News


రికార్డు గరిష్టానికి ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

Thursday 27th June 2019
Markets_main1561618457.png-26610

ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజ కంపెనీలైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు గురువారం తమ కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. నేడు మార్కెట్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు లభిస్తున్న మద్దతులో భాగంగా ఈ రెండు షేర్లు ర్యాలీ చేస్తున్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.2,468.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ను ప్రారంభం నుంచి ఈ షేరు కొనుగోలుకు ఇన్వెస్టర్లకు మొగ్గుచూపడంతో 0.81శాతం లాభపడి రూ.2488.00ల వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నాన్‌ బ్యాంకింగ్‌ రంగంలో తలెత్తిన ద్రవ్యకొరత సంక్షోభం నేపథ్యంలో తన అనుబంధ సంస్థ హెచ్‌డీబీ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఆఫర్‌ను రానున్నట్లు బుధవారం వార్తలు వెల్లువడ్డాయి. ఐపీఓలో భాగంగా కంపెనీ మొత్తం 1బిలియన్‌ డాలర్‌ నిధులను సమీకరించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మధ్యా‍హ్నం 12:00లకు షేరు గత ముగింపు(రూ.2,467.90)తో పోలిస్తే 0.61శాతం లాభంతో రూ.2,483.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1,885.00లు, రూ.2488.00లుగా నమోదయ్యాయి. 
ఐసీఐసీఐ బ్యాంకు:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.438.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో షేరు కొనుగోళ్లకు మద్దతు లభించడంతో ఒక దశలో షేరు 1శాతం పెరిగి రూ.442.75ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యా‍హ్నం 12:00లకు షేరు గత ముగింపు(రూ.438.65)తో పోలిస్తే 0.85శాతం లాభంతో రూ.442.40ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.256.50లు, రూ.442.75లుగా నమోదయ్యాయి. 

 



You may be interested

బడ్జెట్‌ నేపథ్యంలో క్యాలెండర్‌ కాల్‌ వ్యూహం బెటర్‌!

Thursday 27th June 2019

 నిపుణుల సలహా బడ్జెట్‌ వారం వీక్లీ నిఫ్టీ ఆప్షన్లలో క్యాలెండర్‌ కాల్‌ రేషియో స్ప్రెడ్‌ వ్యూహాన్ని అవలంబించడం ద్వారా మంచి రాబడి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యూహంలో కొంచెం దూరం స్రై‍్టక్‌ప్రైస్‌లోని రెండు కాల్స్‌ను విక్రయించి వాటి దిగువ స్ట్రైక్‌ ప్రైస్‌కు చెందిన మరసటి వారం కాల్‌ను కొనుగోలు చేయడం జరుగుతుంది. బడ్జెట్‌ వేళ ఇది మంచి వ్యూహమని, బడ్జెట్‌కు ముందు నిఫ్టీ 12150 పాయింట్లను దాటదన్న అంచనాతో ఈ

ప్రైవేట్‌ బ్యాంకు షేర్ల ర్యాలీ: లాభాల్లో నిఫ్టీ బ్యాంకు

Thursday 27th June 2019

మార్కెట్‌ ర్యాలీ భాగంగా ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ బ్యాంక్‌ లాభాల బాటపట్టింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించిస్తున్న ఈ ఇండెక్స్‌ నేడు 31,192.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లు లాభపడటంతో బ్యాంక్‌ నిఫ్టీ 236 పాయింట్లు (0.75శాతం) లాభపడి 31,398.45 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు

Most from this category