News


‘నాణ్యమైన స్టాక్స్‌ ర్యాలీ ఇప్పట్లో ముగియకపోవచ్చు’

Monday 23rd December 2019
Markets_main1577039650.png-30359

జీడీపీ వృద్ధి 4.5 శాతం స్థాయిలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు తప్పకుండా పెట్టబడులు పెట్టాలని సూచించారు క్రెడిట్‌సూసే ఆసియా పసిఫిక్‌ ప్రాంత ఈక్విటీస్ట్రాటజీ కోహెడ్‌ నీలకాంత్‌మిశ్రా. భారత ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ ఇకముందూ కొనసాగుతుందన్నారు. ఇందుకు ఎన్నో కారణాలున్నాయని, దేశీయ పెట్టుబడుల రాక గత 12 నెలల కాలంలో 20 బిలియన్‌ డాలర్లుగా ఉందని, ఇది ఇక ముందూ కొనసాగుతుందని అంచనా వేశారు. ఇప్పటి నుంచి పెట్టుబడుల రాక కొంత తగ్గొచ్చేమో కానీ, మార్కెట్లకు మద్దతుగా నిలవడానికి అవి సరిపోతాయన్నారు. 

 

‘‘అంతర్జాతీయంగా రిస్క్‌ పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లు చౌకగా లేవు. కనుక భారత మార్కెట్ల పీఈ అంతర్జాతీయ మార్కెట్లతో పోల్చి చూస్తే ఖరీదుగా ఏమీ లేదు. మార్కెట్ల వ్యాల్యూషన్‌ అధికంగా ఉందని నేను భావించడం లేదు. ఈపీఎస్‌ను పరిశీలించినా 2020-21 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం 28 శాతం స్థాయిలో ఉంటుంది. 2022 ఫార్వార్డ్‌ ఈపీఎస్‌ ప్రకారం 12-14 శాతం స్థాయిలో స్థిరపడుతుంది. కనుక వచ్చే ఏడాది చివరికి 2021-22 అంచనాలను పరిగణనలోకి తీసుకుంటాం. పెద్ద సైజు లిక్విడిటీ ఉ‍న్న బ్యాంకులకు మా ప్రాధాన్యం కొనసాగుతుంది. గత రెండు మూడు నెలల కాలంలో నాణ్యమైన స్టాక్స్‌ అధికంగా పెరిగాయి. ఈ బుడగ సమీప కాలంలో పేలిపోతుందని అనుకోవడం లేదు. అయితే 70-80 పీఈకి చేరిన స్టాక్స్‌ నుంచి కొంత మేర పెట్టుబడులను వేరే వాటికి కేటాయిస్తున్నాం. వృద్ది అవకాశం ఉండి, కొంత చౌకగా, రిస్క్‌ తక్కువ ఉండే వాటిల్లో పెట్టుబడులు పెడుతున్నాం.

 

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కొంత మేర పెట్టుబడులు పెట్టాం. అంతర్జాతీయ సైక్లికల్స్‌ ఆధారంగా మెటల్స్‌పై అధిక వెయిటేజీతో ఉన్నాం. ఇండస్ట్రియల్స్‌ పట్ల ప్రతికూలంగా ఉన్నాం. మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయాలంటే జీడీపీ 4.5 శాతం స్థాయిల్లో ఉన్నప్పుడే పెట్టుబడులు పెట్టాలి. జీడీపీ 10 శాతం స్థాయిలో ఉన్నప్పుడు కాదు. ఎందుకంటే ఆ సమయంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు తగ్గిపోతాయి. ఈ అభిప్రాయం ఉన్న ఇన్వెస్టర్లు కూడా ఉన్నారు’’ అని నీలకాంత మిశ్రా వివరించారు. 



You may be interested

ప్రైవేటు బ్యాంకులు, ఫార్మా అనుకూలం: ఎమ్‌కే గ్లోబల్‌

Monday 23rd December 2019

ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతుందని, 2019లో చూసిన దానితో పోలిస్తే మరింత విస్తృతంగా ఉంటుందని ఎమ్‌కే గ్లోబల్‌ ఫండ్‌ మేనేజర్‌ సచిన్‌ షా అన్నారు. ఇప్పటి వరకు ప్రధాన సూచీల్లోని స్టాక్స్‌ ఏ విధంగా అయితే ర్యాలీ చేశాయో.. అదే విధంగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగంలో మెరుగైన, సమర్థవంతమైన నిర్వహణ కలిగినవి ర్యాలీ చేస్తాయన్న అభిప్రాయాన్ని షా వ్యక్తం చేశారు. కనుక ప్రధాన సూచీలకు వెలుపల ఈ విధమైన నాణ్యమైన

వచ్చే వారానికి రెండు స్టాక్స్‌

Saturday 21st December 2019

గత వారంకొంత కన్సాలిడేషన్‌ తదుపరి శుక్రవారం(20)తో ముగిసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. అటు సెన్సెక్స్‌, ఇటు నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. ఇందుకు గత రెండు వారాలలో మెరుగుపడిన సెంటిమెంటు దోహదపడినట్లు మార్కెట్‌ విశ్లేషకులు కునాల్‌ బోత్రా పేర్కొంటున్నారు. రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, కొటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ తదితర బ్లూచిప్స్‌ ఇందుకు సహకరించినట్లు  తెలియజేశారు. ఈ సందర్భంగా కునాల్‌ బోత్రా వచ్చే వారానికి రెండు స్టాక్స్‌

Most from this category