News


ఐసీఐసీఐ బ్యాంక్‌ కొత్త రికార్డు

Thursday 26th September 2019
news_main1569477186.png-28564

ప్రైవేట్ రంగ బ్యాంక్‌ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతులో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు గురువారం ఉదయం ట్రేడింగ్‌లో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో నేడు ఈ బ్యాంక్‌ షేర్లు రూ.439.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ఒక దశలో 5.50శాతం లాభపడి రూ.458.65 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ ధర షేర్లకు జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఉదయం గం.11:00లకు షేరు క్రితం ముగింపు(రూ.434.20)తో పోలిస్తే 3.50శాతం లాభంతో రూ.450.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి నిఫ్టీ-50 ఇండెక్స్‌లోని టాప్‌-5 గెయినర్లలో మొదటిస్థానంలో ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది, కనిష్ట గరిష్ట ధరలు రూ.294.80లు, రూ.458.65లుగా నమోదయ్యాయి. 



You may be interested

ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Thursday 26th September 2019

లాభాల మార్కెట్లో ఆటో రంగ షేర్ల లాభాల బాట పట్టాయి. వరుసగా రెండురోజుల పాటు నష్టాల్లో ట్రేడైన అటో షేర్లకు నేటి ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 2.50శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా టీవీఎస్‌ మోటర్స్‌ షేర్లు 4శాతం లాభపడ్డాయి. ఎంఅండ్‌ఎం, అశోక్‌ లేలాండ్‌, భారత్‌ పోర్జ్స్‌ షేర్లు 3.50శాతం పెరిగాయి. మారుతి 2.50శాతం,

స్వల్ప లాభాల్లో చమురు !

Thursday 26th September 2019

యుఎస్‌-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య విభేదాలను తొలగించేందుకు ఒక రిజల్యూషన్‌ అనుకున్న సమయం కంటే ముందే రానుందని యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో​ గురువారం ట్రేడింగ్‌లో చమురు ధరలు ప్లాట్‌గా ప్రారంభమయ్యాయి. పెరుగుతున్న చమురు సరఫరా ఒత్తిళ్లను, అంతర్జాతీయంగా చమురు డిమాండ్‌ ఆందోళనలను తగ్గించడానికి ఈ చర్య సహాయపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గురువారం ఉదయం 9.45 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.05 శాతం లాభపడి బారెల్‌ 61.46 డాలర్ల

Most from this category