News


బ్యాంకుల్లో ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బెటర్‌

Friday 10th January 2020
Markets_main1578636126.png-30828

మోతీలాల్‌ ఓస్వాల్‌ సిఫార్సులు
బడా బ్యాంకులు ఇకపై రికవరీ చెందుతాయని, ప్రాఫిట్స్‌లో బలమైన వృద్ధి నమోదు చేస్తాయని, దీంతో వీటి షేర్ల రీరేటింగ్‌ జరుగుతుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ వెల్లడించింది. బడా బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐలపై బుల్లిష్‌గా ఉన్నామని, మిడ్‌సైజ్‌ బ్యాంకుల్లో ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంకులపై పాజిటివ్‌గా ఉన్నామని తెలిపింది.
1. ఐసీఐసీఐ బ్యాంకు: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 625. మేలైన వ్యాపార వ్యూహాలు, వైవిధ్యమైన ఉత్పత్తులు, ఏకీకృత బ్యాకింగ్‌ మోడల్‌.. కారణంగా ఈ బ్యాంకు బలమైన వృద్ధి నమోదు చేయగలదు. రాబోయే రోజుల్లో లోన్‌గ్రోత్‌లో 16 శాతం మెరుగుదల ఉండొచ్చు. ఆర్‌ఓఏ 1.6 శాతం, ఆర్‌ఓఈ 15.7 శాతం వృద్ధి నమోదు చేస్తాయి. 
2. ఎస్‌బీఐ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 425. ఎర్నింగ్స్‌లో అద్భుత దూకుడు చూపేందుకు సిద్ధంగా ఉంది. ఎన్‌పీఏల పెరుగుదల తగ్గుతోంది. ఎస్సార్‌ స్టీల్‌ తదితర రుణాలు రికవరీ కావడం, రైటాఫ్‌ల స్థానంలో రైట్‌బ్యాక్స్‌ పెరగడం... బ్యాంకు ప్రొవిజన్‌ కవరేజ్‌ నిష్పత్తిని మరింత మెరుగుపరుస్తాయి. 
3. ఫెడరల్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 110. నికర ఒత్తిడిలో ఉన్న రుణాల్లో తరుగుదల కనిపిస్తోంది. స్లిపేజ్‌ల వాలు రేఖ క్రమంగా కిందకు దిగుతోంది. షేరు ధర 1.2 పీఈ వాల్యూషన్ల వద్ద ట్రేడవుతూ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. షేరులో రీరేటింగ్‌ అవకాశాలు కనిపిస్తున్నాయి. 
4. ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 900. వ్యాపార వృద్ధి బలంగా ఉంటుందని, మార్జిన్లలో స్థిరత్వం వస్తుందని అంచనాలున్నాయి. భవిష్యత్‌లో పెద్ద బ్యాంకుగా ఎదిగే సత్తా ఉన్న ఫ్రాంచైజీగా ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయం ట్రేడింగ్‌ వాల్యూషన్లలో ప్రతిబింబిస్తోంది. 



You may be interested

తొలిసారి 12300 దాటిన నిఫ్టీ

Friday 10th January 2020

కలిసొచ్చిన ఐటీ, బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ  మరో ఆల్‌టైమ్‌ హై రికార్డు సొంతం కొత్త ఏడాదిలో నిఫ్టీ ఇండెక్స్‌ సరికొత్త జీవితకాల గరిష్టా‍న్ని నమోదు చేసింది. గతేడాది డిసెంబర్‌ 20న నమోదు చేసిన 12,293.90 స్థాయిని అధిగమించి 12,303 వద్ద కొత్త ఆల్‌టైం హైని నమోదు చేసింది. ఇరాన్‌, అమెరికా మధ్య గత వారం నెలకొన్న ఉద్రిక్త వాతావరణం సద్దుమనగడంతో నేటి ఉదయం నిఫ్టీ ఇండెక్స్‌  మునుపటి ముగింపుతో పోలిస్తే 12,216 పోలిస్తే

యస్‌ బ్యాంక్‌ షేరు టార్గెట్‌ రూ. 25?

Friday 10th January 2020

యస్‌ బ్యాంక్‌ షేరు రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ రూ. 15-55 ధరలో నిధుల సమీకరణ? పెద్ద ప్రయివేట్‌ రంగ బ్యాంకులు భేష్‌ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌.. వీక్‌! మోర్గాన్‌ స్టాన్లీ తాజా అంచనాలు  నిధుల సమీకరణలో ఆలస్యం, రుణ నాణ్యత నీరసించడం వంటి అంశాల కారణంగా యస్‌ బ్యాంక్‌ షేరుని తాజాగా గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసుల దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ డౌన్‌గ్రేడ్‌ చేసింది. షేరుకి రూ. 25 టార్గెట్‌ ధరను ప్రకటించింది. ఈ ఏడాది(2020) సైతం​ ప్రధాన

Most from this category