News


లాభాల్లో ఐసీఐసీఐ బ్యాంకు షేరు

Monday 27th January 2020
Markets_main1580097207.png-31223

డిసెంబర్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు షేరు సోమవారం లాభాల్లో ఆరంభమైంది. గత ముగింపు రూ.533.85తో పోలిస్తే దాదాపు ఐదు రూపాయల లాభంతో రూ. 538.50 వద్ద షేరు ఆరంభమైంది. అనంతరం రూ. 543.70 వరకు ఎగిసి 9.20 నిమిషాల వద్ద దాదాపు 1.3 శాతం లాభంతో రూ. 540 వద్ద కదలాడింది. షేరు ప్రస్తుతం తన స్వల్పకాలిక డీఎంఏ స్థాయిలకు పైన ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈ టాప్‌గెయినర్స్‌లో ఐసీఐసీఐ బ్యాంకు షేరు అగ్రస్థానంలో ఉంది. బ్యాంకు ఏడాది గరిష్ఠ స్థాయి రూ. 552.20. క్యు3లో బ్యాంకు నికర లాభం రూ. 4146.5 కోట్లుగా నమోదు చేసింది. ఇదే సమయంలో ఎన్‌ఐఐ రూ. 8549.3 కోట్లకు దూసుకుపోయింది. ఎస్సార్‌స్టీల్‌, రుచిసోయా బకాయిల వసూళ్లు ఫలితాలపై పాజిటివ్‌ ‍ప్రభావం చూపాయని నిపుణులు భావిస్తున్నారు. 



You may be interested

12200 దిగువన ప్రారంభమైన నిఫ్టీ

Monday 27th January 2020

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 102.51 పాయింట్ల నష్టంతో 41,510.68 వద్ద, నిఫ్టీ 12200 దిగువన 51పాయింట్ల నష్టంతో 12,197.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.  కరోనా వైరస్ వ్యాప్తి చైనా ఆర్థిక వ్యవస్థను, ప్రపంచ వృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తుందనే ఆందోళనలతో పాటు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న అమెరికా రిజర్వ్‌ బ్యాంకు సమావేశాల నేపథ్యంలో అప్రమత్తతతో అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన

పసిడి మెరుపు- చమురు డీలా

Monday 27th January 2020

కరోనా వైరస్‌ భయాలు బలపడిన జపనీన్‌ యెన్‌ ట్రెజరీలకు డిమాండ్‌- బాండ్ల ఈల్డ్స్‌ డౌన్‌ చైనాలో తలెత్తిన కరోనా వైరస్‌ దెబ్బకు మరోసారి ముడిచమురు ధరలు డీలాపడగా.. పసిడికి డిమాండ్‌ పెరిగింది. మరోపక్క రక్షణాత్మక పెట్టుబడిగా భావించే జపనీస్‌ కరెన్సీ యెన్‌ బలపడింది. ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతున్న కరోనా వైరస్‌ ఇతర దేశాలకూ పాకుతున్న వార్తలతో నేడు(సోమవారం) ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు పతనంకానున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఫ్యూచర్స్‌ మార్కెట్‌ ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేశారు.

Most from this category