News


ఐసీఐసీఐ క్యూ1 ఫలితాలు అదుర్స్‌!

Saturday 27th July 2019
Markets_main1564224274.png-27362

ఐసీఐసీఐ బ్యాంక్‌ జూన్‌ త్రైమాసికంలో రూ.1,908 కోట్ల నికర లాభాన్ని శనివారం ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 120 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. ఈ బ్యాంక్‌ లాభాలు రూ.1,350 కోట్లు-రూ.2,150 కోట్ల మధ్య ఉంటుందని విశ్లేషకులు అంచనా వేసిన విషయం తెలిసిందే. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 27 శాతం (ఏడాది నుంచి ఏడాదికి) పెరిగి రూ.7,737 కోట్లుగా నమోదయ్యింది. ఈ ఎన్‌ఐఐలో ఆదాయపు పన్ను వాపసుపై వచ్చిన వడ్డీ రూ.184 కోట్లు కూడా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ వడ్డీ రూ. 8 కోట్లుగా నమోదయ్యింది. ఎన్‌ఐఐ ఆదాయం బ్రోకరేజీ సంస్థల అంచనాల కంటే బాగుండడం గమనర్హం. 

    వడ్డీయేతర ఆదాయం (ట్రెజరీ ఆదాయాన్ని మినహాయించి)  రూ .3,247 కోట్లకు పెరిగిందని, ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 3,085 కోట్ల కంటే ఎక్కువని బ్యాంక్‌ పేర్కొంది. ఈ బ్యాంక్‌ కేటాయింపులు గత ఏడాది జూన్‌ త్రైమాసికంలో రూ.5,971 కోట్లుండగా ఇప్పుడు రూ.3,496 కోట్లకు తగ్గాయి. ఈ త్రైమాసికంలో స్థూలంగా రూ.2,779 కోట్లు ఎన్‌పీఏలకు కలిశాయి. నిరర్ధక రుణాల రికవరీలు, నవీకరణలు రూ. 931 కోట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో 6.70 శాతంగా ఉన్నస్థూల ఎన్‌పీఏలు ఈ త్రైమాసికం నాటికి 6.49 శాతానికి తగ్గాయి. గత ఏడాది జూన్‌ క్వార్టర్‌లో ఈ ఎన్‌పీఏలు 8.81 శాతంగా ఉండడం తెలిసిందే. నికర ఎన్‌పిఎలు కూడా మార్చి త్రైమాసికంలో 2.06 శాతం ఉండగా, ఈ త్రైమాసికంలో 1.77 శాతానికి తగ్గాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ ఎన్‌పీఏలు 4.19 శాతంగా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) 3.19 శాతం నుంచి 3.61 శాతానికి పెరిగింది.
   ఫీజు ఆదాయం 10 శాతం పెరిగి రూ. 3,039 కోట్లకు చేరుకుంది. రిటైల్ ఫీజు మొత్తం ఫీజులో 72 శాతం ఉందని బిఎస్ఇ ఫైలింగ్‌లో బ్యాంక్  తెలిపింది. ట్రెజరీ ఆదాయం రూ .179 కోట్లుగా ఉంది. గత  త్రైమాసికంలో ట్రెజరీ ఆదాయానికి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో వాటా అమ్మకపు ఆదాయం కలవడం వలన రూ .1,110 కోట్ల లాభం లభించింది.  కోర్ ఆపరేటింగ్ లాభం (అనుబంధ సంస్థల నుంచే వచ్చే డివిడెండ్ ఆదాయాన్ని మినహాయించి)  25 శాతం పెరిగి రూ .4,725 కోట్ల నుంచి రూ. 5,919 కోట్లకు చేరుకుంది. 



You may be interested

11,300పైన నిఫ్టీ ప్రారంభం...కొద్ది నిముషాల్లో నష్టాల్లోకి

Monday 29th July 2019

-ఐసీఐసీఐ బ్యాంక్‌ 4 శాతం జంప్‌ ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నా, సోమవారం భారత్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 160 పాయింట్ల లాభంతో 38,043 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,300పైన 23 పాయింట్ల లాభంతో 11,307 వద్ద ఆరంభమయ్యింది. అయితే ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది నిముషాల్లోనే సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. 9.35 గంటల సమయానికి నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 11,243 పాయింట్ల స్థాయికి పడిపోగా, సెన్సెక్స్‌

క్యూ1లో అంచనాలను అందుకోని హావెల్స్‌

Saturday 27th July 2019

ఎలక్ట్రిక్‌ పరికరాల తయారీ సంస్థ హావెల్స్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికపు ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ క్యూ1లో కంపెనీ రూ.177.09 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే క్యూ1లో నికర లాభం రూ.211.2 కోట్లుగా నమోదైంది. విశ్లేషకులు మాత్రం ఈ క్యూ1లో రూ.240 కోట్ల నికరలాభాన్ని అంచనా వేశారు. ఇదే క్వార్టర్‌ కాలానికి రూ.2,960 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా, 4.5శాతం స్వల్ప వృద్ధిని

Most from this category