News


ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లకు రేటింగ్‌ షాక్‌

Tuesday 4th June 2019
Markets_main1559633247.png-26089

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంకు షేర్లకు ఫిచ్‌ రేటింగ్‌ షాక్‌ నిచ్చింది. అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకుల రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు సోమవారం తెలిపింది. ఈ రెండు బ్యాంకులకు చెందిన ధీర్ఘకాలిక ఇష్యూయర్‌ డిఫాల్ట్‌ రేటింగ్‌(ఐడీఆర్‌)ను బిబిబి(-) నుంచి బిబి(+)కి, అలాగే వైయబిలిటీ రేటింగ్‌ బిబిబి(-) నుంచి బిబి(+) తగ్గిస్తున్నట్లు తెలిపింది. పిచ్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ నేపథ్యంలో నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఐసీఐసీఐ బ్యాంక్‌ 2శాతం నష్టపోగా, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు 1 శాతం వరకు నష్టపోయాయి. మధ్యాహ్నం గం.12:25ని.లకు ఐసీఐసీఐ బ్యాంకు 1శాతం నష్టంతో రూ.418.95ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు రివకరి అయ్యి 0.35శాతం స్వల్ప లాభంతో రూ.815.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
ఇదే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 96.27 పాయింట్ల నష్టంతో 40,171.35 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు క్షీణించి 12,048ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

 



You may be interested

భారీగా క్షీణించిన గూగుల్‌ మాతృసంస్థ షేరు

Tuesday 4th June 2019

ఆల్ఫాబెట్‌ 6 శాతం పతనం! సోమవారం ట్రేడింగ్‌లో గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ షేరు దాదాపు 6 శాతం నష్టంతో ముగిసింది. పోటీ ప్రమాణాల ఉల్లంఘనకు సంబంధించి గూగుల్‌పై యూఎస్‌ న్యాయ శాఖ విచారణ ఆరంభించవచ్చన్న ఊహాగానాలు షేరును దెబ్బతీశాయి. తాజా పతనంతో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 5400 కోట్ల డాలర్ల మేర క్షీణించింది. 2011 తర్వాత కంపెనీ షేరు ఇంతలా పతనం కావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో ఫేస్‌బుక్‌ 7.5

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌ సిఫార్సులు

Tuesday 4th June 2019

వచ్చే నెల రోజుల సమయంలో దాదాపు 10 శాతం వరకు రాబడిని అందించే మూడు స్టాకులను హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రికమండ్‌ చేస్తోంది. 1. గోద్రేజ్‌ కన్జూమర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 750. స్టాప్‌లాస్‌ రూ. 680. కొద్దికాలం క్రితం రూ.630 వద్ద బహుళస్థాయి మద్దతు పొందిన అనంతరం మార్చిలో అప్‌మూవ్‌ చూపింది. ప్రస్తుతం డైలీ చార్టుల్లో హైవాల్యూంలతో కూడిన బ్రేకవుట్‌ నమోదు చేసింది. ఎఫ్‌ఎంసీజీ రంగం సైతం బాటమవుట్‌ చెంది ర్యాలీకి

Most from this category