News


సోమవారం ఐసీఐసీఐ 10 శాతం గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌?

Saturday 21st March 2020
Markets_main1584767646.png-32615

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 560 పాయింట్లు డౌన్‌
శుక్రవారం అమెరికా మార్కెట్లు డీలా

 

సోమవారం(23న) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి నష్టాలతో ప్రారంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఏకంగా 560 పాయింట్ల క్షీణతను సూచిస్తోంది. 8,178 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన ఎన్‌ఎస్‌ఈలో మార్చి ఫ్యూచర్స్‌ 8,738 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కాగా.. శుక్రవారం యూఎస్‌ మార్కెట్లలో మరోసారి అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. దీంతో డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ 4 శాతం స్థాయిలో పతనమయ్యాయి. వెరసి గత వారం యూఎస్‌ ఇండెక్సులు ఏకంగా 15-17 శాతం స్థాయిలో పడిపోయాయి. అయితే దేశీయంగా శుక్రవారం మార్కెట్లు అనూహ్య ర్యాలీ చేశాయి. సెన్సెక్స్‌ 1628 పాయింట్లు దూసుకెళ్లి 29,916 వద్ద నిలవగా.. నిఫ్టీ 482 పాయింట్లు జంప్‌చేసి 8,745 వద్ద ముగిసింది. సోమవారం ఉదయానికల్లా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీలో సంభవించే మార్పులు మార్కెట్ల ప్రారంభాన్ని సూచించే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 

వేదాంతా పతనం
అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్‌ (ఏడీఆర్‌) వారాంతాన అత్యధిక శాతం నష్టాల బాటలో సాగాయి. వేదాంతా(వీఈడీఎల్‌) 8.5 శాతం పడిపోయి 3.65 డాలర్లను తాకగా.. ఇన్ఫోసిస్‌ 2.7 శాతం బలహీనపడి 6.94 డాలర్ల వద్ద నిలిచింది. ఇక టాటా మోటార్స్‌(టీటీఎం) 1.25 శాతం నష్టంతో 4.72 డాలర్ల వద్ద స్థిరపడగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌(ఐబీఎన్‌) 0.1 శాతం బలపడి 8 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర కౌంటర్లలో విప్రో లిమిటెడ్‌(విట్‌) 3.5 శాతం ఎగసి 2.66 డాలర్లకు చేరగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(హెచ్‌డీబీ) 1.55 శాతం క్షీణించి 35.78 డాలర్ల వద్ద ముగిసింది. ఇక డాక్టర్‌ రెడ్డీస్‌(ఆర్‌డీవై) 3.86 శాతం లాభపడి 36.86 డాలర్ల వద్ద  స్థిరపడింది. 

మదింపు ఇలా
శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు రూ. 344 వద్ద ముగిసింది. కాగా.. ఒక అమెరికన్‌ ఏడీఆర్‌ రెండు షేర్లకు సమానం. ఏడీఆర్‌ 8 డాలర్ల వద్ద స్థిరపడింది. డాలరుతో మారకంలో రూపాయి ఆఫ్‌షోర్‌లో 75.4 వద్ద ముగిసింది. అంటే సగటున రూ. 600 ధరగా చెప్పవచ్చు. దీంతో సోమవారం ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ. 310 సమీపంలో ప్రారంభంకావచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే విధంగా టాటా మోటార్స్‌(ఏడీఆర్‌ 5 షేర్లకు సమానం), వేదాంతా(4 షేర్లు), ఇన్ఫోసిస్‌(1 షేరు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(3 షేర్లు)పై వేసిన అంచనాలు ఇలా ఉన్నాయి. టాటా మోటార్స్‌ రూ. 70 సమీపంలో ట్రేడ్‌కావచ్చు. ఎన్‌ఎస్‌ఈలో టాటా మోటార్స్‌ షేరు రూ. 78 వద్ద ముగిసింది.

శుక్రవారం ఇలా
ఎన్‌ఎస్‌ఈలో శుక్రవారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ. 881 వద్ద స్థిరపడింది. ఏడీఆర్‌ ప్రకారం సోమవారం దాదాపు ఇదే స్థాయిలో ట్రేడ్‌ కావచ్చునని నిపుణుల అంచనా. ఇదే విధంగా వేదాంతా రూ. 76 వద్ద ముగిసింది. రూ. 68 సమీపంలో ప్రారంభంకావచ్చు. ఇక ఇన్ఫోసిస్‌ రూ. 581 వద్ద స్థిరపడింది. సోమవారం రూ. 530 స్థాయిలో కదలవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.
 



You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి

Saturday 21st March 2020

కరోనా మహమ్మారీ  వివిధ దేశాల్లో వేగంగా విస్తరిస్తుండడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడుల వైపు దృష్టిపెట్టడం, డాలర్‌ మారకంతో రూపాయి వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా చరిత్రాత్మక కనిష్టానికి చేరడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ఒక దశలో రూ.1,395 గరిష్టానికి చేరి, రూ.40,358 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే 22డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం

నిలిచిపోయిన వోల్వో కార్స్‌ ఉత్పత్తి

Saturday 21st March 2020

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘వోల్వో’ అంతర్జాతీయంగా పలు ప్రాంతాల్లో తన ఉత్పత్తిని ఆపివేసింది. కోవిడ్‌-19 (కరోనా) వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా యూరప్‌, అమెరికాల్లోని ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు శుక్రవారం ప్రకటించింది. బెల్జియం ప్లాంట్‌లో మంగళవారమే ఉత్పత్తిని నిలుపుచేయగా, స్వీడన్‌లోని మూడు ప్లాంట్లలోనూ.. అమెరికాలోని దక్షిణ కెరొలినలోని ప్లాంట్లలో మార్చి 26 నుంచి ఉత్పత్తి ఆపివేస్తున్నట్లు వివరించింది. ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడి, సంస్థ కొనసాగడం కోసం

Most from this category