News


ఐబీ రియల్టీ జోరు- సన్‌ టీవీ డీలా

Thursday 2nd January 2020
Markets_main1577940501.png-30609

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వీక్‌

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి వీలుగా ఈ నెల 15కల్లా ప్రాథమిక దశ ఒప్పందం కుదరనున్న వార్తలు ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పైనా అంచనాలు పెరుగుతున్నట్లు తెలియజేశారు. దీంతో ఉదయం 10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 107 పాయింట్లు ఎగసి 41,413కు చేరగా..నిఫ్టీ 32 పాయింట్లు బలపడి 12,215 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న ఇండియాబుల్స్‌ రియల్టీ కౌంటర్‌ మరోసారి వెలుగులోకిరాగా.. ట్రాయ్‌ నిబంధనల తాజా సవరణలతో సన్‌ టీవీ నెట్‌వర్క్‌ తదితర మీడియా షేర్లు డీలాపడ్డాయి. వివరాలు చూద్దాం...

ఇండియాబుల్స్‌ రియల్టీ
వరుసగా మూడో రోజు ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 7.5 శాతం జంప్‌చేసి రూ. 77 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 79 వరకూ ఎగసింది. గత 20 రోజుల సగటు పరిమాణంతో పోలిస్తే ఈ కౌంటర్లో ఉదయం తొలి అర్ధగంటలోనే 12 రెట్లు అధికంగా ట్రేడింగ్‌ జరిగినట్లు మార్కెట్‌ వర్గాలు తెలియజేశాయి. గత ఐదు రోజుల్లో ఈ షేరు సుమారు 30 శాతం ర్యాలీ చేయడం విశేషం!

సన్‌ టీవీ, జీ
టెలికం నియం‍త్రణల ప్రాధికార సంస్థ(ట్రాయ్‌) తాజాగా కేబుల్‌ టీవీ టారిఫ్‌లను సవరించింది. పే చానళ్ల ధరలను తగ్గించడంతోపాటు.. రూ. 153 కనీస ధరపై 200 ఫ్రీ చానళ్లను ప్రసారం చేయవలసిందిగా నిబంధనలను సవరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బ్రాడ్‌క్యాస్టింగ్‌ సంస్థల పే చానళ్ల సంఖ్యపైనా పరిమితి విధించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో సన్‌ టీవీసహా కొన్ని మీడియా కౌంటర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో సన్‌ టీవీ షేరు దాదాపు 4 శాతం పతనమై రూ. 423 దిగువన ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 410 వద్ద కనిష్టాన్ని తాకింది. ఇక జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు సైతం 2 శాతం క్షీణించి రూ. 283 వద్ద కదులుతోంది. తొలుత రూ. 279 వరకూ వెనకడుగు వేసింది.You may be interested

టీవీ చానెల్స్‌ ఇకపై మరింత చౌక!

Thursday 2nd January 2020

నిబంధనలు సవరించిన ట్రాయ్‌ కస్టమర్ల ప్రయోజనాలు కాపాడే దిశగా ట్రాయ్‌ కేబుల్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ నిబంధనలకు కొత్త సవరణలు చేసింది. దీంతో ఇకపై కస్టమర్లు మరింత తక్కువ చందాకు మరిన్ని ఎక్కువ ఛానెళ్లు వీక్షించడం కుదురుతుంది. తాజా సవరణలో భాగంగా అన్ని ఫ్రీ చానెళ్లకు వసూలు చేసే ఫీజును ట్రాయ్‌ రూ. 140కి పరిమితం చేసింది. ఒక ఇంట్లో ఒకటి కన్నా ఎక్కువ టీవీలుంటే వాటికి నెట్‌వర్క్‌ కెపాసిటీ ఫీజు(ఎన్‌సీఎఫ్‌)లో 40 శాతం

స్థిరంగా పసిడి

Thursday 2nd January 2020

అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చ ఒప్పం‍దం పురోగతి దిశగా సాగుతున్న నేపథ్యంలో డాలర్‌ బలహీనత కారణంగా గురువారం పసిడి ఫ్యూచర్ల ధర స్థిరంగా కదులుతోంది. ఆసియా ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప లాభంతో 1,524డాలరు వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య తొలిదశ వాణిజ్య చర్చలు కుదిరి అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అవుట్‌లుక్‌ను మరింత మెరుగుపరచవచ్చనే అంచనాలతో ఈ ఏడాది

Most from this category