News


ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం జూమ్‌

Saturday 25th January 2020
Markets_main1579948273.png-31207

క్యూ3లో 158 శాతం అప్‌
తగ్గిన ప్రొవిజన్లు, పెరిగిన ఇతర ఆదాయం
నీరసించిన మొండిబకాయిలు

ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నికర లాభం 158 శాతం దూసుకెళ్లి రూ. 4,146 కోట్లను తాకింది. ఇందుకు ప్రొవిజన్లు తగ్గడం, ఇతర ఆదాయం, రుణ నాణ్యత మెరుగుపడటం వంటి అంశాలు సహకరించాయి. గతేడాది(2018-19) క్యూ3లో రూ. 1605 కోట్ల లాభం మాత్రమే ఆర్జించింది. ఈ కాలంలో నికర వడ్డీ ఆదాయం సైతం 24 శాతం పెరిగి రూ. 8545 కోట్లకు చేరింది. 13 శాతం రుణ వృద్ధి సాధించగా.. నికర వడ్డీ మార్జిన్లు 0.37 శాతం బలపడ్డాయి. వెరసి 3.77 శాతంగా నమోదయ్యాయి. ఫీజు ఆదాయం 17 శాతం పుంజుకుని రూ. 3596 కోట్లను తాకగా.. ట్రెజరీ ఆదాయం 11 శాతం బలపడి రూ. 531 కోట్లయ్యింది.

తగ్గిన ఎన్‌పీఏలు 
త్రైమాసిక ప్రాతిపదికన క్యూ3లో ఐసీఐసీఐ బ్యాంక్‌ స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 0.42 శాతం తక్కువగా 5.95 శాతానికి చేరాయి. నికర ఎన్‌పీఏలు 0.11 శాతం వెనకడుగుతో 1.49 శాతంగా నమోదయ్యాయి. ప్రొవిజన్లు 17 శాతం క్షీణించి రూ. 2083 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది క్యూ3తో పోలిస్తే 51 శాతం తగ్గడం గమనార్హం! ఇతర ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 4574 కోట్లను తాకగా.. ప్రొవిజన్లకు ముందు నిర్వహణ లాభం 23 శాతం ఎగసి దాదాపు రూ. 7549 కోట్లకు చేరింది. బ్యాలన్స్‌షీట్‌ రూ. 10 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించింది. కాగా.. శుక్రవారం(24న) ఎన్‌ఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు 1.5 శాతం లాభపడి రూ. 535 వద్ద ముగిసింది. ఫలితాల ప్రభావం సోమవారం ట్రేడింగ్‌లో ఈ కౌంటర్‌పై కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.



You may be interested

5600 కోట్ల డాలర్ల దిగుమతులపై సుంకాల పెంపు?!

Saturday 25th January 2020

బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందంటున్న నిపుణులు చైనాతో పాటు ఇతర దేశాలకు చెందిన ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రిక్‌ గూడ్స్‌, కెమికల్స్‌, హస్తకళల రంగాల దాదాపు 50 రకాల ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు పెంచాలని భారత్‌ యోచిస్తోంది. చైనాతో పాటు మరికొన్ని దేశాలకు చెందిన దాదాపు 5600 కోట్ల డాలర్ల దిగుమతులపై సుంకాలు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన ఉండొచ్చని సమాచారం. తాజా సుంకాల

స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో అమెరికాను దాటేసిన ఇండియా

Saturday 25th January 2020

షియోమీ నంబర్‌ 1 వివో నంబర్‌ 2 భారత్‌లో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం రోజురోజుకీ పెరుగుతుండడంతో ..అమ్మకాలు భారీస్థాయిలో జరుగుతున్నాయి. దీంతో ఇండియా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌గా అవతరించింది. ఇప్పటిదాక చైనా, అమెరికాలు మొదటి రెండుస్థానాల్లో ఉండగా భారత్‌ అమెరికాను వెనక్కి నెట్టి రెండోస్థానంలో నిలిచింది. భారత మార్కెట్‌లో చైనా కంపెనీ ఫోన్ల హవా కొనసాగుతుండడమే ఇందుకు కారణమని మార్కెట్‌ మానిటర్‌ సర్వీస్‌ వెల్లడించింది. 2019 సంవత్సరంలో 7

Most from this category