News


రికార్డు స్థాయికి ఐసీఐసీఐ బ్యాంక్‌

Tuesday 22nd October 2019
Markets_main1571728284.png-29052

ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు విలువ మంగళవారం సెషన్‌లో మరోదఫా రికార్డుస్థాయిని చేరింది. గత నెలలో కేంద్రం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు సమయంలో నెలకొల్పిన రూ. 458.65 స్థాయిని తిరిగి ఈ రోజు ఐసీఐసీఐ బ్యాంక్‌ టచ్‌చేయడం విశేషం.  మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు విలువ 4.5 శాతం లాభపడి రూ. 458.70 స్థాయికి చేరింది. గత సెషన్లో రూ. 437.80 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం సెషన్లో రూ. 440.50 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమై, క్రమేపీ ర్యాలీ జరిపింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి అక్టోబర్‌ 26 వ తేదిన తన ఫలితాలను ప్రకటించనుంది. ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మంచి ఫలితాలను ప్రకటించడంతో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫలితాలు కూడా బాగుంటాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దీంతో పాటు క్యూ1లో మంచి ఫలితాలను ప్రకటించిన ఈ బ్యాంక్‌, తాజాగా ఎటువంటి డిఫాల్ట్‌ ఎదుర్కోక పోవడంతో బ్యాంక్‌ ఫలితాలపై అంచనాలు పెరిగాయి. ఫలితంగా



You may be interested

డీఎల్‌ఎఫ్‌ 6% అప్‌

Tuesday 22nd October 2019

 డీఎల్‌ఎఫ్‌ మంగళవారం ట్రేడింగ్లో మూడు నెలల గరిష్ఠానికి చేరుకోవడంతో నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ పాజిటివ్‌గా కదులుతోంది. మధ్యాహ్నాం 12.54 సమయానికి 0.99 శాతం లాభపడి 265.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో డీఎల్‌ఎఫ్‌ షేరు 6.01 శాతం లాభపడి రూ. 179.00 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 168.85 వద్ద ముగిసిన ఈ కంపెనీ షేరు, మంగళవారం సెషన్‌లో రూ. 170.00 వద్ద  పాజిటివ్‌గా ప్రారంభమై, రూ.

తగ్గిన చమురు

Tuesday 22nd October 2019

యుఎస్‌-చైనా మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కారించుకునేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతుండడంతో మంగళవారం ట్రేడింగ్‌లో చమురు ధరలు స్థిరంగా కదులుతున్నాయి. కానీ అంతర్జాతీయంగా చమురుకు డిమాండ్‌ తగ్గడంతో చమురు మార్కెట్లు ప్రతికూల దృక్పథంతోనే ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు. ఉదయం 11.22 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.25 శాతం నష్టపోయి బారెల్‌ 58.81 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్‌ 0.34 శాతం నష్టపోయి బారెల్‌ 53.33 డాలర్‌ వద్ద ట్రేడవుతున్నాయి.

Most from this category