News


కొత్త ఆల్‌టైం హైకి ఐసీఐసీఐ బ్యాంక్‌

Friday 8th November 2019
Markets_main1573188462.png-29441

మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు శుక్రవారం కొత్త గరిష్టానికి చేరుకుంది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.480.00లు వద్ద మొదలైంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే  ఈ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఇంట్రాడేలో 2.55శాతం వరకు పెరిగి రూ.490.95 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర షేరుకి జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఉదయం గం.9:50లకు షేరు క్రితం ముగింపు(రూ.478.70)తో పోలిస్తే 2.57 శాతం లాభంతో రూ.491.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధర వరుసగా రూ.310.30, రూ.491.20లుగా నమోదయ్యాయి. ఎంఎస్‌సీఐ తాజాగా తన ఇండియా ఇండెక్స్‌, ఇండియా స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ల రివ్యూను పూర్తి చేసింది. అందులో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ వెయిటేజీని పెంచింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌తో పాటు ఇన్ఫోఎడ్జ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కాల్గేట్‌, బర్గర్‌ పేయింట్స్‌ షేర్లను చేర్చింది. 
ఇక ఇదే సమయానికి ప్రధాన ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌ 63పాయింట్లను కోల్పోయి 40590.73 వద్ద, నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయి 11990.95 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

ఎంఎస్‌సీఐ సూచీలో కీలక మార్పులు

Friday 8th November 2019

ఈనెల 26 నుంచి అమలు ఎంఎస్‌సీఐ(మోర్గాన్‌స్టాన్లీ కాపిటల్‌  ఇంటర్నేషనల్‌) సూచీ అర్ధవార్షిక పునఃసమీక్ష జరిగింది. ఈ సమీక్షలో భాగంగా ఎంఎస్‌సీఐ ఇండియా సూచీతో పాటు మరికొన్ని సూచీలకి కొత్తగా కొన్ని షేర్లను కలపడం, ఉన్నవాటిలో కొన్నింటిని తీసివేయడం జరిగింది. ఈ మార్పులు నవంబర్‌ 26 నుంచి అమల్లోకి వస్తాయి(ఆరోజు మార్కెట్‌ ట్రేడింగ్‌ అనంతరం). తాజా సమీక్షలో 78 దేశీయ స్టాకులు మార్పులకు గురయ్యాయి.  భారతీయ షేర్లకు జరిగిన తాజా మార్పులు ఇలా ఉన్నాయి... = ఎంఎస్‌సీఐ

34 పైసలు నష్టపోయిన రూపీ

Friday 8th November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో శుక్రవారం సెషన్లో 34 పైసలు నష్టపోయి 71.30 వద్ద ప్రారంభమైం‍ది. కాగా యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు కానుందనే అంచనాలు బలపడడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. ఫలితంగా గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో, ప్రారంభ నష్టాలను పూడ్చుకొని 70.96 వద్ద ప్లాట్‌గా ముగిసింది. విదేశీ నిధుల ఇన్‌ఫ్లో స్థిరంగా కొనసాగడంతో కూడా రూపీ బలపడింది. కానీ చమురు ధరలు పెరగడంతో

Most from this category