News


రూ. 500 పైకి ఐసీఐసీఐ బ్యాంక్‌

Friday 15th November 2019
Markets_main1573792481.png-29612

కార్పోరేట్‌ పన్ను రేటును ప్రభుత్వం తగ్గించిన తర్వాత నుంచి దేశీయ ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేయడం ప్రారంభించాయి. దీనికితోడు సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్‌ వర్గాల అంచనాలకు అనుగుణంగా ఉండడంతో ఈక్విటీ మార్కెట్లు కొత్త గరిష్ఠాలను తాకుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ జీవిత కాల గరిష్ఠానికి చేరువలో ఉంది. ఈ ఇండెక్స్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎప్పటికప్పుడు కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తు కదులుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు శుక్రవారం సెషన్‌లో కూడా కొత్త గరిష్ఠాన్ని ఏర్పరిచింది. ఈ షేరు, చరిత్రలో మొదటి సారిగా రూ. 500 స్థాయి పైకి చేరుకుంది. గత సెషన్‌లో రూ. 498.65 ముగిసిన ఈ బ్యాంక్‌ షేరు, శుక్రవారం సెషన్‌లో రూ. 497.85 వద్ద ప్రారంభమైంది. సెషన్‌ ప్రారంభమైన కొద్ది సమయానికే రూ. 504.40 వద్ద జీవిత కాల గరిష్ఠాన్ని తాకింది. ఉదయం 9.59 సమయానికి ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు 0.94 శాతం లాభపడి రూ. 503.35 వద్ద ట్రేడవుతోంది.    



You may be interested

వొడాఫోన్‌ ఐడియా బాండ్స్‌తో ఎంఎఫ్‌లకు చిక్కులు!?

Friday 15th November 2019

వెన్నాడుతున్న డౌన్‌గ్రేడ్‌ భయాలు వొడాఫోన్‌ ఐడియా గతంలో జారీ చేసిన బాండ్స్‌ కొనుగోలు చేసిన డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్నాయి. కంపెనీ విత్త పరిస్థితి బాగా దెబ్బతినడం, సాయం అందించేందుకు మాతృసంస్థలు విముఖత చూపడం తదితర కారణాలతో అసలు కంపెనీ మనుగడపైనే నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రభుత్వ సాయం అందకపోతే కంపెనీ దివాలాకు సిద్ధమన్నట్లుగా ఉంది. దీంతో ఈ కంపెనీ సెక్యూరిటీలు హోల్డ్‌ చేస్తున్న ఎంఎఫ్‌లు ఎటూపాలు పోని

31000 పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Friday 15th November 2019

మార్కెట్‌ ప్రారంభంలోనే బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 31000 స్థాయి పైకి ఎగిసింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 30,912.40 పాయింట్ల ప్రారంభమైంది. అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ క్రితం ముగింపు(30749.95)తో పోలిస్తే ఒకశాతానికి పైగా లాభపడి 31010.15 వద్ద ఇంట్రాడే

Most from this category