News


కొత్త ఆల్‌టైం హైకి ఐసీఐసీఐ బ్యాంక్‌

Wednesday 4th December 2019
Markets_main1575440729.png-30048

ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు బుధవారం ఉదయం సెషన్‌లో కొత్త జీవికాల గరిష్టాన్ని నమోదు చేసింది. బ్రోకరేజ్‌ సంస్థలు షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను పొడిగించడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.510.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. భవిష్యత్తులో బలమైన ఆదాయాలను ఆర్జించవచ్చనే అంచనాలతో పలు బ్రోకరేజ్‌ సంస్థలు ఈ షేరుపై గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను మరో 12నెలల పాటు కొనసాగిస్తున్నట్లు మంగళవారం బ్రోకరేజ్‌ సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా ఇంట్రాడేలో షేరు కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు 3.08శాతం వరకు లాభపడి రూ.524.70 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. ఇంతకు ముందు నవంబర్‌ 28వ తేదిన షేరు రూ.520 వద్ద ఆల్‌టైం హైని నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఉదయం గం.11:30ని.లకు షేరు కిత్రం ముగింపు(రూ.509.00)తో పోలిస్తే 2.50శాతం లాభంతో రూ.522.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.335.90, రూ.524.70లుగా నమోదయ్యాయి. 
నేటి ట్రేడింగ్‌లో బ్యాంక్‌ షేరు చేసిన 3శాతం ర్యాలీతో ఐసీఐసీఐ బ్యాంక్‌ 3నెలల్లో 32శాతం లాభపడింది. 

బ్రోకరేజ్‌ సంస్థల రేటింగ్‌ అప్‌గ్రేడ్‌
అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ యూబీఎస్‌ షేరుకు గతంలో కేటాయించిన రూ.570ల కొనుగోలు టార్గెట్‌ ధరను రూ.620లకు పెంచింది. మరో బ్రోకరేజ్‌ సంస్థ నోమురా షేరు టార్గెట్‌ ధరను రూ.610 నుంచి రూ.645లకు పెంచింది. మోతీలాల్‌ ఓస్వాల్‌ సైతం షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది.  టెక్నాలజీలో నిరంతర పెట్టుబడి కారణంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ స్థిరమైన వృద్ధిని సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  గత కొన్నేళ్లుగా బ్యాంక్ రిటైల్ విభాగంలో బలమైన వృద్ధిని కనబరుస్తుందని బ్రోకరేజ్‌ సంస్థ తన నివేదికలో పేర్కోంది.  
 



You may be interested

సీబీఎస్‌ బ్యాంక్‌ లిస్టింగ్‌ సూపర్‌ సక్సెస్‌

Wednesday 4th December 2019

గతవారం ఐపీఓ ఇష్యూను పూర్తి చేసుకున్న కేథలిక్‌ సిరియన్‌ బ్యాంక్‌(సీఎస్‌బీ) నేడు ఎక్చ్సేంజీల్లో భారీ లాభంతో లిస్ట్‌ అయ్యింది. ఇష్యూ ధర రూ.195తో పోలిస్తే 41శాతం లాభంతో రూ.275ల వద్ద లిస్టైంది. ఒకానొక దశలో ఇష్యూ ధర(రూ.195) కంటే 57శాతం వరకు పెరిగి రూ.307 స్థాయిని అందుకుంది. మధ్యాహ్నం గం. 12:00లకు ఇష్యూ ధరతో పోలిస్తే 53.50శాతం లాభంతో రూ.300 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఐపీఓ 22న ప్రారంభమై

ఆల్ఫాబెట్‌ సీఈఓగా సుందర్‌ పిచాయ్‌!

Wednesday 4th December 2019

గూగుల్‌ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుందర్‌ పిచాయ్‌, త్వరలో గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆల్ఫాబెట్‌ నాయకత్వ సీటు నుంచి తప్పుకుంటామని గూగుల్‌ వ్యవస్థాపకులు లారీపేజ్‌, సెర్గీబ్రిన్‌ ప్రకటించారు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు వారు లేఖ రాశారు. గూగుల్‌తో పాటు ఆల్ఫాబెట్‌కు చెందిన ఇతర సంస్థలు మంచి ప్రదర్శన చూపుతున్నాయన్నారు. ఇకపై తాము మేనేజ్‌మెంట్‌ బాధ్యతలను అట్టిపెట్టుకొని వేలాడాలనుకోవడం లేదన్నారు. ఇకపై గూగుల్‌, ఆల్ఫాబెట్‌కు ఇద్దరు

Most from this category