News


మూడేళ్లలో రెట్టింపైన హెచ్‌యూఎల్‌.. ఇంకా ఎంత?

Friday 28th June 2019
Markets_main1561745927.png-26668

హిందుస్తాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ కంపెనీలో మూడేళ్ల క్రితం ఇన్వెస్ట్‌ చేసి, ఇప్పటికీ ఆ పెట్టుబడిని కొనసాగించిన ఇన్వె‍స్టర్లకు రెట్టింపు ప్రతిఫలం దక్కినట్టే. మూడేళ్లలో ఈ షేరు 106 శాతం పెరిగింది. 2016 జూన్‌ 27న ఈ షేరు ధర రూ.859.80. తాజా ధర రూ.1787.30. కానీ, ఇదే కాలంలో సెన్సెక్స్‌ 50 శాతమే పెరగ్గా, నిఫ్టీ 46 శాతం రాబడినిచ్చింది. సూచీలకు మించి ఈ కంపెనీ దిగ్గజ రాబడులను ఇచ్చినట్టు.  

 

హెచ్‌యూఎల్‌కు ఎన్నో బలాలు ఉన్నాయన్నది మోతీలాల్‌ ఓస్వాల్‌ విశ్లేషణ. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా తన ఉత్పత్తుల ఆమోదనీయతను వేగంగా పెంచుకోవడం, బలమైన నిర్వహణ, ప్రీమియం ట్రెండ్‌, టెక్నాలజీని విస్తృతంగా వినియోగించడం బలాలుగా పేర్కొంది. 2018-19లో అమ్మకాల పరంగా 10 శాతం వృద్ధిని హెచ్‌యూఎల్‌ నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి 6 శాతంగానే ఉండడం గమనార్హం. ఆపరేటింగ్‌ మార్జిన్‌ 23 శాతానికి పెంచుకుంది. ఇది కంపెనీ అంతర్జాతీయ విధానంలో భాగం. ధరల పరంగా వృద్ధికితోడు, ప్రభావవంతమైన ఉత్పత్తుల మిశ్రమం ఉన్నట్టు ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. హెచ్‌యూఎల్‌కు గత ఆర్థిక సంవత్సరం నిర్వహణ పరంగా బలమైన సంవత్సరమని, ఆదాయం 12 శాతం, నికర లాభం 17.3 శాతం చొప్పున పెరిగినట్టు బీఎన్‌పీ పారిబాస్‌ తెలిపింది. జీఎస్‌కే కన్జ్యూమర్‌ ఉత్పత్తులైన బూస్ట్‌, హార్లిక్స్‌ల కొనుగోలు కంపెనీ ఫుడ్‌ వ్యాపారానికి బలాన్నిస్తుందని, మంచి వర్షాలు, గ్రామీణ ఆర్థిక రంగం మెరుగుపడి, డిమాండ్‌ పెరిగితే కంపెనీకి అనుకూలమని అనలిస్టులు పేర్కొంటున్నారు. హెచ్‌యూఎల్‌ నోటి సంరక్షణ, కేశ సంరక్షణ, చర్మ సంరక్షణ తదితర అన్ని విభాగాల్లోనూ ఉత్పత్తులను తీసుకురావాలన్న ప్రణాళికతో ఉంది. స్థూల ఆర్థిక సమస్యలు, గ్రామీణ ఆర్థిక మందగమనం ఉన్నా కానీ కంపెనీ వృద్ధి కొనసాగుతుందని ఎడెల్‌వీజ్‌ అంచనా వేస్తోంది. 

 

మోతీలాల్‌ ఓ‍స్వాల్‌ అయితే రూ.2,070 ధర లక్ష్యంగా కొనుగోలుకు సిఫారసు చేయగా, ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ కూడా రూ.2,039 టార్గెట్‌తో బై రేటింగ్‌ ఇచ్చింది. బీఎన్‌పీ పారిబాస్‌ రూ.1,990 టార్గెట్‌తో, యాక్సిస్‌ డైరెక్ట్‌ రూ.1,875 టార్గెట్‌తో బై రేటింగ్‌ ఇచ్చాయి. ఇక జేఎం ఫైనాన్షియల్‌ రూ.1,825 లక్ష్యంతో హోల్డ్‌ చేసుకోవచ్చని చెప్పగా, ఒక్క కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ మాత్రం రూ.1,575 టార్గెట్‌తో పొజిషన్లను తగ్గించుకోవాలని సూచించింది. You may be interested

చౌకగా ఉన్నాయని వలలో పడొద్దు!

Friday 28th June 2019

బీఎస్‌ఈలో ప్రతీ ఆరు చురుగ్గా ట్రేడయ్యే స్టాక్స్‌లో ఒకటి 2019లో కొత్త కనిష్ట స్థాయికి పడిపోయినదే. ఇదే కాలంలో ప్రధాన సూచీలు రాబడులను ఇవ్వడం గమనార్హం. ఇలా పతమైన వాటిల్లో 70 శాతం కంపెనీలకు ఈ తరహా అనుభవాలు గతంలో ఎదురు కాలేదు. ఇవి ఇన్వెస్టర్ల సంపదను వాటి ఏడాది గరిష్ట ధరల నుంచి చూస్తే 50-95 శాతం మధ్య తుడిచిపెట్టేశాయి. క్యాఫ్‌ ఫ్లో, అధిక రుణ భారం, ప్రమోటర్ల

11800ల దిగువకు నిఫ్టీ

Friday 28th June 2019

మార్కెట్‌ వారంతాన్ని నష్టాలతో ముగించింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకు, మెటల్‌ షేర్ల పతనంతో సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 192 పాయిం‍ట్లను కోల్పోయి 39,394.64 వద్ద, నిఫ్టీ 52.60 పాయింట్లు నష్టపోయి 11800ల దిగువన 11,789 వద్ద స్ధిరపడ్డాయి. సూచీలకు ఇది వరుసగా రెండోరోజూ నష్టాల ముగింపు. నేటి నుంచి ప్రారంభం కానున్న జీ 20 సమావేశంలో ట్రంప్‌, జిన్‌పింగ్‌లు తమ దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య వివాదాలకు

Most from this category