News


ఐసిఐసిఐ బ్యాంక్‌కు బ్రోకరేజ్‌ల థమ్స్‌అప్‌

Monday 29th July 2019
Markets_main1564393691.png-27385

ఐసిఐసిఐ బ్యాంక్ జూన్ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ల అంచనాలకు మించి నమోదు కావడంతో ఈ షేరు ఇన్వెస్టర్లను ఆకర్షించింది. సోమవారం ట్రేడింగ్‌లో బెంచ్‌మార్క్‌ సూచీలు నష్టాల్లో ఉండగా ఐసిఐసిఐ షేరు మాత్రం పాజిటివ్‌గా కదలాడింది. మధ్యాహ్నాం 2.51 సమయానికి ఈ షేరు 3.24 శాతం లాభపడి రూ.429.20 వద్ద ట్రేడవుతోంది. ఈ స్టాక్‌ వచ్చే ఏడాది కాలానికి 25-50 శాతం ర్యాలీ చేసే అవకాశం ఉందని బ్రోకరేజీలు అభిప్రాయపడుతున్నాయి.
    ఈ బ్యాంక్‌ ఆస్తి నాణ్యత మెరుగుపడుతుందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. అంతేకాకుండా ఈ కంపెనీ టార్గెట్‌ ధరను రూ. 625 గా నిర్ణయించి ‘ఓవర్‌ వెయిట్‌’ రేటింగ్‌ను ఇచ్చింది. ఈ కంపెనీ వృద్ధి దశ జూన్‌ క్వార్టర్‌తో మొదలైందని తెలిపింది. ఈ స్టాకు శుక్రవారం సెషన్‌లో రూ.415.50 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.  స్థిరమైన, లాభదాయకమైన వృద్ధి కోసం ఈ బ్యాంక్‌ కట్టుబడి ఉందనే విషయం జూన్‌ త్రైమాసిక ఫలితాలు తెలుపుతున్నాయని ఎడిల్‌వీజ్‌ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. ఈ స్టాకు టార్గెట్‌ ధరను రూ.585 గా నిర్ణయించి ‘బై’ రేటింగ్‌ను ఇచ్చింది. బ్యాంకింగ్ సెక్టార్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ అగ్రస్థానంలో ఉందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. ఈ స్టాక్‌ టార్గెట్‌ ధరను రూ. 520 గా నిర్ణయించింది. లార్జ్‌క్యాప్‌ ప్రైవేట్‌ బ్యాంకులలో ఐసిఐసిఐ బ్యాంక్‌ స్టాకు తక్కువ ధరకే లభిస్తోందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీష్‌ తెలిపింది.

ఐసిఐసిఐ జూన్‌ త్రైమాసిక ఫలితాలు..
ఐసీఐసీఐ బ్యాంక్‌ జూన్‌ త్రైమాసికంలో రూ.1,908 కోట్ల నికర లాభాన్ని శనివారం ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 120 కోట్ల నష్టాన్ని నమోదుచేసిన విషయం గమనార్హం. ఈ బ్యాంక్‌ లాభం రూ.1,350 కోట్లు-రూ.2,150 కోట్ల మధ్య ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 27 శాతం (ఏడాది నుంచి ఏడాదికి) పెరిగి రూ.7,737 కోట్లుగా నమోదయ్యింది. ఈ ఎన్‌ఐఐలో ఆదాయపు పన్ను వాపసుపై వచ్చిన వడ్డీ రూ.184 కోట్లు కూడా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ వడ్డీ రూ. 8 కోట్లుగా నమోదయ్యింది. ఎన్‌ఐఐ ఆదాయం బ్రోకరేజీ సంస్థల అంచనాల కంటే బాగుండడం గమనర్హం. 
     వడ్డీయేతర ఆదాయం (ట్రెజరీ ఆదాయాన్ని మినహాయించి)  రూ .3,247 కోట్లకు పెరిగిందని, ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 3,085 కోట్ల కంటే ఎక్కువని బ్యాంక్‌ పేర్కొంది. ఈ బ్యాంక్‌ కేటాయింపులు గత ఏడాది జూన్‌ త్రైమాసికంలో రూ.5,971 కోట్లుండగా ఇప్పుడు రూ.3,496 కోట్లకు తగ్గాయి. ఈ త్రైమాసికంలో స్థూలంగా రూ.2,779 కోట్లు ఎన్‌పీఏలకు కలిశాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.4,036 కోట్లకు చేరగా ఇప్పుడు తగ్గడం గమనర్హం. నిరర్ధక రుణాల రికవరీలు, నవీకరణలు రూ. 931 కోట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో 6.70 శాతంగా ఉన్న ఎన్‌పీఏలు ఈ త్రైమాసికం నాటికి 6.49 శాతానికి తగ్గాయి. గత ఏడాది జూన్‌ క్వార్టర్‌లో ఈ ఎన్‌పీఏలు 8.81 శాతంగా ఉండడం తెలిసిందే. నికర ఎన్‌పిఎలు కూడా మార్చి త్రైమాసికంలో 2.06 శాతం ఉండగా, ఈ త్రైమాసికంలో 1.77 శాతానికి తగ్గాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ ఎన్‌పీఏలు 4.19 శాతంగా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) 3.19 శాతం నుంచి 3.61 శాతానికి పెరిగింది.
   ఫీజు ఆదాయం 10 శాతం పెరిగి రూ. 3,039 కోట్లకు చేరుకుంది. రిటైల్ ఫీజు మొత్తం ఫీజులో 72 శాతం ఉందని బిఎస్ఇ ఫైలింగ్‌లో బ్యాంక్  తెలిపింది. ట్రెజరీ ఆదాయం రూ .179 కోట్లుగా ఉంది. గత  త్రైమాసికంలో ట్రెజరీ ఆదాయానికి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో వాటా అమ్మకపు ఆదాయం కలవడం వలన రూ .1,110 కోట్ల లాభం లభించింది.  కోర్ ఆపరేటింగ్ లాభం (అనుబంధ సంస్థల నుంచే వచ్చే డివిడెండ్ ఆదాయాన్ని మినహాయించి)  25 శాతం పెరిగి రూ .4,725 కోట్ల నుంచి రూ. 5,919 కోట్లకు చేరుకుంది. You may be interested

ఇండియాపైనే విదేశీ ఇన్వెస్టర్ల చిన్నచూపు

Monday 29th July 2019

జూలై నెలలో ఇప్పటివరకు దేశియ ఈక్విటీ మార్కెట్ల నుంచి 200 కోట్ల డాలర్ల పెట్టుబడులను విదేశీ ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ఇది ఈ నెలలో ఇతర వర్థమాన మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్న పెట్టుబడుల కంటే అధికం కావడం గమనర్హం. సూపర్‌ రిచ్ ట్యాక్స్‌ విధించడంతో పాటు దేశియంగా ఆర్థిక మందగమనం కొనసాగుతుండడంతో స్టాక్‌ మార్కెట్‌ నుంచి ఎఫ్‌ఐఐలు వెళ్లిపోతున్నాయని పరిశీలకులు తెలిపారు. ఈ నెలలో సెన్సెక్స్‌, నిఫ్టీ 4 శాతం మేర నష్టపోయాయి.   థాయిలాండ్, ఇండోనేషియా, దక్షిణ

9 శాతం డౌన్‌...2 నెలల కనిష్టానికి గ్రాసిమ్‌

Monday 29th July 2019

ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు చెందిన గ్రాసీం ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 2నెలల కనిష్టానికి పతనమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.875.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేటి మార్కెట్‌ పతనంలో భాగంగా ఇంట్రాడేలో సిమెంట్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఆదిత్యాబిర్లా గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌...ఇదే గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌, వోడాఫోన్‌ ఐడియాల్లో గణనీయమైన వాటా కలిగి వుంది.

Most from this category