News


నిత్యావసరాలకు భారీ గిరాకీ

Tuesday 17th March 2020
Markets_main1584432843.png-32531

ఎఫ్‌ఎంసీజీ కంపెనీలన్నీ అధిక సంఖ్యలో ఉత్పత్తులను విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి.
కరోనా మహమ్మారిని భారత్‌లో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జనసమూహ ప్రాంతాలను నిషేధించడం, సినిమాహాళ్లు, పబ్‌లు, విద్యాలయాలు  మూసివేత వంటివాటిని కేంద్రప్రభుత్వంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేస్తున్నాయి. దీంతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీల విక్రయాలు భారీగా పెరిగాయి. కరోనా భయంతో వినియోగదారులంతా శానిటేషన్‌ నుంచి ఫుడ్‌ వరకు సంబంధించిన ఉత్పత్తులను కొనుక్కోని నిల్వ చేసుకుంటుండడంతో ఎఫ్‌ఎంసీజీల విక్రయాలు భారీగా పెరిగాయి. జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌, టైటన్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీలతో పోలిస్తే ‘‘హిందుస్థాన్‌ యూనీలీవర్‌, డాబర్‌ ఇండియా, గోద్రేజ్‌ కన్జూమర్‌, మారికో, ఎవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ కంపెనీల ఉత్పత్తుల  విక్రయాలు పెరిగాయి.

నిత్యవసరాల డిమాండ్‌ 
 చైనాలో కరోనా వైరస్‌ బయటపడిన జనవరి 20 నుంచి చూస్తే  ప్రపంచ మార్కెట్లతోపాటు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు భారీగా పడిపోయాయి. నిత్యవసరాలు విక్రయించే కంపెనీలు సగటున 9.4 శాతం పడిపోతే, అత్యవసరంకాని వస్తువులు విక్రయించే కంపెనీల షేర్లు సగటున 20.7 శాతం పడిపోయాయి. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలను బ్యాన్‌ చేయడంతో వినియోగదారుల్లో కరోనాపై అవగాహనతోకూడిన భయం పెరగడంతో సాధారణ రోజులకంటే ఇప్పుడు అధికమొత్తంలో నిత్యవసరాలను కొనుక్కోని ఇళ్లలో పెట్టుకుంటున్నారు. దీంతో కంపెనీలన్నీ నిత్యవసరాలు, రిటైల్‌ ఉత్పత్తుల విక్రయాలు పెంచుకునేందుకు దృష్టిపెట్టాయి. ఫలితంగా ఈ సమయంలో కంపెనీల ఆదాయం పెరిగేఅవకాశం ఉంది. ఆహార పదార్ధాలే కాకుండా శానిటేషన్‌ ఉత్పత్తులకు సైతం డిమాండ్‌ బాగా పెరగడంతో కంపెనీలన్నీ డిస్కౌంట్‌ తగ్గించి విక్రయిస్తున్నాయి. దీంతో 2020లో ఎఫ్‌ఎంసీజీ కంపెనీల త్రైమాసిక ఆదాయాలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎఫ్‌ఎంజీల షేర్ల తీరిలా
జూబిలెంట్‌ షేరు 3 శాతం పతనమై 1,359.05 వద్ద, టైటన్‌ 1 శాతం పెరిగి 1,024.35 వద్ద, పేజ్‌ ఇండస్ట్రీస్‌ 2 శాతం పెరిగి 19,465 వద్ద, వెస్ట్‌లైఫ్‌ 2 శాతం పెరిగి 350.00 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాబర్‌ ఇండియా 4 శాతం పెరిగి 449.50 వద్ద, గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్ 1 శాతం పెరిగి 511.20 వద్ద,  ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ 5 శాతం పెరిగి 2,096.00 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 


 



You may be interested

పతనం కొనసాగితే ప్రమోటర్లకు తిప్పలే..!

Tuesday 17th March 2020

కోవిడ్‌-19 భయాలతో గడచిన రెండు వారాల్లో భారత ఈక్విటీ మార్కెట్‌ భారీ పతనాన్ని చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో సుమారు 180 స్మాల్‌, మిడ్‌ కంపెనీలకు చెందిన ప్రమోటర్లు తనఖా పెట్టిన మొత్తం షేర్లలో 70శాతం వరకు కోల్పోయే అవకాశం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దలాల్‌ స్ట్రీట్‌లో పతనం ఆగకపోతే కొందరు ప్రమోటర్లు ఏకంగా కంపెనీలో తమ యాజమాన్య హక్కును కోల్పోయి ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.  మార్కెట్‌ పతనంలో భాగంగా షేర్ల

ఎస్‌బీఐ కార్డ్స్‌ 8.50శాతం అప్‌..!

Tuesday 17th March 2020

కరోనా ఎఫెక్ట్‌తో లిస్టింగ్‌లో నిరాశపరిచిన ఎస్‌బీఐ కార్డ్స్‌ షేరు మరుసటి రోజు లాభాల బాటపట్టింది. బీఎస్‌ఈలో మంగళవారం ఈ షేరు రూ.685.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ రికవరిలో భాగంగా మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే ఎస్‌బీఐ కార్డ్స్‌ షేరు కొనుగోలుకు ఇన్వెస్టర్లు మొగ్గచూపారు. ఫలితంగా ఒక దశలో షేరు ఒక 9శాతం లాభపడి రూ.744.50 వద్ద ఇంట్రాడే గరిష్టా‍న్ని అందుకుంది. మధ్యాహ్నం గం.12:20ని.లకు షేరు మునుపటి ముగింపు(రూ.683.20)తో పోలిస్తే 8.50శాతం

Most from this category