STOCKS

News


ప్రభుత్వ బ్యాంకులపై ప్రతికూలంగా ఉన్నాం

Tuesday 3rd September 2019
Markets_main1567502579.png-28164

-హెమాంగ్‌జానీ
ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం జరిగినప్పటికి ఈ బ్యాం‍కులలో గణనీయమైన మెరుగుదల ఉంటుందని అనుకోవడంలేదని షేర్‌ఖాన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హెమాంగ్‌ జానీ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే...

విలీనం తర్వాత మెరుగుదల చూడలేదు..
ప్రభుత్వరంగ బ్యాంకు విలీనాలను ఇది వరకు చూశాం. విలీనం వలన బ్యాంక్‌ల ఆపరేటింగ్‌ లేదా వ్యాపారం పరంగా ఎటువంటి మెరుగుదల కనిపించలేదు. బ్యాంకుల విలీనంలో ప్రభుత్వానికి స్వంత ప్రాధాన్యతలుండొచ్చు కానీ క్రింది స్థాయిలో గమనిస్తే రుణాల పరంగా లేదా ఇతరత్రా పరంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయవలసిన అవసరం లేదు. తాజా చర్య వలన ఈ ఇష్యుపై కొంత సానుకూలత ఉన్నప్పటికిక డీరేటింగ్‌ లేదా నిర్మాణాత్మక  పరంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ విభాగంలో గణనీయమైన మెరుగుదల ఉం‍టుందని అనుకోవడం లేదు. ఈ విభాగంలో ప్రతికూలతను కొనసాగిస్తున్నాం.

ఆటోరంగానికి టైం పడుతుంది..
దీర్ఘకాలంగా కొనసాగుతున్న మందగమనం, నెలవారి ఆటో సంఖ్యలు అధ్వాన్నంగా వెలువడుతుండడంతో ప్రతి ఒక్కరికి తమ ఆలోచన ప్రకారం ఆటో సెక్టార్‌ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో..ఒక అంచనా ఉంటుంది. ఈ సెక్టార్‌లో తిరిగి వృద్ధి పుంజుకోడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉం‍ది. ఈ రంగంపై విస్తృతమైనా దృక్పథాన్ని ఏర్పాటు చేసుకునే ముందు, వచ్చే రెండు మూడు నెలలో ఆటో నెంబర్లు ఏవిధంగా వెలువడతాయో వేచి చూడడం మంచిది. ప్రస్తుతం వెలువడిన ఆటో నెంబర్లను గమనిస్తే మరింత నెగిటివిటీ ఈ సెక్టార్‌లో కనిపిస్తోంది. ఈ సెక్టార్‌లో వృద్ధి తిరిగి పుంజుకుంటుంది. కానీ కొం‍త సమయం వేచి చూడాలి.

కార్పోరేట్‌ ఆదాయాలు వచ్చే రెండేళ్లు తగ్గుతాయి...
జూన్‌ త్రైమాసికానికి సంబంధించి కార్పోరేట్‌ ఆదాయాలు క్షీణించాయి. కానీ అవి అంచనాలకు దగ్గర్లోనే ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వచ్చే ఏడాది, ఆ తర్తాత ఏడాది కాలంలో కార్పోరేట్‌ ఆదాయాల తగ్గుదలను చూడవచ్చు. మా కవరేజిలో ఉన్న 75 శాతం కంపెనీల ఆదాయాలను వచ్చే ఏడాది, ఆ తర్వాత ఏడాదికి గాను డౌన్‌ గ్రేడ్‌ చేశాం. ప్రస్తుతానికి, ఎవరికీ ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఏ కంపెనీల ఆదాయ వృద్ధి బాగుంటుందో చెప్పడానికి ఇంకొంత సమయం వేచి చూడాలి.  జూన్‌ త్రైమాసికానికి సంబంధించి ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంకులు , బజాజ్‌ ఫైనాన్స్‌, ఇతర వినియోగాధారిత కంపెనీలు, ఐటీ కంపెనీల ఆదాయాల వృద్ధి బాగుంది. నా అంచనా ప్రకారం ఈ పరిస్థితులలో మంచి ప్రదర్శన చేస్తున్నా‍ ఇటువంటి స్టాకుల వైపు  ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతారు. You may be interested

మెటల్‌ షేర్లకు మాంద్యం భయాలు

Tuesday 3rd September 2019

అంతర్జాతీయ ఆర్థిక మందగమన భయాలతో మెటల్‌ షేర్లు మంగళవారం భారీ పతనాన్ని చవిచూసాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 2.50శాతం మేర కరిగిపోయింది. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2,269.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అగ్రరాజ్యాలైన అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంతో అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన భయాలు నెలకొన్నాయి. ఫలితంగా ప్రపంచ మార్కెట్లో మెటల్‌ షేర్లకు డిమాండ్‌ భారీగా క్షీణించింది. అక్కడి

మార్కెట్‌ పతనానికి 5 కారణాలు

Tuesday 3rd September 2019

జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మంగళవారం మిడ్‌సెషన్‌ కల్లా మార్కెట్‌ భారీ నష్టాలను చవిచూసింది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 37000, నిఫ్టీ 11000 స్థాయిలను కోల్పోయాయి. సెన్సెక్స్‌ 484 పాయింట్లు పతనమై 36,823.12 వద్ద  నిఫ్టీ 245 పాయింట్ల 10,878.40 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. విలీన ప్రక్రియ ప్రతిపాదన నేపథ్యంలో మొండిబకాయిలు పెరగవచ్చనే భయాలతో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. అగస్ట్‌లో వాహన

Most from this category