STOCKS

News


ద్విచక్ర వాహనాలకు స్థిర అవుట్‌లుక్‌: ఇక్రా

Saturday 4th January 2020
Markets_main1578077771.png-30655

ముంబై: ప్రయాణికుల (పీవీ), వాణిజ్య వాహనాల (సీవీ) పట్ల తన నెగెటివ్‌ అవుట్‌లుక్‌ను రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా కొనసాగించింది. ఆర్థిక వృద్ధి నిదానించడం, రిటైల్‌ డిమాండ్‌ ఆశాజనకంగా లేకపోవడం వల్లే ఈ దృక్పథానికి వచ్చినట్టు తెలిపింది. అలాగే, ద్విచక్ర వాహనాలపై స్టెబుల్‌ అవుట్‌లుక్‌ను ప్రకటించింది. తగినంత నిధుల లభ్యత లేకపోవడం, రుణ షరతులు కఠినంగా మారడం, గ్రామీణ ఆదాయం బలహీనంగా ఉండడం గత కొన్ని త్రైమాసికాల్లో వినియోగ డిమాండ్‌పై గణనీయంగా చూపించినట్టు ఇక్రా తెలిపింది. 

 

రిటైల్‌ డిమాండ్‌లో వృద్ధి, అదే సమయంలో కంపెనీ నుంచి డీలర్లకు టోకున వాహనాల పంపిణీ మధ్య అంతరాన్ని పరిశీలిస్తే.. వాహన నిల్వలను తగ్గించుకోవడంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోందని పేర్కొంది. డీలర్ల వద్ద వాహన నిల్వలు నాలుగు వారాలకు సరిపడా ఉన్నాయని, ఇంతకు మించి నిల్వలను తగ్గించుకునే అవకాశాలు పరిమితమేనని.. స్వల్ప కాలంలో హోల్‌సేల్‌ డిమాండ్‌ అన్నది రిటైల్‌ డిమాండ్‌కు అనుగుణంగానే ఉండొచ్చని అంచనా వేసింది. ఆర్థిక వాతావరణం మెరుగుపడడం, నిధుల లభ్యత పెరగడం ఈ రంగం స్థిరంగా కోలుకునేందుకు కీలకమైన అంశాలుగా పేర్కొంది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్‌ వరకు ఎగుమతుల్లో 6.5 శాతం వృద్ధి నమోదవడం ప్రతికూలతలను కొంత తగ్గించినట్టు అభివర్ణించింది. 
 



You may be interested

మ్యూచువల్‌ ఫండ్స్‌ వర్గీకరణల్లో యాంఫి మార్పులు

Saturday 4th January 2020

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ ‘యాంఫి’ అర్ధ సంవత్సర స్టాక్స్‌ జాబితాను విడుదల చేసింది. సెబీ, స్టాక్‌ ఎక్సేంజ్‌లతో సంప్రదించిన అనంతరం స్టా‍క్స్‌తో జాబితాను రూపొందించినట్టు యాంఫి తెలిపింది. లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీలను వాటి మార్కెట్‌ విలువ ఆధారంగా నిర్ణయించే విషయంలో సెబీ 2017లో మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ఆధారంగా స్టాక్స్‌తో కూడిన జాబితాను యాంఫి రూపొందించి విడుదల చేయాల్సి ఉంటుంది. తాజా జాబితాలో పలు స్టాక్స్‌

ఇరాన్‌ టెన్షన్‌- మార్కెట్లు బోర్లా

Friday 3rd January 2020

బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో డౌన్‌ ఐటీ, ఫార్మా ఎదురీత మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్త వాతావరణం దేశీ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీసింది. అయితే విదేశీ మార్కెట్లలో ముడిచమురు, బంగారం ధరలు బలపడ్డాయి. దీంతో రూపాయి సైతం బలహీనపడగా.. తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో మార్కెట్లు ఆద్యంతం నేలచూపులతోనే కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 162 పాయింట్లు నీరసించి 41,465 వద్ద నిలవగా.. నిఫ్టీ 55 పాయింట్లు క్షీణించి 12,227 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌

Most from this category