News


ఐసీఐసీఐ బ్యాంకుపై బుల్లిష్‌!

Monday 28th October 2019
Markets_main1572238254.png-29175

సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం ఐసీఐసీఐ బ్యాంకుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా మారాయి. క్యు2లో బ్యాంకు అనేక అంశాల్లో పాజిటివ్‌ గణాంకాలు నమోదు చేసింది. దీంతో బ్యాంకు షేరు టార్గెట్‌ను సైతం బ్రోకరేజ్‌లు పెంచాయి. క్యు2లో బ్యాంకు రూ. 655 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఒకదఫా చెల్లించాల్సిన పన్ను మొత్తం కారణంగా లాభం తగ్గిందని, ఈ పన్ను లేకుంటే లాభం రూ. 3575 కోట్లుండేదని బ్యాంకు పేర్కొంది. 
- ఎమ్‌కే గ్లోబల్‌: ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌, రూ. 580 టార్గెట్‌. తమ ఆల్ఫా పోర్టుఫోలియోలో బ్యాంకు షేరును చేర్చింది. బ్యాంకుకు  ఒత్తిడిలో ఉన్న ఆస్తుల పరంగా కొంత ఇబ్బందులు ఇంకా ఉన్నాయని, కానీ ఈ విషయమై తీసుకుంటున్న చర్యలు క్రమంగా ఫలితాలన్నిస్తున్నాయని తెలిపింది. క్రమంగా బ్యాంకు ఎన్‌పీఏలు మరింత దిగిరావచ్చని అంచనా.
- ప్రభుదాస్‌ లీలాధర్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 541. ఎన్‌ఐఎంలు మెరుగవడం, బలమైన పీసీఆర్‌, ఆసెట్‌ క్వాలిటీ రిస్కులు తగ్గుతుండడం, వ్యయాలపై నియంత్రణ.. బ్యాంకును బలమైన రికవరీ బాటలో నడిపిస్తాయి. దీంతో రాబోయే రోజుల్లో ఆర్‌ఓఈ 16- 17 శాతానికి మెరుగుపడుతుంది. 



You may be interested

పెద్ద కార్పొరేట్‌ బ్యాంకులకే మా ప్రాధాన్యం!

Monday 28th October 2019

 ‘ఇప్పటి వరకు మూడు కార్పొరేట్‌ బ్యాంకులు వాటి త్రైమాసికపు ఫలితాలను ప్రకటించాయి. ఒత్తిడిలో ఉన్న ఆస్తుల నుంచి బయటపడుతున్నట్లు, ఇక్కడి నుంచి పరిస్థితులు సాధరణ స్థాయికి వస్తాయనే అభయాన్ని ఈ ఫలితాలు ఇస్తున్నాయి. అంతేకాకుండా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లిక్విడిటీ లభ్యత పెరిగిందనే విషయం ఈ ఫలితాల ద్వారా తెలుస్తోంది. గత ఏడాదితో పొలిస్తే వచ్చే ఏడాది బాగుంటుందని ఆశిస్తున్నా’ అని అబాకస్‌ అసెట్‌ మానేజర్‌, వ్యవస్థాపకుడు, సునిల్‌ సింఘానియా ఓ

నేడు మార్కెట్లకు సెలవు

Monday 28th October 2019

దిపావళి బలిప్రతిపాద సందర్భంగా నేడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. ఈక్విటీ మార్కెట్‌తో పాటు కమోడిటీ మార్కెట్‌ కూడా ఈ రోజు పనిచేయదు. ఎంసీఎక్స్‌లో మాత్రం ఈ రోజు సాయంత్రం ట్రేడింగ్‌ జరుగుతుంది. దీపావళి రోజున ముహూరత్‌ ట్రేడింగ్‌ అంటూ ప్రత్యేక ట్రేడింగ్‌ను స్టాక్‌ఎక్చేంజ్‌లు నిర్వహిస్తాయి. దీపావళి మరుసటి రోజు సెలవు ఇస్తారు. ఈ దఫా ముహూరత్‌ ట్రేడింగ్‌లో సూచీలు పాజిటివ్‌గా క్లోజయ్యాయి. దీంతో మార్కెట్‌ సంవత్‌ 2076ను పాజిటివ్‌గా

Most from this category