితో తీసుకున్నవి. మరీ ముఖ్యంగా భవిష్యత్తులోనూ మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కనుక ఈ మొత్తం ప్రక్రియను చూస్తే.. మార్కెట్‌ అభిప్రాయాలను వినే ఆర్థిక మంత్రి ఉందన్న నమ్మకాన్ని కలిగిస్తోంది. ఆమె మార్కెట్‌ పార్టిసిపెంట్లు, ఎఫ్‌పీఐలను సంప్రదించారు. దేశవ్యాప్తంగా పర్యటించి వ్యాపారస్తులను కలుసుకున్నారు. ఆ సంప్రదింపుల ఆధారంగా ఎఫ్‌పీఐలపై సర్‌చార్జీ ఉపసంహరణ వంటి బ్యాండ్‌ ఎయిడ్‌ పరిష్కారానికే పరిమితం కాకుండా సమగ్రమైన దృక్పధంతో ఆర్థిక రంగ పరిస్థితిని చక్కదిద్దే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. మార్కెట్లకు, ఆర్థిక రంగానికి ఇది ఎంతో నమ్మకాన్ని కలిగిస్తుంది’’అని నీలేష్‌ షా చెప్పారు. 

 

మూలధన లాభాలపై సర్‌చార్జీ ఉపసం‍హరణ వంటి చర్యలతో మార్కెట్లలో ఎంతో నమ్మకం ఏర్పడుతుందని నీలేష్‌ షా అభిప్రాయపడ్డారు. ‘‘ఏ దిల్‌ మాంగే మోర్‌ తరహ మార్కెట్లు స్పందిస్తాయి. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్ల ధరలు వాటి చారిత్రక సగటుకు దిగువకు వెళ్లాయి. ఆర్థిక రంగం పునరుత్తేజం చెందితే ఎక్కువ ప్రయోజనాలు చిన్న, మధ్య స్థాయి కంపెనీలకే వెళతాయి. విలువల పరంగా చూస్తే స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్లు కొనుగోలు జోన్‌లో ఉన్నాయి. సెంటిమెంటే ఇన్వెస్టర్లపై ప్రభావం చూపిస్తోంది. ప్రభుత్వ చర్యలతో ఈ సెంటిమెంట్‌ మెరుగుపడుతుంది. కానీ, అదే సమయంలో ఈ చర్యలు తీసుకునే విధానం ఇకముందూ కొనసాగాలి. వృద్ధికి మద్దతు ఇచ్చేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నారు. కానీ, అంతిమంగా ప్రధానమంత్రి లక్ష్యమైన 5 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీని చేరుకునే లక్ష్యం ముందున్నది. అందుకోసం టెస్ట్‌ మ్యాచ్‌లో ఒక్క వోవర్‌ చేస్తే సరిపోదు. ఇటువంటివే మరెన్నో సాధించాల్సి ఉంటుంది’’ అని నీలేష్‌ షా వివరించారు.You may be interested

మార్కెట్లు ముందుకే...: నిపుణుల అంచనాలు

Sunday 25th August 2019

అంతర్జాతీయ సంకేతాలు ఎలా ఉన్నా కానీ, మన స్టాక్‌ మార్కెట్లలో ర్యాలీ ఖాయమంటున్నారు పలువురు నిపుణులు. గత శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలు, ప్రోత్సాహక చర్యలు మార్కెట్ల ర్యాలీని నడిపిస్తాయంటున్నారు. విశ్లేషకులు, నిపుణుల అభిప్రాయాలు, అంచనాలను పరిశీలిస్తే...   ఎఫ్‌పీఐలపై పెంచిన సర్‌చార్జీని ఉపసంహరించుకోవడం మార్కెట్లకు చాలా సానుకూలం. బడ్జెట్‌ నాటి నుంచి తరలి వెళ్లిపోతున్న విదేశీ పెట్టుబడులను ఇది వెనక్కి రప్పిస్తుంది. రూపాయి బలపడేందుకూ కారణమవుతుంది.

‘మరో 5-8 శాతం కరెక్షన్‌ బాకీ ఉంది..’

Sunday 25th August 2019

బ్లూచిప్‌ స్టాక్స్‌లో బాగా దిద్దుబాటుకు గురైన వాటిని పోర్ట్‌ఫోలియోకు జత చేసుకోవడం అన్నది ప్రాధాన్య క్రమంలో కొనసాగాలని.. మంచి ఎర్నింగ్స్‌ అవకాశాలు, చక్కని పనితీరు, భవిష్యత్తు వృద్ధికి అవకాశాలు, కంపెనీల ఖాతాలు క్లీన్‌గా ఉన్న స్టాక్స్‌ను ప్రస్తుత స్థాయి నుంచి కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈవో ముస్తఫా నదీమ్‌.   ప్రస్తుత మార్కెట్‌ 2002-2003 తరహాలో లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా నదీమ్‌ చెప్పారు. ‘‘నాడు డాట్‌కామ్‌ బబుల్‌ నుంచి

Most from this category