News


యస్‌బ్యాంక్‌ షేర్లను కొన్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌

Monday 13th January 2020
Markets_main1578912191.png-30896

దేశీయ రెండో అతిపెద్ద అసెట్‌మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ యస్‌బ్యాంక్‌ బ్యాంకు షేర్లను కొనుగోలు చేసింది. యస్‌బ్యాంక్‌కు చెందిన 10.57లక్షల ఈక్విటీ షేర్లను డిసెంబర్‌ త్రైమాసికంలో కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. డిసెంబర్‌ క్వార్టర్‌లో ఇంధన, ఫార్మా, స్టాఫింగ్‌, ప్రైవేట్‌, ప్రభుత్వ బ్యాంకు షేర్ల కొనుగోలుకు ఆసక్తి చూపింది. టెలికాం, అటో, ఐటీ రంగాలకు చెందిన షేర్లను విక్రయించింది. మొత్తంగా ఆయారంగాలకు చెందిన సుమారు 350 కంపెనీల్లో వాటాలు పెంచుకోగా, 145 కంపెనీల్లో వాటాలను తగ్గించుకుంది. 

గడచిన వారంలో ఐసీఐసీఐ  ప్రుడెన్షియల్‌ 2.65 కోట్ల టాటా పవర్‌ షేర్లను, వాటితో పాటు కేడిలా హెల్త్‌కేర్‌ 59.71లక్షల షేర్లను, ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెన్‌కు చెందిన 52.35లక్షల ఈక్విటీ షేర్లను, భెల్‌కు చెందిన 45లక్షల ఈక్వీటి షేర్లను, ఓఎన్‌జీసీకు చెందిన 36.37 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. నెలరోజు వ్యవధిలో టాటా పవర్‌ షేరు 1.57శాతం క్షీణించింది. ఇదే కాలవ్యవధిలో ఎంఅండ్‌ఎం ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ 8శాతం, భెల్‌ కంపెనీ 18శాతం నష్టపోయాయి. 

అసెట్‌మేనేజ్‌మెంట్‌ ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఈ కార్వర్టర్‌లో ఆర్‌బీఎల్‌కు చెందిన 13.24 లక్షల ఈక్విటీ షేర్లను, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చెందిన 13.24లక్షల ఈక్విటీ షేర్లను, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌కు 12.61లక్షల ఈక్విటీ షేర్లను, యస్‌బ్యాంక్‌కు చెందిన 10.57 లక్షల ఈక్విటీ షేర్లను, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు చెందిన 9.30లక్షల ఈక్విటీ షేర్లను, ఫెడరల్‌బ్యాంక్‌ కు చెందిన 8.8లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌, అటోరంగానికి చెందిన అశోక్‌ లేలాండ్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగానికి డీఎల్‌ఎఫ్‌, కాఫీ దిగ్గజ కంపెనీ టాటా కాఫీ, లిక్కర్‌ సంస్థ యూనిటెడ్‌ బేవరీజెస్‌ తదితర కంపెనీలకు చెందిన 5నుంచి 12లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. 

అటోరంగానికి సంబంధించి ఫండింగ్‌ హౌస్‌ ఎంఅండ్‌ఎం, హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ అటో కంపెనీ షేర్లను కొనుగోలు చేసింది. అలాగే కొత్తగా టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌కు చెందిన 18.52 లక్షల ఈక్విటీ షేర్లను, క్వెస్‌ కార్ప్‌చెందిన 18.52లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. ఎల్‌అండ్‌టీ, జీ ఎంటర్‌మైన్‌మెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, సిటీ యూనియన్‌ బ్యాంక్‌, ఇండిగో, హావెల్స్‌ ఇండియా, బర్గర్‌ పేయింట్స్‌ షేర్లు కొనుగోలు చేసింది. 



You may be interested

గత నెలలో ఫండ్స్‌ టాప్‌ షాపింగ్‌ వీటిల్లోనే..

Tuesday 14th January 2020

యాక్టివ్‌ ఓపెన్‌ ఎండెడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు తమ నిర్వహణలోని పథకాల పోర్ట్‌ఫోలియోను మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పడికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తుంటారు. కొత్తగా ఏ షేర్లను అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు) కొనుగోలు చేశాయి, వేటిని విక్రయించాయనే వివరాలను నెలకు ఒకసారి తెలుసుకునే అవకాశం ఇన్వెస్టర్లకు ఉంటుంది. ఎందుకంటే పోర్ట్‌ఫోలియో వివరాలను నెలకు ఒకసారి వెల్లడించడాన్ని సెబీ తప్పనిసరి చేసింది. ఈ ప్రకారం చూస్తే గత

అనలిస్టుల నుంచి టాప్‌ 12 సిఫార్సులు

Monday 13th January 2020

వచ్చే కొన్ని వారాల్లో మంచి రాబడులు అందించే సత్తా ఉన్న 12 స్టాకులను వివిధ అనలిస్టులు అందిస్తున్నారు.  శ్రీకాంత్‌ చౌహాన్‌, కోటక్‌ సెక్యూరిటీస్‌. 1. హెచ్‌యూఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2060. స్టాప్‌లాస్‌ రూ. 1900. గతర్యాలీ అనంతర రిట్రేస్‌మెంట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. కీలక రిట్రేస్‌మెంట్‌ జోన్‌ నుంచి షేరు బలంగా రివర్సయింది. దీన్నిబట్టి షేరులో కరెక‌్షన్‌ ముగిసిందని భావించవచ్చు. వీక్లీ చార్టుల్లో బుల్లిష్‌ ఎంగల్ఫింగ్‌ ప్యాట్రన్‌ ఏర్పరచడం ద్వారా మరింత

Most from this category