News


ఐసీఐసీఐ బ్యాంక్‌ రికార్డు

Wednesday 26th June 2019
Markets_main1561531464.png-26578

ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ సం‍స్థ ఐసీఐసీఐ బ్యాంకు షేరు బుధవారం ఏడాది గరిష్టాన్ని తాకింది. నేడు ఈ షేరు బీఎస్‌లో రూ.432.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌రంగ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతులో భాగంగా ఈ షేరు 1.25శాతం లాభపడి రూ.438.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర .438.90 ఏడాది గరిష్టస్థాయి కావడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో రిటైల్‌ రుణాల పెరుగుదలను 20శాతం లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంకు ప్రకటించింది. అలాగే ఎప్లాయిస్ స్టాక్ ఆప్షన్ ప‌థ‌కంలో భాగంగా రూ.2లు ముఖవిలువ క‌లిగిన 3.40ల‌క్షల ఈక్విటీ షేర్లను బ్యాంకు ఉద్యోగుల‌కు జారీ చేస్తున్నట్లు బ్యాంకు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. మధ్యాహ్నం గం.12:00లకు షేరు గతముగింపు ధర(రూ.433.65)తో పోలిస్తే అరశాతం లాభంతో రూ.435.90ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.256.50  రూ.438.90లుగా నమోదయ్యాయి. 
సెన్సెక్స్‌ 70.5పాయింట్ల లాభంతో 39505.44 వద్ద, నిఫ్టీ 20.8 పాయింట్లు పెరిగి 11817.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

తగ్గింపునకు తొందరలేదు!

Wednesday 26th June 2019

వడ్డీరేట్లపై పావెల్‌ వ్యాఖ్య నీరసించిన మార్కెట్లు వడ్డీరేట్ల తగ్గింపు అంశంలో వేచిచూసే ధోరణి అవలంబిస్తామని యూఎస్‌ ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ తెలిపారు. యూఎస్‌ విదేశీ వ్యవహారాల కౌన్సిల్‌ ముందు పావెల్‌ ప్రసంగించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళనలు, ట్రేడ్‌వార్‌ తదితర అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. విధాన నిర్ణయాల్లో మార్పు తీసుకురావాలా? వద్దా? అనే విషయమై ఏడాది ఆరంభం నుంచి తాము ఓపిగ్గా వేచిచూసే ధోరణిలోనే ఉన్నామని చెప్పారు. ఎకనమిక్‌

12,000 డాలర్లు దాటిన బిట్‌కాయిన్‌

Wednesday 26th June 2019

తాజాగా ఫేస్‌బుక్‌ తన డిజిటల్‌ కరెన్సీ లిబ్రాను ఆవిష్కరించడంతో బిట్‌కాయిన్‌ ఈ ఏడాది గరిష్ఠాన్ని తాకింది. 2018 జనవరి తర్వాత మొదటిసారి బిట్‌కాయిన్‌ ధర 12,000 డాలర్లను దాటింది. ఈ ఏడాది ప్రారంభం​నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే బిట్‌కాయిన్‌ ధర 216 శాతం పెరిగింది. జనవరి 1న 3,843.52 డాలర్లుగా దీని ధర ఉండేది. కానీ 2017లో రికార్డు ధర 20,000 డాలర్లకు దిగువనే ఉండడం గమనార్హం.  ఇంకోవైపు ఇదే సమయంలో

Most from this category