News


ఇకపై ఐసీఐసీఐ, యాక్సిస్‌ దూకుడు

Saturday 4th January 2020
Markets_main1578115940.png-30670

ప్రయివేట్‌ రంగ బ్యాంకులకు రీరేటింగ్‌
విదేశీ బ్రోకింగ్‌ సంస్థ నోమురా అంచనా

ప్రయివేట్‌ రంగ కార్పొరేట్‌ బ్యాంకులకు ఇకపై మరింత రీరేటింగ్‌ లభించనున్నట్లు గ్లోబల్‌ బ్రోకింగ్‌ కంపెనీ నోమురా తాజాగా అభిప్రాయపడింది. దీనిలో భాగంగా ఫైనాన్షియల్‌ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ కౌంటర్లకు భవిష్యత్‌లో డిమాండ్‌ పెరగనున్నట్లు అంచనా వేసింది. ఇతర వివరాలు చూద్దాం..

టార్గెట్‌ ధరల పెంపు
ఇటీవల యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ కౌంటర్లు ర్యాలీ చేసినప్పటికీ ఇకపై మరింత దూకుడు చూపే వీలుంది. ప్రయివేట్‌ రంగ కార్పొరేట్‌ బ్యాంకుల్లో ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. గత ఏడాది కాలంగా ఈ కౌంటర్లు భారీ ర్యాలీ చేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ 48 శాతం పురోగమించగా.. యాక్సిస్‌ బ్యాంక్‌ 22 శాతం లాభపడింది. వారాంతాన ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు రూ. 539 వద్ద స్థిరపడగా.. యాక్సిస్‌ రూ. 743 వద్ద ముగిసింది. అయినప్పటికీ ఈ రెండు కౌంటర్లకూ గతంలో ఇచ్చిన టార్గెట్‌ ధరలను సవరిస్తూ కొనుగోలుకి సిఫారసు చేస్తున్నాం. ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరుని రూ. 700 టార్గెట్‌తోనూ, యాక్సిస్‌ బ్యాంక్‌ను రూ. 1050 లక్ష్యంతోనూ కొనుగోలు చేయవచ్చు.

వృద్ధిపై అంచనాలు
కార్పొరేట్‌ మొండి బకాయిల(ఎన్‌పీఏలు)కు ప్రొవిజనింగ్‌ సైకిల్‌ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఏడాది కాలంగా ప్రయివేట్‌ రంగ బ్యాంకులు ఐసీఐసీఐ, యాక్సిస్‌లు కొంతవరకూ  రీరేటింగ్‌ను సాధించాయి. దీంతో కొద్ది నెలలుగా ర్యాలీ చేస్తున్నాయి. ఈ బ్యాంకుల ఆదాయం, బ్యాలన్స్‌ షీట్‌ మెరుగుపడటాన్ని ఇన్వెస్టర్లు గుర్తిస్తున్నారు. తద్వారా ప్రీప్రొవిజనింగ్‌ నిర్వహణలో వృద్ధి కొనసాగనున్న అంచనాలు బలపడుతున్నాయి. ఇక రిటైల్‌ విభాగంలో ఈ రెండు కార్పొరేట్‌ బ్యాంకుల రుణ వ్యయాలు రిటైల్‌ బ్యాంకులతోపోలిస్తే చాలా తక్కువగానే నమోదవుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో పోలిస్తే ఐసీఐసీఐ, యాక్సిస్‌ రుణ వ్యయాలు తక్కువ స్థాయిల వద్ద నిలకడను పొందే అవకాశముంది. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణ నాణ్యత మెరుగుపడింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 8.54 శాతం నుంచి 6.37 శాతానికి తగ్గాయి. ఇక ఇదే కాలంలో యాక్సిస్‌ బ్యాంక్‌ స్థూల ఎన్‌పీఏలు 5.25 శాతం నుంచి 5.03 శాతానికి నీరసించాయి. నికర ఎన్‌పీఏలు సైతం 2.04 శాతం నుంచి 1.99 శాతానికి వెనకడుగు వేశాయి.
 



You may be interested

మధ్యప్రాచ్య ఘటనలు.. మనకెంత ప్రమాదకరం?

Saturday 4th January 2020

ముడిచమురు ధర పెరుగుదలతో పొంచిఉన్న విత్తలోటు ముప్పు ఇరాన్‌ జనరల్‌ను అమెరికా డ్రోన్‌ సాయంతో హత్య చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. శుక్రవారం ముడిచమురు ధరలు ఒక్కమారుగా దూసుకుపోయాయి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు అటుతిరిగి ఇటుతిరిగి మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు భారత్‌కు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. దాదాపు 80 శాతం మేర ముడిచమురు దిగుమతులపై ఆధారపడిన ఇండియాకు తాజా సంఘటనలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇరాన్‌ సంక్షోభం క్రమంగా ముడిచమురు ధరకు రెక్కలు

నిఫ్టీలో బేరిష్‌ క్యాండిల్‌!

Saturday 4th January 2020

ఇరాన్‌ సంఘటనలతో దేశీయ మార్కెట్లు శుక్రవారం బేర్స్‌ పట్టులోకి జారాయి. చమురు ధర ఒక్కమారుగా పెరగడంతో దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. నిఫ్టీ 12250 పాయింట్ల దిగువకు వచ్చింది. ఇంట్రాడేలో నిఫ్టీ బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పరిచింది. ఒకదశలో నిఫ్టీ కీలక 12191 పాయింట్ల వరకు దిగజారింది. చివర్లో కొనుగోళ్ల మద్దతుతో కాస్త కోలుకుంది. అయితే తాజా క్యాండిల్‌ ఏర్పడడం తప్ప చార్టుల్లో ఎలాంటి ఫార్మేషన్లు ఏర్పడలేదని, సంఘటన వార్తల

Most from this category