STOCKS

News


ఫార్మాలో ఇండిట్రేడ్‌ సిఫారసులు ఇవి...

Sunday 21st July 2019
Markets_main1563733301.png-27207

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఎఫ్‌పీఐలకు ట్రస్ట్‌ల రూపంలో ఎటువంటి ఉపశమనం లేదంటూ ఇచ్చిన స్పష్టత మార్కెట్లకు తుఫానులా పరిణమించిందన్నారు ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌కు చెందిన సుదీప్‌ బంధోపాధ్యాయ. ఎఫ్‌పీఐలకు ఇది ఆందోళన కలిగించేదని, దీనికి కారణం 40 శాతం ఎఫ్‌పీఐలు ట్రస్ట్‌ మార్గంలోనే మన ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. మార్కెట్ల పతనానికి కార్పొరేట్‌ కంపెనీల ఫలితాలు మెరుగ్గా లేకపోవడం కూడా కారణంగా పేర్కొన్నారు. మేనేజ్‌మెంట్ల వ్యాఖ్యలు సైతం మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చే విధంగా లేనట్టు చెప్పారు. ఇక మార్కెట్ల నష్టాలకు మూడో కారణంగా రుతుపవనాల పురోగతి ఆశాజనకంగా లేకపోవడమని అన్నారు. వర్షాకాలానికి జూలై చాలా మెరుగైనదని, కానీ ఈ నెలలో 15 శాతానికి పైగా వర్షాభావం ఉన్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు బులిష్‌గానే ఉన్నప్పటికీ మన మార్కెట్లలో అమ్మకాలు ఆగడం లేదని బందోపాధ్యాయ తెలిపారు. 


  
యస్‌ బ్యాంకు
యస్‌ బ్యాంకు ఫలితాలు మంచిగా ఉన్నట్టు సుదీప్‌ బందోపాధ్యాయ వ్యాఖ్యానించారు. రుణ మార్కెట్లు చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ఈ దశలో యస్‌ బ్యాంకుకు మలివిడత నిధుల సమీకరణే చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. ఎంత ధరకు యస్‌ బ్యాంకు వాటాల జారీ ద్వారా నిధులను సమీకరిస్తుందనేది ముఖ్యమని, రూ.100 ధరపై నిధుల సమీకరణ అన్నది బ్యాంకు సమర్థతపై ఆధారపడి ఉందని చెప్పారు. ఈ స్థాయి ధర కంటే తక్కువకు రూ.83-84 ధరల్లో నిధులు సమీకరిస్తే అది బ్యాంకుకు నష్టమేనన్నారు. ఎందుకంటే బుక్‌ విలువ రూ.100గా ఉన్నట్టు చెప్పారు. 

 

ఫార్మాలో అవకాశాలు
సంప్రదాయంగా సురక్షిత రంగమైన ఫార్మా పట్ల తాము సానుకూలంగా ఉన్నట్టు బందోపాధ్యాయ చెప్పారు. గత కొన్ని సంవత్సరాల్లో ఈ రంగం ఇన్వెస్టర్లకు పెద్దగా ఇచ్చింది లేదన్నారు. అయితే, ఈ రంగంలో ఎంపిక చేసిన వాటిల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని సూచించారు. లార్జ్‌క్యాప్‌ ఫార్మా కంపెనీల్లో డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రస్తుత ధర వద్ద చాలా ఆకర్షణీయంగా ఉందని తెలిపారు. చైనా విషయంలో కంపెనీ అనుసరిస్తున్న విధానం, నియంత్రణ సంస్థలతో డీల్‌ చేసే విధానం చూసి ఈ స్టాక్‌ పట్ల బులిష్‌గా ఉన్నట్టు వివరించారు. మిడ్‌క్యాప్‌ ఫార్మాలో జుబిలంట్‌ లైఫ్‌ సైన్స్‌ను సూచించారు. అలాగే, దేశీయ మార్కెట్‌పై ఫోకస్‌ చేసిన టోరెంట్‌ ఫార్మానూ సిఫారసు చేశారు. You may be interested

నగదు నిల్వలకే మ్యూచువల్‌ ఫండ్స్‌ ప్రాధాన్యం!

Sunday 21st July 2019

నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీ ఈ ఏడాది ఇంత వరకు నిఫ్టీ-50 సూచీతో పోలిస్తే 18 శాతం నష్టాలను మిగిల్చింది. ఒకవైపు ఆర్థిక రంగ వృద్ధి తిరోగమనంలో ఉండడం, మార్కెట్లు బేల చూపులు చూస్తుండడం, ఇప్పటికే బాగా దిద్దుబాటుకు గురైన, స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ఇంకా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటుండడం ఇలా ఎన్నో అంశాలు మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లను ఆలోచనలో పడేశాయి. ఫలితమే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ పథకాలు నగదు నిల్వలను

బేరిష్‌ దశలోకి మార్కెట్లు: ఉమేష్‌ మెహతా

Sunday 21st July 2019

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎఫ్‌పీఐలకు పన్ను మినహాయింపు లేదంటూ చేసిన ప్రకటన, బలహీన రుతుపవనాలు మార్కెట్ల నష్టాలకు కారణమని, ఈ పరిణామాలతో మార్కెట్లు బేరిష్‌ దశలోకి అడుగుపెట్టినట్టు శామ్కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల్లో బలహీనత, క్షేత్రస్థాయిలో మందగమనం మార్కెట్లను కనిష్టాలకు తీసుకెళ్లాయన్నారు. ఇప్పటికీ స్టాక్స్‌ విలువలు గరిష్టాల్లోనే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.    కంపెనీల ఫలితాల సీజన్‌ తారా స్థాయికి చేరిందని,

Most from this category