ఐడీబీఐ 14.50శాతం అప్
By Sakshi

ప్రైవేట్ రంగ ఐడీబీఐ బ్యాంక్ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 14.50శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.24.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్ ఆరంభం నుంచే షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టరు, ట్రేడర్లు ఆస్తకి చూపడంతో ఒక దశలో షేరు 14.50శాతం పెరిగి రూ.28.40 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. మధ్యాహ్నం గం.2:40ని.లకు షేర్లు గతముగింపు(రూ.24.85)తో పోలిస్తే 12.50శాతం లాభంతో రూ.27.90 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కాగా షేర్లు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 23.80 రూ.65.80లుగా నమోదయ్యాయి. గత వారంలో ట్రేడింగ్ చివరి రోజైన శుక్రవారం ఫలితాలను వెల్లడించిన ఐడీబీఐ బ్యాంకు 12శాతం నష్టపోయిన సంగతి తెలిసిందే.
You may be interested
సెన్సెక్స్ టార్గెట్ తగ్గించిన సిటీ!
Monday 19th August 2019ఎర్నింగ్స్ గ్రోత్‌లో క్షీణతే కారణం ఫైనాన్షియల్స్ పైనే ఆశలు జూన్ త్రైమాసిక ఫలితాలు ఆశించినంత బాగాలేకపోవడంతో జూలై తర్వాత నుంచి మార్కెట్లలో పతనం వచ్చింది. దీంతో డౌన్‌గ్రేడ్ రిస్కులు మరింత పెరిగాయని బ్రోకరేజ్‌లు తమ రివ్యూ రిపోర్టుల్లో విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీల ఎర్నింగ్స్ అంచనాలను బ్రోకరేజ్‌లు తగ్గించాయి. దీంతో ఆర్థిక సంవత్సరం చివరకు కంపెనీలు మొదట అనుకున్నంత అంచనాలు అందుకోలేకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిటీ గ్రూప్ సెన్సెక్స్‌పై తన
అమ్మకాల ఒత్తిడిలో అడాగ్ షేర్లు
Monday 19th August 2019అనిల్ అంబాని గ్రూప్‌నకు చెందిన అడాగ్ షేర్లు సోమవారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఈ గ్రూప్‌లోని ప్రధాన షేర్లను రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్క్యాపిటల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేర్లు 4శాతం నుంచి 6శాతం క్షీణించాయి. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్:- నేడు ఎన్ఎస్ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.46.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభం నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన షేర్లు మిడ్‌సెషన్ కల్లా 6.50శాతం నష్టపోయి రూ.43.20వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు