News


ఆల్‌టైం గరిష్ఠానికి ఐసీఐసీఐ బ్యాంక్‌

Monday 23rd September 2019
Markets_main1569216870.png-28490

కేంద్ర ప్రభుత్వం, దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు భారీస్థాయిలో లాభపడి ట్రేడవుతున్నాయి. ఈ చర్య వలన బ్యాంకింగ్‌ సెక్టార్‌ షేర్లు గత సెషన్‌ నుంచి పాజిటివ్‌గా కదులుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ సోమవారం ట్రేడింగ్‌లో 30,000 మార్కును అధిగిమించడం గమనార్హం. పాజిటివ్‌ మార్కెట్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకింది. ఈ బ్యాంక్‌ షేరు సోమవారం ఉదయం 10.58 సమయానికి  6.91 శాతం లాభపడి రూ. 446.35 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 417.50 వద్ద ముగిసిన ఈ షేరు సోమవారం ట్రేడింగ్‌లో రూ. 435.80 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది. ఈ షేరు రూ. 447.00 వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని చేరుకోవడం గమనార్హం.



You may be interested

లాభాల మార్కెట్లో ఐటీ షేర్ల డీలా..!

Monday 23rd September 2019

రూపాయి బలపడటంతో లాభాల మార్కెట్లో ఐటీ షేర్లు తీవ్ర నష్టాలను ఎదుర్కోంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిప్టీ ఐటీ ఇండెక్స్‌ సోమవారం ఉదయం సెషన్‌లో దాదాపు 5శాతం నష్టపోయింది. నేడు నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 15,611.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ నష్టంతో ప్రారంభమైనప్పటికీ.., తిరిగి లాభాల్లోకి మళ్లింది. ఫలితంగా డాలర్ల రూపాయి ఆదాయాలను ఆర్జించే ఐటీ కంపెనీల షేర్లు షేర్లు తీవ్ర

బలగాలను మోహరించిన యుఎస్‌..పెరిగిన చమురు

Monday 23rd September 2019

సౌదీ నుంచి చమురు సరఫరాకు అంతరాయం కలగడంతోపాటు, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త వాతవరణం వలన చమురు ధరలు సోమవారం పెరిగాయి. ఉదయం 9.39 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 1.03 శాతం లాభపడి బ్యారెల్‌ 63.85 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 1.02 శాతం లాభపడి బ్యారెల్‌ 58.68 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.     డ్రోన్‌ దాడి జరిగడంతో సౌదీ చమురు కేంద్రాల నుంచి క్రూడ్‌ ఉత్పత్తి సగానికి పైగా తగ్గింది. ఈ

Most from this category