News


మల్టీ బ్యాగర్ల వేటలో రిటైల్‌ ఇన్వెస్టర్లు

Friday 27th March 2020
Markets_main1585247400.png-32697

మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ ఏమున్నాయి..? అంటూ గూగుల్‌ సెర్చ్‌ బార్‌లో వెతుకుతున్నారా..? గూగుల్‌ ట్రెండ్స్‌ను గమనిస్తే.. మల్టీబ్యాగర్ల కోసం అన్వేషణ తారా స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెట్లు కరెక్షన్‌కు గురైన సందర్భాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంటుంది. మల్టీబ్యాగర్ల కోసం అన్వేషణ గరిష్ట స్థాయికి చేరడం చివరిగా 2019 ఏప్రిల్‌లో జరిగింది. అప్పుడు మార్కెట్లు పతన బాటలోనే ఉన్నాయి. నిఫ్టీ 11856 పాయింట్ల నుంచి 11,108 పాయింట్లకు నాడు క్షీణించింది. కొన్న ధర నుంచి ఓ స్టాక్‌ 100 శాతానికి పైగా పెరిగితే దాన్ని మల్టీబ్యాగర్‌గా పేర్కొంటుంటారు. సాధారణంగా రిటైల్‌ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తమ పెట్టుబడి ఎన్నో రెట్లు పెరిగిపోవాలని కోరుకుంటుంటారు. అటువంటి కాంక్షతో తప్పుడు స్టాక్స్‌ను ఎంచుకుని నష్టపోయే వారు ఎక్కువ మంది కనిపిస్తారు. కానీ, మల్టీబ్యాగర్‌ స్టాక్‌ను ఎంచుకునే విషయంలో నాణ్యతకే మొదటి స్థానం ఇవ్వాలి. గూగుల్‌ ట్రెండ్స్‌ ప్రస్తుతం మల్టీబ్యాగర్‌ కోసం సెర్చింగ్‌ 100 పాయింట్లకు చేరింది.  

 

మార్కెట్లు బాగా పడిపోవడంతో కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లవైపు అడుగులు వేస్తున్నారు. దీంతో కొత్త అకౌంట్ల కోసం డిమాండ్‌ పెరిగిపోయింది. ప్రస్తుతం మార్కెట్లు మూడేళ్ల కనిష్ట స్థాయిలో ఉన్నాయి. దలాల్‌ స్ట్రీట్‌లో రికవరీకి కొంత సమయం పడుతుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 2020లో రాబడులు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే లౌక్‌డౌన్‌ కారణంగా మన ఆర్థిక వృద్ధి మరింత క్షీణించనుంది. ‘‘స్మాల్‌కేస్‌ టెక్నాలజీస్‌ నూతన ఇన్వెస్టర్ల సంఖ్య మార్చిలో బాగా పెరిగింది. నెలవారీగా చూస్తే మార్చిలో నూతన ఖాతాలు మూడున్నర రెట్లు అధికంగా ఉన్నట్టు ఆ సంస్థ చెబుతోంది. అలాగే, మార్చిలో లావాదేవీలు నిర్వహించిన నూతన ఇన్వెస్టర్లలోనూ ఒకటిన్నర రెట్లు వృద్ధి ఉంది’’ అని తెలిపింది. ‘‘ఎంతో ప్రతికూలత, నిరాశావాదం నెలకొని ఉంది. గత రెండేళ్లలో స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ఉన్నాయి. కానీ, గడిచిన రెండు వారాలు అయితే భయంకరం. యస్‌ బ్యాంకు స్టోరీతో ఇది మొదలైంది. యస్‌ బ్యాంకు సంక్షోభం వేలాది చిన్న ఇన్వెస్టర్లపై ప్రభావం చూపించింది. తర్వాత కోవిడ్‌ వైరస్‌ కారణంగా అంతర్జాతీయంగా మార్కెట్ల పతనం, చమురు ధరల పతనం చూశాం’’ అని 5పైసా డాట్‌కామ్‌ సీఈవో ప్రకాష్‌ గగ్దానీ తెలిపారు. ప్రస్తుతం ఇన్వెస్టర్లు వారి వద్దనున్న స్టాక్స్‌ను విక్రయిస్తున్నారని, నష్టాలు బుక్‌ చేసుకుంటున్నారని ఆయన వెల్లడించారు. కొంత మంది మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు కూడా వెనక్కి తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ‘‘మరోవైపు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా నూతన ఇన్వెస్టర్ల రాక కూడా పెరిగింది. ఈ పరిస్థితి ఎంతో అసాధారణం. 20 ఏళ్ల స్టాక్‌ మార్కెట్‌ అనుభవంలో ఎంతో మంది ఖాతాలు ఈ విధంగా తెరవడాన్ని చూడలేదు. ఇంతకుముందు మార్కెట్ల వైపు చూడని మిలీనియల్స్‌ కూడా వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇది మంచి సంకేతం’’ అని మార్కెట్లలో పరి‍స్థితిని గగ్దానీ వెల్లడించారు.

 

తాము సైతం ఇంతకుముందుతో పోలిస్తే అధిక రేటుతో నూతన ఖాతాలను తెరుస్తున్నామని, ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో ఇది ఎంతో ఆశ్చర్యాన్ని ఇస్తోందని జెరోదా ప్రమోటర్‌ నితిన్‌ కామత్‌ తెలిపారు. ఇన్వెస్టర్లలో పరిణతిని ఇది తెలియజేస్తోందన్నారు. మన మార్కెట్లు 35 శాతం పడిపోయి ఉన్నాయి. అయితే, మ్యూచువల్‌ ఫండ్స్‌ సిప్‌ ఇన్వెస్టర్లు తమ సిప్‌లను కొనసాగించడం సానుకూల అంశమే. ‘‘ప్రస్తుతం సూచీలు బేర్‌ మార్కెట్లలో ఉన్నాయి. చారిత్రకంగా చూస్తే సూచీలు రికవరీ అయ్యేందుకు 18-36 నెలలు పడుతుంది. 2007-08 మాంద్యం సమయంలో సూచీలు రికవరీ అయ్యేందుకు 15 నెలలు తీసుకుంది. రికవరీ ప్రక్రియ నిదానంగా ఉంటుంది. ఇన్వెస్టర్లు సరైన అవకాశం కోసం వేచి చూడాలి’’ అని క్యాపిటల్‌వయా గ్లోబల్‌కు చెందిన గౌరవ్‌గార్గ్‌ తెలిపారు. ఇన్వెస్టర్లు నాణ్యమైన స్టాక్స్‌కే పరిమితం కావాలి, డిమాండ్‌పై మార్కెట్ల రికవరీ ఆధారపడి ఉంటుందన్నారు.You may be interested

మళ్లీ సానుకూల ఓపెనింగ్‌ నేడు!

Friday 27th March 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 67 పాయింట్లు ప్లస్‌ ఆసియా మార్కెట్లు 1-3 శాతం ప్లస్‌ గురువారం అమెరికా మార్కెట్లు జూమ్‌ నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.15 ప్రాంతం‍లో  67 పాయింట్లు పుంజుకుని 8,754 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఏప్రిల్‌ ఫ్యూచర్‌ 8,687 పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్థిక

వైరస్‌ వ్యాప్తి నిరోధానికి లాక్‌డౌన్‌ సరిపోదు: రాజన్‌

Thursday 26th March 2020

భారత్‌లో ప్రకటించిన లౌక్‌డౌన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమమని, వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ఈ చర్య ఒక్కటి సరిపోదని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. ‘‘ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే లౌక్‌డౌన్‌ ప్రజలను పనులకు వెళ్లకుండా ఇళ్లకే కట్టిపడేసింది. అదేమీ అత్యంత సురక్షిత ప్రదేశం కాదు. ప్రజలు మురికివాడల్లోనూ నివసిస్తున్నారు’’ అని రాజన్‌ బ్లూంబర్గ్‌ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తెలిపారు. ఇన్ఫెక్షన్లను

Most from this category