News


వైవిధ్యమైన పెట్టుబడులు కోసం

Monday 2nd September 2019
Markets_main1567403308.png-28149

డి.జయంత్‌ కుమార్‌, థర్డ్‌ పార్టీ ప్రొడక్ట్స్‌ హెడ్‌, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ 

గడిచిన ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల కాలంలో మార్కెట్లు తీవ్ర అస్థిరతలను ఎదుర్కొన్నాయి. ఈ పరిస్థితి మరికొంత కాలం పాటు కొనసాగే అవకాశం లేకపోలేదు. దీంతో ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడుల విషయమై ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ అస్థిరతలు దీర్ఘకాలంలో సంపద సృ‍ష్టికి దారితీసేవే అయినప్పటికీ, స్వల్ప కాలంలో ఎదురయ్యే నష్టాలు ఇబ్బంది పెడతాయి. రిస్క్‌కు విముఖంగా ఉండే ఇన్వెస్టర్లు, అదే సమయంలో మంచి రాబడులు కోరుకునే వారు మల్టీ అ‍స్సెట్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ అస్సెట్‌ ఫండ్‌ రిస్క్‌ను అధిగమించి మరీ దీర్ఘకాలంలో మంచి పనితీరు చూపించింది. 

పెట్టుబడుల విధానం...
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ అస్సెట్‌ ఫండ్‌ అన్నది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. భిన్న రకాల సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ప్రధానంగా ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టించడం, అలాగే, డెట్‌, బంగారం వంటి ఇతర సాధనాల్లోనూ పెట్టుబడులతో స్థిరమైన ఆదాయం కల్పించే విధంగా ఈ పథకం పనిచేస్తుంది. వైవిధ్యమైన అస్సెట్‌ క్లాసెస్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు ఈ పథకం అనుకూలం. ఈక్విటీ సంబంధిత సాధనాల్లో 65 శాతం వరకు, డెట్‌, గోల్డ్‌/గోల్డ్‌ ఈటీఎఫ్‌లో 10-35 శాతం వరకు, రీట్‌, ఇన్విట్‌ వంటి సాధనాల్లో 0-10 శాతం వరకు ఈ పథకం ఇన్వెస్ట్‌ చేస్తుంది. శంకరన్‌ నరేన్‌ 2012 ఫిబ్రవరి నుంచి ఈ పథకానికి ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు 2006 సెప్టెంబర్‌ నుంచి 2011 ఫిబ్రవరి వరకు కూడా ఆయన ఈ పథకం నిర్వహణను చూశారు. ఆయనకు మొత్తం 29 ఏళ్ల అనుభవం ఉంది. ఇహబ్‌ దల్వాయి, అనుజ్‌ తగ్రా సైతం ఈ పథకానికి ఫండ్‌ మేనేజర్లుగా ఉన్నారు. ఈక్విటీలో పెట్టుబడులు అధిక రాబడుల సాధనకు, డెట్‌, బంగారం ఇతర సాధనాల్లో పెట్టుబడులు రిస్క్‌ బ్యాలన్స్‌తోపాటు స్థిరమైన రాబడులకు ఇచ్చేందుకు వీలు కల్పిస్తాయి. ప్రస్తుతం ఈ పథకం ఈక్విటీలో 66.24 శాతం వరకు పెట్టుబడులు పెట్టి ఉంది. ఫ్లెక్సీ క్యాప్‌ విధానాన్ని ఈక్విటీ పెట్టుబడులకు అనుసరిస్తుంది. అంటే అందుబాటులో ఉన్న అవకాశాలను బట్టి అన్ని మార్కెట్‌ క్యాప్‌ విభాగాల్లోనూ స్టాక్స్‌ను ఫండ్‌ మేనేజర్లు ఎంపిక చేసుకుంటుంటారు. ఈ పథకం డెట్‌ విభాగంలో 15.66 శాతం, బంగారం, ఇతర కమోడిటీల్లో 12.82 శాతం ఇన్వెస్ట్‌ చేయగా, నగదు, నగదు సమానాలు 5.28 శాతం వరకు ఉన్నాయి. ఈ పథకం ఇంధనం, బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌, మెటల్స్‌ స్టాక్స్‌లో ఎక్కువ వెయిటేజీ కలిగి ఉంది. పనితీరు
ఈ పథకం నిర్వహణలో రూ.11,060 కోట్ల ఆస్తులు జూలై చివరి నాటికి ఉన్నాయి. మూడు, ఐదు, పదేళ్ల కాలంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ అస్సెట్‌ ఫండ్‌ బెంచ్‌ మార్క్‌తో చూసుకుంటే మంచి పనితీరు చూపించింది. ఈ పథకం ఆరంభం నుంచి చూసుకుంటే సగటున 21.96 శాతం వార్షిక రాబడులను ఇచ్చింది. కానీ, అదే కాలంలో బెంచ్‌ మార్క్‌ ఇండెక్స్‌ రాబడులు 17.90 శాతంగానే ఉన్నాయి. ఈ పథకం ఆరంభమైన 2002 అక్టోబర్‌ 31 నుంచి నుంచి ప్రతీ నెలా రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తూ వచ్చినట్టయితే ఈ ఏడాది జూన్‌ చివరికి రూ.97.62 లక్షలు సమకూరేది. ఇందులో పెట్టుబడి రూ.19.9 లక్షలు. ఈ పథకానికి మంచి డివిడెండ్‌ చరిత్ర కూడా ఉంది. ప్రతీ నెలా డివిడెండ్‌  చెల్లిస్తూనే ఉంది. మల్టీ అస్సెట్‌ ఫండ్‌ విభాగంలో పోటీ పథకాలైన యూటనై మల్టీ అస్సెట్‌ ఫండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ మల్టీ అస్సెట్‌ ఫండ్‌, యాక్సిస్‌ ట్రిపుల్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌, ఎస్‌బీఐ మల్టీ అస్సెట్‌ అలోకేషన్‌ ఫండ్‌ కంటే కూడా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ అస్సెట్‌ పథకమే మూడు, ఐదు, పదేళ్లు, ఆరంభం నుంచి అధిక రాబడులను ఇచ్చినట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. భిన్న సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు, కనీసం ఐదేళ్ల కాలానికి ఈ పథకాన్ని పరిశీలించొచ్చు.

 You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నిలువునా పతనం

Monday 2nd September 2019

సోమవారంనాటి సెలవు అనంతరం మంగళవారం భారత్‌ సూచీలు భారీ గ్యాప్‌డౌన్‌తో ఆరంభమయ్యే సంకేతాల్ని తాజాగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానంగా విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సోమవారం మధ్యాహ్న సమయంలో 150 పాయింట్లకుపైగా పతనమయ్యింది. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండడంతో పాటు, ఈ జూన్‌ త్రైమాసికంలో  దేశ జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడం, అలాగే ఆగస్టులో వాహన విక్రయాలు భారీగా తగ్గినట్లు ఆదివారం గణాంకాలు వెలువడటం,

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 2nd September 2019

హెచ్‌డీఎఫ్‌సీ     కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: షేర్‌ఖాన్‌  ప్రస్తుత ధర: రూ.2,167 టార్గెట్‌ ధర: రూ.2,500 ఎందుకంటే:- హౌసింగ్‌ ఫైనాన్స్‌కంపెనీలకు నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ) ద్వారా అదనంగా రూ.20,000 కోట్ల నిధులు అందుబాటులోకి తేవాలని కేంద్ర  ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇలాంటి ప్రభుత్వ ఉద్దీపన చర్యల వల్ల  హెచ్‌డీఎఫ్‌సీ వంటి బలమైన హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు మేలు కలుగుతుంది. ప్రభుత్వ ప్యాకేజీ చర్యల కారణంగా ఈ కంపెనీకి నిధుల వ్యయం తగ్గుతుంది. ఫలితంగా వడ్డీరేట్లపై

Most from this category