News


ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫలితాల ప్రీవ్యూ..ఆల్‌టైం గరిష్ఠానికి షేరు!

Friday 25th October 2019
Markets_main1571980297.png-29133

  ఐసీఐసీఐ బ్యాంక్‌ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు ఇతర పోటి బ్యాంకుల కంటే బాగుంటాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ బ్యాంక్‌ రుణ వృద్ధి రెండింతలవుతుందని, ఆస్తి నాణ్యత ఆందోళనలు తగ్గనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ తైమాసిక ఫలితాలలో ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణ వృద్ధి ఏడాది ప్రాతిపదికన 14.2 శాతం పెరిగి రూ. 6.2 లక్షల కోట్లకు చేరుకుంటుం‍దని అంచనావేస్తున్నాం. ఫలితంగా బ్యాంక్‌ ఎన్‌ఐఎం(నికర వడ్డీ మార్జిన్‌) స్వల్పంగా పెరిగి 3.68 శాతానికి పెరగనుంది. అంతేకాకుండా బ్యాంక్‌ క్రెడిట్‌ వ్యయం 125 బేసిస్‌ పాయింట్లు తగ్గి 1.68 శాతానికి చేరుకుంటుంది’ అని ప్రభుదాస్‌ లిల్లాధర్‌ బ్రోకరేజి అంచనావేసింది. కాగా బ్యాంక్‌ రుణ పుస్తకం విలువ ఆర్థిక సంవత్సరం 2019 క్యూ2లో రూ. 5.44 లక్షల కోట్లుగా, ఆర్థిక సంవత్సరం 2020 క్యూ1లో రూ. 5.92 లక్షల కోట్లుగా నమోదైంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ త్రైమాసిక ఫలితాలు అక్టోబర్‌ 26న వెలువడనున్నాయి.
   ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫలితాలపై మార్కెట్‌ వర్గాల అంచనాలు బాగుండడంతో ఈ బ్యాంక్‌ షేరు విలువ శుక్రవారం సెషన్‌లో ఆల్‌టైం గరిష్ఠానికి చేరుకుంది. ఉదయం 10.29 సమయానికి 1.10 శాతం లాభపడి రూ. 459.75  వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 454.75 వద్ద ముగిసిన కంపెనీ షేరు విలువ, శుక్రవారం సెషన్‌లో రూ. 457.70 వద్ద ప్రారంభమై, రూ. 463.65 వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకింది.



You may be interested

ఎస్‌బీఐ ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Friday 25th October 2019

లాభంలో భారీ పెరుగుదల ఉంటుందని అంచనాలు దేశీయ అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ శుక్రవారం సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. ఈ దఫా బ్యాంకు నికరలాభం భారీగా పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎస్‌బీఐలైఫ్‌లో వాటాల విక్రయంతో బ్యాంకుకు వన్‌టైమ్‌ మొత్తం సమకూరడంతో లాభంలో బాగా వృద్ధి ఉండొచ్చని భావిస్తున్నారు. ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో దాదాపు 2.7 శాతం లాభంతో రూ. 268.80 వద్ద ట్రేడవుతోంది.  - ఎస్‌బీఐ

మరింత పెరిగిన క్రూడ్‌ ఆయిల్‌

Friday 25th October 2019

  యుఎస్‌ చమురు నిల్వలు పడిపోవడంతో పాటు, చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు (ఒపెక్‌), ఒపెక్‌ ప్లస్‌ దేశాలు చమురు ధరలను స్థీరికరించేందుకు మరిన్ని చర్యలు తీసుకోనున్నారనే అంచనాల నేపథ్యంలో బ్రెంట్‌ క్రూడ్‌ గురువారం ట్రేడింగ్‌లో 61 డాలర్ల స్థాయికి చేరుకుంది. దీంతో చమురు ధరలు ఈ వారంలో వరుసగా మూడవ సెషన్లో కూడా లాభపడినట్టయ్యింది. కాగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం, చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరగడం వంటి

Most from this category